MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ICC Rankings : వన్డే కింగ్ ఎవరు? రోహిత్ శర్మకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లీ.. కేవలం 8 పాయింట్లు !

ICC Rankings : వన్డే కింగ్ ఎవరు? రోహిత్ శర్మకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లీ.. కేవలం 8 పాయింట్లు !

ICC ODI Rankings : తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రెండో స్థానానికి ఎగబాకాడు. అగ్రస్థానంలో ఉన్న రోహిత్ శర్మకు గట్టి పోటీనిస్తున్నాడు. వీరిద్దరి మధ్య కేవలం 8 పాయింట్ల తేడా మాత్రమే ఉండటంతో నెంబర్ 1 పోరు ఆసక్తికరంగా మారింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 10 2025, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా జోరు.. నెంబర్ 1 కోసం రోహిత్, కోహ్లీ ఫైట్
Image Credit : Gemini

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా జోరు.. నెంబర్ 1 కోసం రోహిత్, కోహ్లీ ఫైట్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వన్డే క్రికెట్‌లో నెంబర్ 1 బ్యాటర్ స్థానం కోసం భారత దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య పోటీ ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. 

తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో రెండో స్థానానికి ఎగబాకగా, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

26
రోహిత్ రికార్డుకు కోహ్లీ ముప్పు
Image Credit : X/BCCI

రోహిత్ రికార్డుకు కోహ్లీ ముప్పు

ప్రస్తుతం వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ 781 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లీ 773 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అంటే, వీరిద్దరి మధ్య వ్యత్యాసం కేవలం 8 పాయింట్లు మాత్రమే. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో కోహ్లీ చెలరేగి ఆడటంతో ఈ అంతరం భారీగా తగ్గింది.

37 ఏళ్ల కోహ్లీ, ఏప్రిల్ 2021లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజం చేతిలో తన నెంబర్ 1 స్థానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ ఆ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అత్యంత చేరువలోకి వచ్చాడు.

Related Articles

Related image1
IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
Related image2
IND vs SA: హార్దిక్ హిట్ షో.. రీఎంట్రీలో సఫారీలకు చుక్కలు ! సిక్సర్ల కింగ్
36
సఫారీ సిరీస్‌లో పరుగుల వరద
Image Credit : Facebook/Indian Cricket Team

సఫారీ సిరీస్‌లో పరుగుల వరద

సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ సిరీస్‌లో ఏకంగా 302 పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును సొంతం చేసుకున్నాడు. విశాఖపట్నంలో జరిగిన నిర్ణయాత్మకమైన ఆఖరి వన్డేలో అజేయంగా 65 పరుగులు చేసి, సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రాంచీ, రాయ్‌పూర్ లో జరిగిన మ్యాచ్‌లలో వరుసగా రెండు సెంచరీలు బాదిన కోహ్లీ, 151 సగటుతో, 117.05 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టాడు. ఈ ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్‌లను వెనక్కి నెట్టాడు. మరోవైపు, రోహిత్ శర్మ కూడా ఈ సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలతో సహా మొత్తం 146 పరుగులు చేసి తన నెంబర్ 1 ర్యాంకును కాపాడుకున్నాడు.

46
జనవరి 11 నుంచి అసలు పోరు
Image Credit : Facebook/Indian Cricket Team

జనవరి 11 నుంచి అసలు పోరు

జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ ఈ ఇద్దరు దిగ్గజాలకు అత్యంత కీలకం కానుంది. ఈ సిరీస్‌లో రాణించడం ద్వారా రోహిత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తుండగా, కోహ్లీ మాత్రం ఆ 8 పాయింట్ల లోటును భర్తీ చేసి తిరిగి ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్‌గా అవతరించాలని పట్టుదలగా ఉన్నాడు.

టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌పైనే పూర్తిగా దృష్టి సారించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మొదట డకౌట్లు అయినప్పటికీ, అక్కడి వన్డే సిరీస్‌ను అజేయమైన 74 పరుగులతో ముగించిన కోహ్లీ, స్వదేశంలో సఫారీలపై ఆ జోరును కొనసాగించాడు.

56
బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్
Image Credit : AFP

బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్

బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ భారత ఆటగాళ్లు సత్తా చాటారు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో కుల్దీప్ అత్యధిక వికెట్లు (9) తీసిన బౌలర్‌గా నిలిచాడు. 20.78 సగటుతో, 6.23 ఎకానమీ రేట్‌తో బౌలింగ్ చేసిన కుల్దీప్, నిర్ణయాత్మక మ్యాచ్‌లో 10-1-41-4 గణాంకాలతో అదరగొట్టాడు. ప్రస్తుతం వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్), జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లాండ్) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఇతర ఆటగాళ్ల ర్యాంకింగ్స్ విశేషాలు

  • కేఎల్ రాహుల్: వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రెండు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంకుకు చేరుకున్నాడు.
  • శుభ్‌మన్ గిల్: గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన గిల్ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు.
  • శ్రేయస్ అయ్యర్: గాయంతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్ టాప్-10వ స్థానానికి పడిపోయాడు.
  • టీ20 ర్యాంకింగ్స్: కటక్‌లో దక్షిణాఫ్రికాపై 101 పరుగుల భారీ విజయం సాధించిన తర్వాత టీ20 ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ (13వ), అర్ష్‌దీప్ సింగ్ (20వ), జస్ప్రీత్ బుమ్రా (25వ) తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.
  • టెస్ట్ క్రికెట్: యాషెస్ సిరీస్‌లో 18 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) బౌలింగ్ చార్ట్‌లో మూడో స్థానానికి ఎగబాకాడు.
66
ఐసీసీ టాప్-10 వన్డే బ్యాటర్లు వీరే
Image Credit : instagram/indiancricketteam

ఐసీసీ టాప్-10 వన్డే బ్యాటర్లు వీరే

1. రోహిత్ శర్మ (భారత్) - 781 పాయింట్లు

2. విరాట్ కోహ్లీ (భారత్) - 773 పాయింట్లు

3. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) - 766 పాయింట్లు

4. ఇబ్రహీం జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) - 764 పాయింట్లు

5. శుభ్‌మన్ గిల్ (భారత్) - 723 పాయింట్లు

6. బాబర్ ఆజం (పాకిస్థాన్) - 722 పాయింట్లు

7. హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్) - 708 పాయింట్లు

8. షాయ్ హోప్ (వెస్టిండీస్) - 701 పాయింట్లు

9. చరిత్ అసలంక (శ్రీలంక) - 690 పాయింట్లు

10. శ్రేయస్ అయ్యర్ (భారత్) - 679 పాయింట్లు

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Recommended image2
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image3
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related Stories
Recommended image1
IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
Recommended image2
IND vs SA: హార్దిక్ హిట్ షో.. రీఎంట్రీలో సఫారీలకు చుక్కలు ! సిక్సర్ల కింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved