MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • Iran: 16 ఏళ్ల యువ‌తిని బ‌హిరంగంగా ఉరి తీసిన ఇరాన్‌.. ఆ క‌ర్మ ఫ‌లిత‌మే ఈ వినాశ‌న‌మా.?

Iran: 16 ఏళ్ల యువ‌తిని బ‌హిరంగంగా ఉరి తీసిన ఇరాన్‌.. ఆ క‌ర్మ ఫ‌లిత‌మే ఈ వినాశ‌న‌మా.?

ఎంత‌టి వారైనా స‌రే క‌ర్మ అనుభ‌వించాల్సిందే.. ఇది పురాణాల నుంచి మంచి చూస్తునే ఉన్నాం. ప్ర‌స్తుతం ఇరాన్ కూడా తాను చేసిన త‌ప్పుకు శిక్ష అనుభ‌విస్తోందా.?  నెట్టింట ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. 

3 Min read
Author : Narender Vaitla
Published : Jun 20 2025, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇరాన్ ప‌త‌నం ఆరంభ‌మైందా.?
Image Credit : Brand_Netan @ X

ఇరాన్ ప‌త‌నం ఆరంభ‌మైందా.?

ఇరాన్ ప‌త‌నం ఆరంభ‌మైందా.? ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంతం లక్ష్యంగా అమెరికాతో పాటు ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. దీంతో ఇరాన్ అంతం మొద‌లైంద‌ని ప్ర‌పంచ‌మంతా చ‌ర్చ జ‌రుగుతోంది. 

అయితే ఇదే స‌మ‌యంలో ఇరాన్ 2004లో చేసిన ఓ దారుణ‌మైన చ‌ర్య కార‌ణంగానే ఇప్పుడు త‌గి శాస్తి జ‌రిగింద‌ని సోష‌ల్ మీడియాలో ఓ చ‌ర్చ న‌డుస్తోంది. 16 ఏళ్ల అతీఫ్ రజబి సహాలే మ‌ర‌ణం ఇరాన్‌ను వెంటాడుతోంది అనేది స‌ద‌రు చ‌ర్చ సారాంశం.

26
ఇంత‌కీ ఎవ‌రీ అతీఫ్ రజబి సహాలే.?
Image Credit : Brand_Netan @ X

ఇంత‌కీ ఎవ‌రీ అతీఫ్ రజబి సహాలే.?

ఇరాన్‌కు చెందిన 16 ఏళ్ల అతీఫ్ రజబి సహాలేను ఆ దేశం ఉరి తీసింది. అది కూడా బ‌హిరంగంగా అంద‌రూ చూస్తుండగానే ఉరి తీశారు. 2004 ఆగస్ట్ 15న ఇరాన్‌లోని నేకా పట్టణంలో ఆమెను ప్రజల ముందే చంపారు. ఉరి శిక్ష వేసేంత త‌ప్పు ఏం చేసింద‌నేగా మీ సందేహం.

నిజానికి ఆమె నేర‌స్తురాలు కాదు బాధితురాలు. తల్లి, తండ్రిలేని ఆ యువ‌తిపై ఓ వ్య‌క్తి అత్యాచారం చేశాడు. దీనిని ఇరాన్ చ‌ట్టం ప్ర‌కారం నేరంగా ప‌రిగ‌ణించారు. క‌న్య‌త్వాన్ని కోల్పోవ‌డ‌మే ఆమె చేసిన త‌ప్పంటూ నేర‌స్తురాలిగా తీర్మానించింది.

Related Articles

Related image1
Recharge plan: 365 రోజులు వ్యాలిడిటీ, రోజుకు 2.5 జీబీ.. రోజుకు రూ. 10 మాత్ర‌మే. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్
36
ఇంత దానికే మ‌ర‌ణ శిక్ష వేస్తారా.?
Image Credit : social media

ఇంత దానికే మ‌ర‌ణ శిక్ష వేస్తారా.?

అయితే అతీఫ్‌కు మ‌ర‌ణ శిక్ష వేయ‌డానికి మ‌రో కార‌ణం ఉంది. త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని పోలీసుల వ‌ద్ద‌కు వెళితే.. త‌న‌దే త‌ప్ప‌ని కోర్టు చెప్ప‌డం ఆమెలో కోపాన్ని పెంచింది. దీంతో కోర్టు హాల్లోనే హిజాబ్ తొలగించి త‌న నిర‌స‌న‌ను తెలిపింది. దీన్ని కోర్టు తీవ్ర‌మైన నేరంగా ప‌రిగ‌ణించి ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.

క‌ట్ట‌లు తెంచుకున్న కోపంతో యువ‌తి జ‌డ్జిపైకి చెప్పును విసిరింది. దీంతో యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ను ఉరిశిక్ష‌గా మార్చేశారు. ఆమెను బ‌హిరంగంగా ఉరితీశారు.

46
ఆమె వ‌య‌సును 22 ఏళ్లుగా చూపించి మ‌రీ
Image Credit : Getty

ఆమె వ‌య‌సును 22 ఏళ్లుగా చూపించి మ‌రీ

నిజానికి ఇరాన్ చ‌ట్టాల ప్రకారం 18 ఏళ్లు నిండ‌ని వారికి ఉరి శిక్ష అమ‌లు చేయ‌కూడ‌దు. కానీ ఆ యువతిని లేకుండా చేయాల‌న్న ఉద్దేశంతో కోర్టు ఫైళ్లలో వయసును తప్పుగా చూపించి అతీఫ్‌కు ఉరిశిక్ష ప‌డేలా చేశారు. అలా ఒక అమాయ‌క యువ‌తిని ఇరాన్ పొట్ట‌న పెట్టుకుంది.

ఆ యువ‌తి శాపం త‌గిలింది.

కాగా ప్ర‌స్తుతం ఇరాన్‌లో జ‌రుగుతోన్న ప‌రిస్థితులను ఊటంకిస్తూ ఆ యువ‌తి శాప‌మే ఆ దేశానికి త‌గిలింది అంటూ కొంద‌రు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. @Brand_Netan అనే యూజ‌ర్ ఈ సంఘ‌ట‌న‌ను వివ‌రిస్తూ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ చేశారు. ఆ యువతిని ఉరి తీసిన నాటి నుంచి ఇరాన్‌కు నెమ్మదిగా శాపం పట్టింది అంటారని రాసుకొచ్చారు.

लोग कहते हैं इसी लड़की का श्राप ईरान को लगा है क्योंकि इस लड़की के फांसी के बाद से ईरान में कभी शांति नहीं रही

सबसे क्रूर सजा दिए जाने का जो मामला दुनिया के सामने आया था, वो ईरान की 16 वर्षीय मासूम लड़की अतीफेह रजबी सहलीह का मामला है...

जिसके अंदर तनिक भी मानवता जीवित है, कहानी… pic.twitter.com/RR6jbVAZYK

— पंडित जी 𝕋ℙℕ♛ (@Brand_Netan) June 17, 2025

కేవ‌లం ఇరాన్‌లో మాత్ర‌మే కాకుండా అఫ్గానిస్తాన్‌, పాకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ వంటి దేశాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఉండ‌ద‌ని ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు.

56
ప్రపంచాన్ని కుదిపేసింది
Image Credit : Getty

ప్రపంచాన్ని కుదిపేసింది

అతీఫ్ రజబి సహాలే ఉరిశిక్ష వ్య‌వ‌హారం ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఇరాన్లో “నైతిక నేరాల” పేరిట మహిళలపై ఉరి శిక్షలు, లాఠీ దెబ్బలు, అరెస్టులు జరిగిన నేపథ్యంలో ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇరాన్‌లో మ‌హిళ‌ల‌కు హ‌క్కులు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. వారి దుస్తులు, ప్రవర్తన అన్నింటినీ మోరాలిటీ పోలీస్‌లు నిఘా పెడతారు.

66
2022 ఘ‌ట‌న‌తో మొద‌లైన తిరుగుబాటు
Image Credit : Getty

2022 ఘ‌ట‌న‌తో మొద‌లైన తిరుగుబాటు

అయితే ఇరాన్‌లో తొలిసారి 2022లో తిరుగుబాటు మొద‌లైంది. మహ్సా అమినీ అనే యువతి మోరాలిటీ పోలీస్ అదుపులో చనిపోవడం తర్వాత "జన్, జిందగీ, ఆజాదీ" (స్త్రీ, జీవితం, స్వేచ్ఛ) ఉద్యమం ఎగిసిప‌డింది.

ఇది దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో మహిళల న్యాయ హక్కుల కోసం గళం ఎత్తిన ఉద్యమంగా మారింది. అయితే మ‌త చాంద‌స వాదంతో ఉండే ఇరాన్‌లో ఇప్ప‌టికీ మ‌హిళ‌ల‌కు స‌రైన న్యాయం జ‌ర‌గ‌ట్లేదు అనేది బ‌హిరంగ ర‌హ‌స్యంగానే ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం
యుద్ధం

Latest Videos
Recommended Stories
Recommended image1
Condoms: ఆసియాలో అత్యధికంగా కండోమ్స్ అమ్ముడవుతోన్న దేశం ఏదో తెలుసా.? వేల కోట్ల వ్యాపారం
Recommended image2
Top 10 Universities : టాప్ 10 వర్సిటీల లిస్ట్ వచ్చేసింది.. ఇండియా నుంచి ఏమున్నాయి?
Recommended image3
ప్రపంచంలోనే అత్యంత ధనిక అమ్మాయిల బ్రోకర్ వీడే... సొంత దీవి, బోయింగ్ విమానం..!
Related Stories
Recommended image1
Recharge plan: 365 రోజులు వ్యాలిడిటీ, రోజుకు 2.5 జీబీ.. రోజుకు రూ. 10 మాత్ర‌మే. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved