MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..

Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..

Gold Price: అమెరికా దాడుల నేప‌థ్యంలో వెనిజులా పేరు మారుమోగుతోంది. ఈ దేశానికి సంబంధించి ఏ చిన్న వార్త అయినా నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో వెనిజులాలో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jan 08 2026, 08:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒక కప్పు టీ ధరకే బంగారం…
Image Credit : Getty

ఒక కప్పు టీ ధరకే బంగారం…

ఒక గ్రాము బంగారం కొనాలంటే భారత్‌లో వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితికి పూర్తిగా భిన్నంగా దక్షిణ అమెరికాలోని వెనిజులా దేశంలో బంగారం ధర ఒక కప్పు టీ ధరకంటే తక్కువగా ఉంది. వినడానికి నమ్మశక్యం కాకపోయినా ఇది అక్కడి నేటి వాస్తవం.

25
181 రూపాయలకే 24 క్యారెట్ గోల్డ్
Image Credit : stockPhoto

181 రూపాయలకే 24 క్యారెట్ గోల్డ్

ప్రస్తుతం భారత్‌లో 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు సుమారు రూ.13,800కి పైగానే ఉంది. అదే బంగారం వెనిజులాలో మాత్రం భారత కరెన్సీ లెక్కన కేవలం రూ.181 దగ్గరే లభిస్తోంది. 22 క్యారెట్ బంగారం ధర అయితే ఇంకా తక్కువగా రూ.166 వరకు పడిపోయింది. ఇంత తక్కువ ధరలు అక్కడి ప్రజలకు సంతోషం కలిగించేవి కావు. అవి దేశ ఆర్థిక పతనానికి అద్దం పడుతున్న దృశ్యం.

Related Articles

Related image1
Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి
Related image2
Telangana: హైద‌రాబాద్‌లో గొర్రె, మేక‌ల ర‌క్తంతో అక్ర‌మ వ్యాపారం.. ఇంత‌కీ ర‌క్తంతో ఏం చేస్తున్నారంటే
35
కరెన్సీ పతనమే అసలు కారణం
Image Credit : Getty

కరెన్సీ పతనమే అసలు కారణం

వెనిజులా కరెన్సీ పేరు ‘వెనిజులన్ బోలివర్’. గత కొన్నేళ్లుగా ఈ కరెన్సీ విలువ పూర్తిగా క్షీణించింది. తీవ్రమైన ద్రవ్యోల్బణం కారణంగా అక్కడ డబ్బుకు విలువ లేకుండా పోయింది. అదే సమయంలో బంగారం ధరలు స్థానిక కరెన్సీలో పెరిగినా, అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే అవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ప్రపంచానికి అక్కడ బంగారం చౌకగా కనిపిస్తోంది.

45
స్విట్జర్లాండ్‌కు తరలిన బంగారు నిల్వలు
Image Credit : Getty

స్విట్జర్లాండ్‌కు తరలిన బంగారు నిల్వలు

అంతర్జాతీయ కథనాల ప్రకారం, నికోలస్ మదురో పాలన కాలంలో వెనిజులా ప్రభుత్వం పెద్ద ఎత్తున బంగారు నిల్వలను విదేశాలకు తరలించింది. 2013 నుంచి 2016 మధ్యకాలంలో సుమారు 113 మెట్రిక్ టన్నుల బంగారం స్విట్జర్లాండ్‌కు పంపినట్లు రిపోర్ట్ లు చెబుతున్నాయి. అప్పులు తీర్చడం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం గోల్డ్ రిజర్వ్‌ను విపరీతంగా వినియోగించింది. ఫలితంగా 2024 నాటికి వెనిజులా వద్ద మిగిలిన అధికారిక బంగారం కేవలం 161 టన్నులకే పరిమితమైంది.

55
వేల టన్నుల ఖనిజ సంపద ఉన్నా ప్రజలు పేదరికంలో
Image Credit : Getty

వేల టన్నుల ఖనిజ సంపద ఉన్నా ప్రజలు పేదరికంలో

వెనిజులా పేద దేశం కాదు. ఇది ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటి. ప్రపంచ క్రూడ్ ఆయిల్ నిల్వల్లో సుమారు 17 శాతం వెనిజులా వద్దే ఉంది. అంతేకాదు ‘ఒరినోకో మైనింగ్ ఆర్క్’ ప్రాంతంలో 8,000 టన్నులకుపైగా బంగారం, వజ్రాలు, బాక్సైట్ వంటి ఖనిజాలు ఉన్నట్లు అధికారిక అంచనాలు చెబుతున్నాయి. అయినా సరైన విధానాలు లేకపోవడం, అవినీతి, పాలనా వైఫల్యం కారణంగా 2024 నాటికి అక్కడ అధికారిక బంగారం ఉత్పత్తి కేవలం 30.6 టన్నులకే పరిమితమైంది. ఈ పరిస్థితి దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బంగారం
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Condoms: ఆసియాలో అత్యధికంగా కండోమ్స్ అమ్ముడవుతోన్న దేశం ఏదో తెలుసా.? వేల కోట్ల వ్యాపారం
Recommended image2
Top 10 Universities : టాప్ 10 వర్సిటీల లిస్ట్ వచ్చేసింది.. ఇండియా నుంచి ఏమున్నాయి?
Recommended image3
ప్రపంచంలోనే అత్యంత ధనిక అమ్మాయిల బ్రోకర్ వీడే... సొంత దీవి, బోయింగ్ విమానం..!
Related Stories
Recommended image1
Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి
Recommended image2
Telangana: హైద‌రాబాద్‌లో గొర్రె, మేక‌ల ర‌క్తంతో అక్ర‌మ వ్యాపారం.. ఇంత‌కీ ర‌క్తంతో ఏం చేస్తున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved