Hair Growth: ఎండు ద్రాక్షతో ఇలా చేస్తే... జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది!
Raisin Water Benefits: ఆడవారికైనా, మగవారికైనా... నల్లని, ఒత్తైన జుట్టు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. జుట్టు బాగుంటే ఎలాంటి హేయిర్ స్టైల్స్ అయినా చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం చాలామంది జుట్టు రాలడం, తెల్లబడటం, తెగిపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానికి లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, పొల్యూషన్ ఇంకా వేరే కారణాలు కూడా ఉండచ్చు. కానీ జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు మనం చేసే పని మనం చేయాలి కదా..! ఏంటి అనుకుంటున్నారా? అయితే తెలుసుకోండి.

పొడవాటి జుట్టు కోరుకోని ఆడవాళ్లు ఎవరుంటారు చెప్పండి. దానికోసం రకరకాల చిట్కాలు కూడా ఫాలో అవుతుంటారు. అయితే చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం చాలామంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని సహజ చిట్కాల ద్వారా ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అదేంటో ఇక్కడ చూద్దాం.
Raisin Water Benefits: ఎండు ద్రాక్ష నీరు
నిపుణుల ప్రకారం ఎండు ద్రాక్ష నీరు జుట్టు ఆరోగ్యానికి.. వేగంగా పెరగడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎండుద్రాక్ష నీరు జుట్టు పెరుగుదలకు ఎలా సహాయపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
జుట్టు పెరుగుదలకు ఎండు ద్రాక్ష నీరు
ఎండుద్రాక్ష నీరు తాగితే జుట్టు రాలడం తగ్గి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దానిలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఎండుద్రాక్ష నీటి ప్రయోజనాలు
1. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది
ఎండుద్రాక్ష నీరు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, తల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
2. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
ఎండు ద్రాక్ష నీటిలోని విటమిన్లు, ఖనిజాలు జుట్టు వేర్లను బలోపేతం చేసి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
3. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది
ఎండుద్రాక్ష నీటిలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది జుట్టును బలోపేతం చేసి, మెరుపును పెంచుతుంది.
4. తల చర్మ ఆరోగ్యం -
ఎండుద్రాక్ష నీటిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, తల చర్మంపై వాపును తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
5. జుట్టు వేర్లను బలపరుస్తుంది
ఎండు ద్రాక్షలోని బి కాంప్లెక్స్, విటమిన్లు, సహజ చక్కెరలు జుట్టు వేర్లను బలపరుస్తాయి.
6. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
ఎండుద్రాక్ష నీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది తలపై చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
7. జుట్టుకు మెరుపును ఇస్తుంది
ఎండుద్రాక్ష నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. జుట్టును మెరిసేలా చేస్తుంది.
8. చుండ్రును తొలగిస్తుంది
ఎండుద్రాక్ష నీటిలోని యాంటీ అలెర్జీ లక్షణాలు తలపై చర్మం పొడిబారడాన్ని, చుండ్రును తగ్గిస్తాయి.
ఎండుద్రాక్ష నీటి తయారీ..
కావలసినన్ని ఎండుద్రాక్షను ఒక గ్లాసు నీటిలో వేసి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. ఎండుద్రాక్షను కూడా తినవచ్చు. ఇలా తాగితే త్వరలోనే మంచి మార్పు కనిపిస్తుంది.
గమనిక:
ఎండుద్రాక్ష నీరు అందరికీ సరిపోకపోవచ్చు. గర్భిణీలు, మందులు వాడేవారు ఈ నీరు తాగే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.