MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Pomegranate : తొక్కే కదా అని పారేయకండి.. దానిమ్మ తొక్కతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

Pomegranate : తొక్కే కదా అని పారేయకండి.. దానిమ్మ తొక్కతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

Pomegranate Peels: సాధారణంగా దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. కానీ దీని తొక్క గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఈ తొక్కతో ఎలాంటి ప్రయోజనం లేదని పారేస్తుంటారు. కానీ ఈ తొక్క కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అదెలాగంటే?

1 Min read
Author : Rajesh K
Published : Jul 20 2025, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దానిమ్మ తొక్కతో ప్రయోజనాలు
Image Credit : Getty

దానిమ్మ తొక్కతో ప్రయోజనాలు

దానిమ్మ..  ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే దానిమ్మకు అన్ని కాలాల్లోనూ ఎక్కువ డిమాండ్. కానీ మనం దానిమ్మ తిన్న తర్వాత దాని తొక్కను చెత్తకుప్పలో పడేస్తాం. కానీ, దానిమ్మ తొక్క కూడా  పండు లాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆయుర్వేదంలో దానిమ్మ తొక్కలు ఔషధ గుణాలతో నిండి ఉన్నాయని చెబుతారు. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, కడుపు సమస్యలను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.  కాబట్టి ఇకపై దానిమ్మ తొక్కను పారేయకండి. మరి దానిమ్మ తొక్క తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం…

26
 గుండె ఆరోగ్యం
Image Credit : Getty

గుండె ఆరోగ్యం

దానిమ్మ తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి, రక్తనాళాలను శుభ్రంగా ఉంచుతాయి. ఫలితంగా, రక్తపోటు నియంత్రణలో ఉండి, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. 

Related Articles

Related image1
Pomegranate: రోజుకో దానిమ్మ పండు తింటే.. ఏం జరుగుతుందో తెలుసా ?
Related image2
Pomegranate Juice: రోజూ ఉదయం ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగితే ఏమౌతుంది?
36
 ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ
Image Credit : Getty

ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ

దానిమ్మ తొక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉండటంతో కఫం తగ్గించి గొంతు ఇన్ఫెక్షన్‌కు ఉపశమనం కలిగిస్తుంది. కషాయం లేదా పొడి రూపంలో వాడితే మంచి ఫలితం. 

46
జీర్ణక్రియకు మేలు:
Image Credit : Getty

జీర్ణక్రియకు మేలు:

దానిమ్మ తొక్కల్లో అధిక ఫైబర్ ఉండటంతో జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. ఇది అతిసారం, ఆమ్లత, కడుపు నొప్పికి ఉపశమనం ఇస్తుంది. శరీరంలో ఉన్న పురుగులు, విషాలను కూడా తొలగించడంలో సహాయపడుతుంది. 

56
డిటాక్సిన్ గా
Image Credit : Getty

డిటాక్సిన్ గా

దానిమ్మ తొక్కలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషాలు బయటకు పంపబడతాయి. ఇది కాలేయం, మూత్రపిండాల శుద్ధికి తోడ్పడుతుంది. రక్తాన్ని శుభ్రపరిచి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. 

66
మచ్చలేని చర్మం కోసం
Image Credit : Getty

మచ్చలేని చర్మం కోసం

దానిమ్మ తొక్కలో అధిక మొత్తంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ముఖంపై మచ్చలు, ముడతలు,  మొటిమలను తగ్గించడంలో సహాయపడుతాయి. దానిమ్మ తొక్క పొడిని తయారు చేసి, దానిని ఫేస్ ప్యాక్‌గా కూడా వాడవచ్చు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
ఆహారం
సౌందర్యం
మహిళలు
పురుషులు

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral Video : మూత్రంతో కళ్లు కడుక్కుంటే మంచిదా..? ఈమె చేసింది కరెక్టేనా..? డాక్టర్లు ఏమంటున్నారంటే
Recommended image2
Tulasi Leaves: 10 రోజులపాటు 4 తులసి ఆకులు నమిలి తింటే కలిగే 5 అద్భుతమైన లాభాలు ఇవే!
Recommended image3
Turmeric Milk: 20 రోజులపాటు పసుపు పాలు తాగితే కలిగే 5 అద్భుతమైన లాభాలు ఇవే!
Related Stories
Recommended image1
Pomegranate: రోజుకో దానిమ్మ పండు తింటే.. ఏం జరుగుతుందో తెలుసా ?
Recommended image2
Pomegranate Juice: రోజూ ఉదయం ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగితే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved