Hair Care: జుట్టు రాలుతోందా.? కలబందతో ఇలా చెక్ పెట్టండి..
Hair Care: ఈ మధ్యకాలంలో చాలామందిలో జుట్టు రాలడం సమస్య కనిపిస్తుంది. కనీసం పాతికేళ్లు కూడా నిండకుండా ఈ సమస్యతో పడుతున్నారు. మనం తీసుకునే ఆహారం, ఎయిర్ పొల్యుషన్, వాటర్ పొల్యుషన్ కారణంగా జుట్టు రాలుతోంది. ఈ సమస్యకు కలబందతో చెక్ పెట్టవచ్చు. ఎలాగంటే?

కలబందతో జుట్టు పెరుగుదల
కలబందలో విటమిన్లు (A, C, E, B12), ఖనిజాలు (కాపర్, జింక్), ఎంజైమ్‌లు, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.
జుట్టు కుదుళ్ల ఆరోగ్యం: కలబందలోని ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌లు చనిపోయిన జుట్టు కుదుళ్లను తొలగించి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడతాయి.
తేమ: కలబంద సహజ కండీషనర్‌లా పనిచేస్తుంది. దీనిలోని నీటి శాతం జుట్టుని పొడిబారకుండా కాపాడుతుంది.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు: కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది.
రక్త ప్రసరణ: కలబందతో తలకి మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్, పోషకాలు అందుతాయి.
నెరిసిన జుట్టుకి కలబంద
నెరిసిన జుట్టుకి ఒక ముఖ్య కారణం మెలనిన్ ఉత్పత్తి తగ్గడం. కలబంద మెలనిన్ ఉత్పత్తిని పెంచకపోయినా, జుట్టుకి పోషకాలు అందించడం ద్వారా నెరసిపోవడాన్ని తగ్గిస్తుంది.
కావలసినవి: కలబంద జెల్ - 3 టేబుల్ స్పూన్లు, కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు
వాడే విధానం: కలబంద జెల్, కొబ్బరి నూనె కలిపి తలకి రాసుకోవాలి. 5-10 నిమిషాలు మసాజ్ చేసి, గంట లేదా రెండు గంటల తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
రాలే జుట్టుకి కలబందతో చెక్
జుట్టు రాలడానికి చుండ్రు, దురద వంటివి కారణం కావచ్చు. కలబందలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల ఇది జుట్టు ఆరోగ్యానికి మంచిది.
కావలసినవి: కలబంద జెల్ - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ రసం - 1 టేబుల్ స్పూన్
వాడే విధానం: కలబంద జెల్, ఉల్లిపాయ రసం కలిపి తలకి రాసుకోవాలి. 30-45 నిమిషాలు అలానే ఉంచితే.. షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి 1-2 సార్లు ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
కలబంద, ఆలివ్ నూనె:
కావలసినవి: కలబంద జెల్ - 3 టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె - 1 టేబుల్ స్పూన్
వాడే విధానం: కలబంద జెల్, ఆలివ్ నూనె కలిపి తలకి, జుట్టుకి రాసుకుని మసాజ్ చేయాలి. 2-3 గంటలు లేదా రాత్రంతా అలాగే ఉంచి, షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే.. జుట్టు రాలడం తగ్గించి, మెరుపు నిస్తుంది.
జాగ్రత్తలు:
అలెర్జీ టెస్ట్: కలబంద జెల్ ఉపయోగించే ముందు అలెర్జీ ఉందేమో తెలుసుకోవడానికి, మీ మోచేతి లోపలి భాగంలో కొద్దిగా రాసి పరీక్షించడం మంచిది.
ఓపిక అవసరం: సహజ చికిత్సలు వెంటనే ఫలితం ఇవ్వవు. కనీసం 2-3 నెలలు క్రమం తప్పకుండా వాడితేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
సమతుల్య ఆహారం: పోషకాలున్న ఆహారం తీసుకోవడం జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
నీళ్లు తాగడం: తగినంత నీరు తాగడం శరీర, జుట్టు ఆరోగ్యానికి అవసరం.
వేడి పరికరాలు: హెయిర్ డ్రైయర్, స్ట్రెయిట్నెర్ వాడటం తగ్గించాలి.
మసాజ్: ప్రతి రోజూ 5-10 నిమిషాలు తలకి మసాజ్ చేయడం మంచిది.
కలబంద చక్కని సహజ ఔషధం. దీన్ని సరిగ్గా వాడితే నెరిసిన జుట్టు, రాలే జుట్టు సమస్యలు తగ్గుతాయి.