Liver Health: మీ లివర్ ని హెల్దీగా మార్చే కూరగాయలు ఇవి..!
మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారం కచ్చితంగా తీసుకోవాలి.ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయలు తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుందని మీకు తెలుసా?

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే...
కాలేయం శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడం, పోషకాలు, వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్ ని బయటకు పంపడం వంటి పనులు చేస్తుంది. జీవక్రియ, జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థ పనితీరు పరంగా కూడా ఇది ముఖ్యమైన భాగంగా పనిచేస్తుంది.
ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోయినా, మద్య పానం అలవాటు ఉన్నా, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నా.. లివర్ దెబ్బతింటుంది. అయితే.. మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల కూరగాయలను చేర్చడం వల్ల .. మన లివర్ ని సహజంగా డీటాక్స్ చేయవచ్చు. మరి, ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుందామా...
ఆకు కూరలు..
పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో క్లోరోఫిల్ సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో ఉన్న హానికర పదార్థాలను గ్రహించి కాలేయంపై పడే ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాల పరంగా పోషకాలు ఎక్కువగా లభించడంతో, ఇవి శరీరానికి చాలా బాగా సహాయపడతాయి. బరువు నియంత్రణతో పాటు గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు వంటి వ్యాధుల అవకాశాన్ని తగ్గించడంలో సహకరిస్తాయి.
బ్రోకలీ..
బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ లాంటి కూరగాయలు గ్లూటాథియోన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌ను అందిస్తాయి. ఇది శరీరం నుంచి హానికర పదార్థాలను తొలగించే శక్తివంతమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. సల్ఫర్ సమ్మేళనాలు, విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉండటంతో ఇవి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బ్రోకలీ, కాలీఫ్లవర్‌లలో కలిగే కోలిన్ పదార్థం కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు లివర్ లోని డిటాక్స్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. పచ్చివెల్లుల్లి ఉపయోగిస్తే ప్రయోజనం మరింత ఉంటుంది. వంటల్లో, పాస్తాల్లో, సూప్‌లలో వెల్లుల్లిని చేర్చడం ద్వారా కాలేయానికి మేలు కలుగుతుంది.
క్యారెట్
క్యారెట్లు బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో విటమిన్ A గా మారి కాలేయాన్ని రక్షించడంలో సహాయపడతాయి. క్యారెట్ రసం లేదా స్మూతీ రూపంలో తీసుకుంటే డిటాక్స్ ప్రక్రియ వేగవంతం అవుతుంది.
బీట్‌రూట్
బీట్‌రూట్ లో ఉండే బీటాలైన్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి కాలేయంలో డిటాక్స్ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. బీట్‌రూట్ జ్యూస్ లేదా సలాడ్‌లలో భాగంగా తీసుకోవడం ద్వారా శక్తివంతమైన డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. పర్యావరణంలోని హానికర పదార్థాలను శరీరం నుండి తొలగించడంలో బీట్‌రూట్ సహాయపడుతుంది.