MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Gardening
  • Pepper: ఇలా చేస్తే ఇంట్లోనే ఈజీగా మిరియాల మొక్క పెంచుకోవచ్చు

Pepper: ఇలా చేస్తే ఇంట్లోనే ఈజీగా మిరియాల మొక్క పెంచుకోవచ్చు

Pepper:మిరియాల మొక్క పాకాలంటే పెద్ద చెట్లు లేదా కర్రలు కావాలి. కానీ తక్కువ స్థలం ఉన్నవాళ్లు, ఫ్లాట్లలో ఉండేవారికి తీగలాగా పాకేంతలా ప్లేస్ ఉండదు. అలాంటివాళ్లు బాల్కనీలోనే మిరియాల మొక్క తీగల పాకేలా కాకుండా గుబురుగా పెంచుకోవచ్చు. 

2 Min read
Author : Nandini Arava
Published : Apr 20 2026, 02:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నాటిన మొదటి ఏడాదే పంట!
Image Credit : Getty

నాటిన మొదటి ఏడాదే పంట!

మిరియాలు ఆరోగ్యానికే కాదు…అలకంరణకు ఉపయోగపడుతుంది. పొదలాగా పెరిగి మిరియాల మొక్క అందంగా ఉంటుంది. ఇంటికి కావాల్సిన మిరియాలను కూడా ఇస్తుంది. సాధారణ మిరియాల మొక్క పక్క కొమ్మలను కత్తిరించి దీన్ని పెంచుతారు. పైకి పాకకుండా చిన్న పొదలా గుబురుగా పెరుగుతుంది. నాటిన సంవత్సరం నుంచే పంట చేతికి రావడం దీని స్పెషాలిటీ.

26
ఏ రకాలు పెంచుకోవాలి?
Image Credit : Getty

ఏ రకాలు పెంచుకోవాలి?

కరిముండ: కేరళలో ఎక్కువగా పండించే రకం. మంచి దిగుబడి వస్తుంది. 

పన్నియూర్ పెప్పర్: పన్నియూర్  పెప్పర్‍లో 1 నుంచి 5 వరకు ఉన్న రకాలను పొదలా పెరిగే మిరియాల మొక్కలాగా పెంచుకోవచ్చు. 

పౌర్ణమి, శుభకర, శ్రీకర మిరియాలు: వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. ముఖ్యంగా ఈ రకం మొక్కలు కావాలంటే నమ్మకమైన నర్సరీల్లో తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్న మొక్కలను ఎంచుకోవాలి. పక్క కొమ్మల నుంచి తీసిన మొక్కలేనా కాదా అని నిర్ధారించుకోండి.

Related Articles

Related image1
Summer Gardening Tips: కొత్తిమీర, పుదీనా మొక్కలు ఎండకు వాడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి
Related image2
Pepper Chicken: రెస్టారెంట్ స్టైల్ లో పెప్పర్ చికెన్ ఇలా నిమిషాల్లో వండేయండి, రెసిపీ ఇదిగో
36
కుండీని ఎలా సిద్ధం చేయాలి?
Image Credit : Getty

కుండీని ఎలా సిద్ధం చేయాలి?

ఈ మొక్క కనీసం ఒక మీటర్ ఎత్తు పెరుగుతుంది, కాబట్టి పెద్ద కుండీలు లేదా 40 సెంటిమీటర్ల సైజు గ్రోబ్యాగ్‌లు ఎంచుకోవాలి. పశువుల ఎరువు, మట్టి, ఇసుకను సమానంగా కలిపి కుండీలో నింపాలి. మట్టిని గట్టిగా నొక్కొద్దు. కుండీ అడుగున నీరు పోవడానికి రంధ్రాలు ఉండేలా చూసుకోండి. దీనికి నేరుగా ఎండ తగలకూడదు, కాస్త నీడ ఉండే చోట పెట్టాలి. మొక్క మొదట్లో తేమ ఉండాలి కానీ, నీరు నిలవకూడదు.

46
ఎరువులు ఎలా వేయాలి?
Image Credit : Getty

ఎరువులు ఎలా వేయాలి?

మొక్క వేగంగా పెరగాలంటే, రెండు వారాలకు ఒకసారి వేరుశనగ పిండి వాటర్, లేదా నీరు కలిపిన గోమూత్రం పోయాలి. వానపాముల ఎరువు లేదా ఎముకల పొడిని మట్టిలో కలిపితే మంచిది. రసాయన ఎరువులకు బదులు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పెంచడమే ఉత్తమం.

56
తెగుళ్లు, నివారణ మార్గాలు
Image Credit : Getty

తెగుళ్లు, నివారణ మార్గాలు

పొదలాగా పెరిగే మిరియాల మొక్కకు ముఖ్యంగా వేరుకుళ్లు,  ఆకులు త్వరగా వాడిపోవడం వంటి తెగుళ్లు వస్తాయి. నివారణకు, ట్రైకోడెర్మా కలిపిన ఎరువు వాడితే వేరుకుళ్లును అరికట్టొచ్చు. ఆకులపై నల్ల మచ్చలు కనిపిస్తే, బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేయాలి.

66
పంట కోత సమయం
Image Credit : Getty

పంట కోత సమయం

మొక్క నాటిన ఏడాదిలోనే మిరియాల కంకులు వస్తాయి. కంకిలో ఒకటి రెండు గింజలు పండి ఎర్రగా మారినప్పుడు, గుత్తులుగా కోసుకోవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఒకే మొక్క నుంచి 10 నుంచి 15 ఏళ్ల వరకు పంట వస్తుంది. మొక్క మొదట్లో ఆకులు కప్పడం వల్ల తేమ నిలిచి ఉంటుంది. అవసరమైతే పక్క కొమ్మలను కత్తిరించి మొక్కను మంచి ఆకృతిలో ఉంచుకోవచ్చు. 

మీ ఇంట్లో గుబురుగా మిరియాల పెంచుకోవాలంటే..వానాకాలం మంచి సమయం. ఈసారి మీరు ట్రై చేయండి

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
తోటపని

Latest Videos
Recommended Stories
Recommended image1
Gardening Tips: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో..!
Recommended image2
Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలో తెలుసా?
Recommended image3
Curry Leaf: ఎండాకాలంలో ఇలా చేస్తే కరివేపాకు గుబురుగా పెరుగుతుంది
Related Stories
Recommended image1
Summer Gardening Tips: కొత్తిమీర, పుదీనా మొక్కలు ఎండకు వాడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి
Recommended image2
Pepper Chicken: రెస్టారెంట్ స్టైల్ లో పెప్పర్ చికెన్ ఇలా నిమిషాల్లో వండేయండి, రెసిపీ ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved