MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • Smartphone: మీరు చేస్తున్న ఈ త‌ప్పుల వ‌ల్లే.. మీ ఫోన్ బ్యాట‌రీ త్వ‌ర‌గా పాడ‌వుతుంది

Smartphone: మీరు చేస్తున్న ఈ త‌ప్పుల వ‌ల్లే.. మీ ఫోన్ బ్యాట‌రీ త్వ‌ర‌గా పాడ‌వుతుంది

Smartphone: స్మార్ట్‌ఫోన్ ఉప‌యోగించే వారికి ఎదుర‌య్యే ప్ర‌ధాన స‌మ‌స్య బ్యాట‌రీ. చాలా మంది బ్యాట‌రీ ప‌నితీరుతో ఇబ్బంది ప‌డుతుంటారు. మీరు చేసే కొన్ని త‌ప్పుల వ‌ల్లే మీ బ్యాట‌రీ త్వ‌ర‌గా పాడువుతుంద‌ని మీకు తెలుసా.?

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 30 2026, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫోన్ బ్యాటరీ త్వరగా డ్యామేజ్ అవడానికి కారణం ఇదే
Image Credit : Gemini AI

ఫోన్ బ్యాటరీ త్వరగా డ్యామేజ్ అవడానికి కారణం ఇదే

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక్క రోజు కూడా గడపలేని పరిస్థితి. ఉదయం లేవగానే మొదలుకుని రాత్రి నిద్రపోయే వరకూ ఫోన్ చేతిలోనే ఉంటుంది. కానీ ఫోన్‌ను ఎలా చార్జ్ చేస్తున్నాం అనే విషయంలో చాలామంది పట్టించుకోవడం లేదు. ఇదే అలవాటు బ్యాటరీ ఆయుష్షును ఒక ఏడాదిలోపే తగ్గిస్తోంది.

25
నైట్ అంతా చార్జింగ్ పెట్టడం ఎంత ప్రమాదకరం
Image Credit : our own

నైట్ అంతా చార్జింగ్ పెట్టడం ఎంత ప్రమాదకరం

నిద్రకు ముందు ఫోన్‌ను చార్జింగ్‌కు పెట్టి, ఉదయం తీయ‌డం చాలా మందికి అలవాటు. కానీ ఇది బ్యాటరీకు పెద్ద ప్ర‌మాద‌క‌రం. 100 శాతం చార్జ్ అయిన తర్వాత కూడా కరెంట్ వెళ్లడం వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది. ఈ వేడి కారణంగా లోపలి సెల్స్ నెమ్మదిగా దెబ్బతింటాయి. మొదట్లో సమస్య కనిపించదు. కొన్ని నెలల తర్వాత చార్జ్ వేగంగా తగ్గడం మొదలవుతుంది.

Related Articles

Related image1
హైద‌రాబాద్‌లో యాపిల్ భారీ ప్లాన్‌.. నెల‌కు రూ. 70 ల‌క్ష‌ల రెంట్‌తో ఆ ప్రాంతంలో..
Related image2
Gold Price: బంగారం కొంటున్న వారికి ఇక ఇత్తడే.. కుప్పకూలనున్న గోల్డ్ ధరలు
35
నకిలీ చార్జర్ వాడితే వచ్చే నష్టం
Image Credit : our own

నకిలీ చార్జర్ వాడితే వచ్చే నష్టం

అన్ని చార్జర్లు ఒకేలా ఉండవు. అసలు చార్జర్ కాకుండా చౌకగా దొరికే నకిలీ చార్జర్ వాడితే ఫోన్‌కు సరైన వోల్టేజ్ అందదు. ఫలితంగా బ్యాటరీ ఎక్కువ వేడి అవుతుంది. కొన్నిసార్లు చార్జింగ్ నెమ్మదిగా జరుగుతుంది. త్వరగా చార్జ్ అవుతోంది అని అనుకోవడం పొరపాటు. అది బ్యాటరీ బలహీనమవుతున్న సంకేతమే.

45
చార్జింగ్‌లోనే ఫోన్ వాడటం మరో తప్పు
Image Credit : our own

చార్జింగ్‌లోనే ఫోన్ వాడటం మరో తప్పు

చార్జ్ పెట్టి వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, రీల్స్ స్క్రోల్ చేయడం బ్యాటరీపై భారీ ఒత్తిడి పెడుతుంది. ఒక వైపు కరెంట్ లోపలికి వెళ్తుంది. మరో వైపు ఎక్కువ శక్తి బయటకు వెళ్తుంది. దీంతో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఫోన్ వేడెక్కడం, అకస్మాత్తుగా ఆఫ్ అవడం వంటి సమస్యలు వస్తాయి.

55
బ్యాటరీ ఎక్కువ కాలం బాగుండాలంటే..
Image Credit : our own

బ్యాటరీ ఎక్కువ కాలం బాగుండాలంటే..

ఫోన్ బ్యాటరీ ఆరోగ్యంగా ఉండాలంటే పెద్ద మార్పులు అవసరం లేదు. 20 శాతం నుంచి 80 శాతం న‌డుమ‌ చార్జ్ ఉంచడం మంచిది. అవసరం లేకుండా నైట్ చార్జింగ్ తప్పించాలి. అసలు చార్జర్ వాడటం అలవాటు చేసుకోవాలి. ఇవి చిన్న విషయాల్లా అనిపిస్తాయి. కానీ ఇవే బ్యాటరీ ఆయుష్షును పెంచుతాయి. ఇవాళ జాగ్రత్త తీసుకోకపోతే, ఏడాది తర్వాత బ్యాటరీ మార్చాల్సిన పరిస్థితి తప్పదు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
Interesting Facts: న‌లుపు లేదా తెలుపు.. మొబైల్ ఫోన్ ఛార్జ‌ర్లు ఈ రంగుల్లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
Recommended image2
Hack: మీరు ఈయ‌ర్‌బ‌డ్స్‌లో మాట్లాడేది వేరే వారు వింటున్నార‌ని తెలుసా.? షాకింగ్ విష‌యాలు
Recommended image3
Top 5 Smartphones Under 10K : రూ. 10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. కెమెరా, బ్యాటరీ సూపర్ !
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో యాపిల్ భారీ ప్లాన్‌.. నెల‌కు రూ. 70 ల‌క్ష‌ల రెంట్‌తో ఆ ప్రాంతంలో..
Recommended image2
Gold Price: బంగారం కొంటున్న వారికి ఇక ఇత్తడే.. కుప్పకూలనున్న గోల్డ్ ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved