- Home
- Life
- Food
- Weight Loss: రోజూ ఈ ఒక్క దోశ తిన్నా.. ఈజీగా బరువు తగ్గొచ్చు, అదిరిపోయే రుచి, ఆరోగ్యం కూడా
Weight Loss: రోజూ ఈ ఒక్క దోశ తిన్నా.. ఈజీగా బరువు తగ్గొచ్చు, అదిరిపోయే రుచి, ఆరోగ్యం కూడా
బరువు తగ్గడానికి చాలా మంది ఇడ్లీ, దోశలు మానేసి ఏవేవో తింటూ ఉంటారు. కానీ, దోశ తిని కూడా ఈజీగా బరువు తగ్గొచ్చు.

బరువు తగ్గించే దోశ
తక్కువ సమయంలో, తొందరగా బరువు తగ్గాలని చాలా మంది అనుకుంటారు. దాని కోసం చాలా మంది తిండి తినడం మానేస్తూ ఉంటారు. లేదంటే.. తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తారు. రోజూ తినే ఇడ్లీ, దోశలు లాంటి వాటికి దూరంగా ఉంటారు. కానీ.. మనం హ్యాపీగా మీకు నచ్చిన దోశ తింటూనే చాలా సులభంగా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? మీరు చదివింది అక్షరాలా నిజం. మరి, బరువు సులభంగా తగ్గించే ఆ దోశ ఏంటి? దానిని ఎలా తయారు చేయాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం...
రాగి దోశ..
రాగులు మనకు సులభంగా మార్కెట్లో లభిస్తాయి. ఈ రాగులతో దోశ లు చేసుకొని తింటే రుచికి రుచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. రాగుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది.ఎక్కువ తినకుండా నిరోధిస్తుంది. ఈ రాగులతో దోశ పిండి తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. రాగి దోశలో మన శరీరానికి అవసరం అయ్యే కార్బో హైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడతాయి. పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రాగి దోశలో పోషకాలు...
రాగి దోశలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మనకు కొంచెం తిన్నా కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి చాలా ఎక్కువగా సహాయం చేస్తుంది. రాగుల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాలను మరమ్మతు చేయడానికి , కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
డయాబెటిక్ పేషెంట్స్ కూడా..
రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, కాబట్టి రాగి దోశ తినడం ఎముకలు, దంతాలకు మంచిది.రాగులో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. కాబట్టి ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని చాలా సంతోషంగా, ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. ఐరన్ అధికంగా ఉండే రాగి దోశ తినడం వల్ల రక్తహీనత నుండి బయటపడవచ్చు.
బరువు తగ్గడానికి రాగి దోశ ఎలా తినాలి?
బరువు తగ్గడానికి ఉదయం లేదా మధ్యాహ్నం రాగి దోశ మీరు తినవచ్చు. ఉదయం ఈ దోశ తినడం వల్ల మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దీని కారణంగా, మీరు అనారోగ్యకరమైన స్నాక్స్ తినరు. తక్కువ కేలరీల ఆహారం పాటించేవారు రాగి దోశను క్రమం తప్పకుండా తినవచ్చు.
రాగిలో కొలెస్ట్రాల్ ఉండదు. అందువల్ల, గుండె జబ్బులు ఉన్నవారు దీనిని క్రమం తప్పకుండా తినవచ్చు. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రాగి రక్త నాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. రాగిలో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉండదు. కాబట్టి తరచుగా కడుపు ఉబ్బరం , పేగు సమస్యలను ఎదుర్కొనే వారు ఈ గ్లూటెన్ రహిత దోశను తినవచ్చు.