Beauty TIps: టొమాటో సూప్ లో ..ఈ ఒక్క ఐటమ్ కలిపారంటే అందమంతా మీదే
వర్షంలో వేడివేడి టమోటా-బీట్‌రూట్ సూప్ ఆరోగ్యానికీ, రుచికే కాకుండా అందాన్ని కూడా పెంచుతోంది. దీన్ని ఇంట్లోనే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ లో తయారు చేసుకునే పూర్తి విధానం.

టమోటా సూప్
చల్లచల్లగా వర్షాలు పడుతున్న సమయంలో వేడి పదార్థాలు తినాలి,తాగాలని ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అలాంటి సమయంలో నాలుకకి మంచి రుచిని అందిస్తూ..ఆరోగ్యాన్ని కూడా పొందే స్పెషల్ ఐటమ్ అంటే అది కచ్చితంగా సూప్ నే. అందులోనూ టమోటా సూప్ అయితే ఇంకా సూపర్ అని కూడా చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఈ సాధారణ టమోటా సూప్‌ను ఇంకాస్త స్పెషల్‌గా మార్చే ఒక రహస్య చిట్కా ఒకటి ఉంది. అది ఏంటో తెలుసా టమోటో సూప్ లో బీట్‌రూట్ ని కలపడం.
వాసన, రంగు, రుచి
బీట్‌రూట్ కలిసిన టమోటా సూప్ వాసన, రంగు, రుచి అన్ని అదిరిపోయే లెవల్లోకి వెళ్తాయి. అంతే కాకుండా బీట్‌రూట్ వల్ల వచ్చే పోషకాలు చర్మానికి సహజంగా మెరుపునిచ్చేలా చేస్తాయి. అలాగే ఇది రక్తప్రసరణను మెరుగుపరచడంలోనూ, ఇమ్యూనిటీని పెంచడంలోనూ ఉపయోగపడుతుంది.
రెస్టారెంట్ స్టైల్‌లో
ఈ టమోటా-బీట్‌రూట్ సూప్‌ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
ముందుగా పండిన టమోటాలను బాగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. అలాగే చిన్న పరిమాణంలో ఉన్న బీట్‌రూట్‌ను కూడా తొక్కతీసి తరిగి పెట్టుకోవాలి. వీటితో పాటు కొద్దిగా వెల్లుల్లి, ఒకటి రెండు బిర్యానీ ఆకు ముక్కలు కూడా అవసరం. వీటన్నింటినీ ఒక ప్రెజర్ కుక్కర్‌లో వేసి దాదాపు ఒకటిన్నర కప్పు నీటితో 3-4 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. ఇది పూర్తిగా ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి.
మిక్సీలో మెత్తగా
తరువాత అందులో నుంచి బిర్యానీ ఆకును తీసేసి మిగిలిన మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన ప్యూరీని మామూలు జల్లెడలో వడకట్టి కొంత చిక్కదనాన్ని మిగిలించాలి. దాంతో సూప్‌కు టెక్స్చర్ మంచిగా వస్తుంది.ఇప్పుడు వేరే పాన్‌లో కొంచెం వెన్న వేయాలి. అది కరిగిన వెంటనే అందులో కొద్దిగా కార్న్‌ఫ్లోర్ వేసి రెండు నిమిషాలపాటు తిప్పాలి. కార్న్‌ఫ్లోర్‌కు వాసన పోయిన తరువాత ముందుగా వడకట్టిన టమోటా-బీట్‌రూట్ మిశ్రమాన్ని ఆ పాన్‌లోకి పోయాలి. ఇది కొంచెం కొంచెం పోస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి.
బీట్ రూట్ టచ్‌తో
తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నల్ల మిరియాల పొడి, రుచికి సరిపడినంత చక్కెర కలపాలి. అవసరమైతే మరికొంత నీరు కలపవచ్చు. ఇది చిక్కగా మారే వరకూ స్లో ఫ్లేమ్ మీద ఉంచి ఐదు నిమిషాలు మరిగించాలి. మసాలా ఫ్లేవర్, బీట్ రూట్ టచ్‌తో ఈ సూప్ రుచికరంగా మారుతుంది.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సూప్‌ను ఒక బౌల్‌లో పోసుకోవాలి. పైన కొద్దిగా తాజా క్రీమ్ గాని, వెన్న గాని వేసి అందంగా గార్నిష్ చేసుకోవచ్చు.
టమోటా-బీట్‌రూట్ సూప్
ఈ టమోటా-బీట్‌రూట్ సూప్ కేవలం రుచికే కాదు, శరీరానికి మంచి పోషకాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కాస్త తక్కువ ఆహారం తీసుకునే సందర్భాల్లో ఇది ఆకలిని పెంచి, శరీరానికి తగినంత ఎనర్జీ అందించడంలో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరూ దీన్ని ఆస్వాదించవచ్చు.ఇంట్లో ఉండే సరళమైన పదార్థాలతో తయారయ్యే ఈ సూప్‌ను వారం రోజులకోసారి డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యాన్ని సులభంగా మెరుగుపర్చుకోవచ్చు. ఎలాంటి కృత్రిమ రంగులు లేకుండా సహజ పదార్థాలతో చేసుకునే ఈ సూప్ ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. వానల్లో హీటింగ్ ఎఫెక్ట్ కావాలంటే ఈ సూప్ ట్రై చేయడంలో ఎలాంటి సందేహం లేదు.
రెస్టారెంట్‌లోనే తిన్నట్టు
ఇది స్టార్టర్‌గా, ఈవెనింగ్ టైమ్ స్నాక్‌గా, లేదా ఒక పూర్తి మిల్స్ మధ్యలో చిన్న విరామంగా తీసుకోవచ్చని చెప్పొచ్చు. అంతే కాకుండా ఫ్యామిలీ పార్టీలు, చిన్న చిన్న మీటింగ్ ల ముందుగా సర్వ్ చేయడానికి ఇది మంచి ఐటమ్. రెస్టారెంట్‌లోనే తిన్నట్టు అనిపించే ఈ సూప్ ఇప్పుడు ఇంట్లో తయారు చేయడం చాలా తక్కువ సమయంలో సాధ్యపడుతుంది కాబట్టి, ఓసారి మీ ఇంట్లో ట్రై చేయండి.