MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • మీరు కూడా కోపంతో ఊగిపోతుంటారా.? ఈ పాము, రంపం కథ చదివితే మీ జీవితమే మారుతుంది

మీరు కూడా కోపంతో ఊగిపోతుంటారా.? ఈ పాము, రంపం కథ చదివితే మీ జీవితమే మారుతుంది

Motivational story: జీవితంలో మ‌న‌ల్ని కొందరు కావాల‌ని రెచ్చ‌గొడుతుంటారు. అయితే ఇలాంటి వాటికి స్పందించి అన‌వ‌స‌రంగా స్పందిస్తే ఇబ్బందులు తప్ప‌వ‌ని చాటి చెప్పే ఒక మంచి మోటివేష‌న‌ల్ క‌థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Narender Vaitla
| Updated : Dec 03 2025, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అనుకోని గాయం, ఉప్పొంగిన కోపం
Image Credit : Generated by google gemini AI

అనుకోని గాయం, ఉప్పొంగిన కోపం

అన‌గ‌న‌గా ఒక రోజు అడ‌విలో ఓ పాము నెమ్మదిగా ముందుకు వెళ్తుంటుంది. దారి మధ్యలో ఆకుల పొద‌ల్లో ఉన్న‌ ఓ రంపం పాము నడుముపై గుచ్చుకుంటుంది. గాయం చిన్నదే అయినా, అది పాములో తీవ్ర ఆగ్రహం రగిలిస్తుంది. న‌న్నే గాయ పెడ‌తావా.? అని కోపంతో ఊగిపోతుంది.

25
ప్రతీకారం మొదలైన క్షణం
Image Credit : facebook

ప్రతీకారం మొదలైన క్షణం

గాయానికి కారణం రంపమే అనుకుని పాము దాని మీద పడుతుంది. కోరలతో బలంగా కాటేస్తుంది. ఆ రంపం ఇనుపంలా గట్టిగా ఉండటంతో పళ్లే విరిగిపోతాయి. నొప్పి మరింత పెరిగినా, కోపం తగ్గదు. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అన్న త‌ప‌న పాములో క‌నిపిస్తుంది.

Related Articles

Related image1
దేశంలోనే అతిపొడవైన గ్లాస్ స్కైవాక్.. మన తెలుగు రాష్ట్రంలోనే. 262 మీటర్ల ఎత్తులో అదిరిపోయే థ్రిల్
Related image2
డైప‌ర్ వాడితే పిల్ల‌ల కిడ్నీలు దెబ్బ‌తింటాయా.? ఇందులో నిజ‌మెంత‌..
35
కోపం ఆలోచనను మింగేసిన సమయం
Image Credit : Asianet News

కోపం ఆలోచనను మింగేసిన సమయం

పాము పళ్ల బలంతో సాధ్యం కాదని గ్రహిస్తుంది. ఇక శరీరంతో రంపాన్ని నలిపేయాలని చూట్టుతుంది. రంపం పదునుగా ఉండ‌డంతో పాము శ‌రీరాన్ని కోసేస్తుంది. కానీ కోపంతో ఉన్న పాము ఆ ప్ర‌మాదాన్ని కూడా గుర్తించ‌లేని స్థితిలో ఉంటుంది. ఎలాగైనా రంపాన్ని ఓడించాల‌న్న క‌సితో ఉంటుంది.

45
చివ‌రికి పాము ప‌రిస్థితి
Image Credit : Generated by google gemini AI

చివ‌రికి పాము ప‌రిస్థితి

చివరికి రంపం ఏమాత్రం దెబ్బతినదు. కానీ పాము మాత్రం శరీరంతా కోసుకుపోయి కింద పడిపోతుంది. ప్రతీకారం కోసం పెట్టిన శక్తి ఆ రంపాన్ని ఏం చేయ‌లేదు. కానీ పాము చ‌నిపోతుంది. నష్టం రంపానికి కాదు, పాముకు మాత్రమే జ‌రుగుతుంది.

55
గొప్ప సందేశం
Image Credit : Generated by google gemini AI

గొప్ప సందేశం

మన జీవితంలో కూడా కొంతమంది కావాలని మాటలతో ప్రేరేపిస్తారు. చిన్న సంఘటనను పెద్ద సమస్యలా చూపించి మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఒక‌వేళ రెచ్చిపోయి కోపంతో వ్య‌వ‌హ‌రిస్తే.. నిర్ణయాలు తప్పుతాయి. ఆలోచన కోల్పోతారు. నష్టం కూడా మనకే జరుగుతుంది. అందుకే.. ఎవరైనా రెచ్చగొట్టినా, స్వభావం కోల్పోకూడ‌దు. ప్రతిస్పందించేముందు క్షణం ఆగి ఆలోచించాలి. ఆ క్షణమే మన జీవితాన్ని కాపాడగలదు అనే గొప్ప సందేశం ఈ క‌థ‌లో ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఫీల్ గుడ్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Recommended image2
అమెరికా అర్చకుల ముందు ఐటీ ఉద్యోగులు జూజుబి.. ఒక్కో అయ్యవారి ఆదాయం ఎంతో తెలుసా..?
Recommended image3
Top 5 Mysterious Places : ఇళ్లకు తలుపులే ఉండవు, పాములతో కలిసి జీవనం.. ఇండియాలో టాప్ 5 వింత గ్రామాలు..!
Related Stories
Recommended image1
దేశంలోనే అతిపొడవైన గ్లాస్ స్కైవాక్.. మన తెలుగు రాష్ట్రంలోనే. 262 మీటర్ల ఎత్తులో అదిరిపోయే థ్రిల్
Recommended image2
డైప‌ర్ వాడితే పిల్ల‌ల కిడ్నీలు దెబ్బ‌తింటాయా.? ఇందులో నిజ‌మెంత‌..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved