MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • World facts: రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు లక్షలాదిమందిని ఎలా చంపగలిగారు? సమాధానం చెప్పేసిన ప్రయోగం

World facts: రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు లక్షలాదిమందిని ఎలా చంపగలిగారు? సమాధానం చెప్పేసిన ప్రయోగం

World facts: రెండో ప్రపంచ యుద్ధం సాధారణమైనది కాదు. అది ఒక ఊచకోత. నాజీ సైనికులు తమ పైవారి ఆజ్ఞలను పాటించి లక్షలాది మందిని చంపేశారు. కేవలం ఆజ్ఞల ద్వారా వారు అంత మందిని మానవత్వం లేకుండా ఎలా చంపారు? దీనికి ఓ శాస్త్రవేత్త సమాధానాన్ని కనిపెట్టాడు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 19 2026, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నాజీలు ఎవరు?
Image Credit : Getty

నాజీలు ఎవరు?

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీలో నాజీ పార్టీ అధికారంలో ఉంది. దీని నాయకుడు అడాల్ఫ్ హిట్లర్. నాజీలు తమ జాతి మాత్రమే గొప్పదని నమ్మేవారు. యూదులు, వికలాంగులు, ఇతర మతాలవారిని మనుషులుగా కూడా చూసేవారు కాదు. వారిని శత్రువులుగా భావించేవారు. విపరీతమైన ద్వేషభావంతో రగిలిపోయారు. లక్షలాది మందిని బలవంతంగా తీసుకెళ్లి అక్కడ గ్యాస్ ఛాంబర్లలో పెట్టి చంపారు. కొందరికి ఆహారం పెట్టకుండా రోజుల తరబడి ఉంచి మరణించేలా చేశారు. మరి కొందరిని విద్యుత్ షాక్ తో చంపేశారు. రకరకాల క్రూరమైన మార్గాలను అనుసరించి తమపై అధికారుల మాట విని నాజీ సైనికులు 60 లక్షలకు పైగా యూదులను చంపారని అంచనా. ఇక కోట్ల మంది ఈ హింసలో ప్రాణాలు కోల్పోయారని అంటారు. దీనిని హోలోకాస్ట్ అని పిలుచుకుంటారు.

24
మిల్ గ్రామ్ ప్రయోగం ఏంటి?
Image Credit : Chat gpt

మిల్ గ్రామ్ ప్రయోగం ఏంటి?

ఈ నాజీ సైనికులు ఎవరూ చెడ్డవాళ్ళు కాదు. పుట్టుకతోనే వారు నేరస్థులు కాదు. తమ పై అధికారులు ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నించకుండా పాటించారు. అలా ఒక వ్యక్తి అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను మానవత్వం కూడా మరిచిపోయి ఎలా పాటించగలిగాడు అన్నదే ఇక్కడ ప్రశ్న. తన కళ్ళ ముందే ఒక వ్యక్తి విలవిలలాడుతూ ప్రాణాలు పోతున్నా అతడు ఎలా తట్టుకోగలిగాడు? పై అధికారుల ఇచ్చిన ఆజ్ఞలను ఎలా ఫాలో అయ్యాడు? అనేది ఎంతో మందిలో వచ్చిన సందేహం వచ్చింది. అలా సందేహం వచ్చిన వ్యక్తుల్లో మనస్తత్వ శాస్త్రవేత్త స్టాన్లీ మిల్గ్రామ్ కూడా ఒకరు. ఆయన ఆ నాజీ సైనికుల మనస్తత్వాన్ని తెలుసుకునేందుకు ఒక ప్రయోగం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా దీన్ని ‘మిల్గ్రామ్ ఎలక్ట్రిక్ షాక్ ఎక్స్ పెరిమెంట్’ పేరుతో చరిత్రలో నిలిచిపోయింది.

Related Articles

Related image1
Wealth Mantras: పేదరికాన్ని తొలగించే శక్తివంతమైన మంత్రాలు ఇవిగో, వీటిని ఎప్పుడు జపించాలంటే
Related image2
Baba Vanga: ఈ ఏడాది చివరి వరకు ఈ 4 రాశుల వారికి కష్ట నష్టాలు తప్పకపోవచ్చు, బాబా వంగా జోస్యం
34
ఆ ప్రయోగం ఎలా చేశారు?
Image Credit : Getty

ఆ ప్రయోగం ఎలా చేశారు?

ఈ ప్రయోగంలో భాగంగా శాస్త్రవేత్త స్టాన్లీ కుర్చీలో ఒక వ్యక్తిని కూర్చోబెట్టాడు. అతని చేతికి ఎలక్ట్రిక్ షాక్ ను ఇచ్చే ఎక్విప్‌మెంట్ సిద్ధం చేశాడు. కొంతమంది వాలంటీర్లను బయట నుంచి తీసుకొచ్చాడు. వారికి దీని గురించి ఏమీ తెలియదు. అయితే కుర్చీలో కూర్చున్న వ్యక్తికి మాత్రం తనకు ఎలక్ట్రిక్ షాక్ తగలదని తెలుసు. అతడిని ముందుగానే ప్రిపేర్ చేశాడు స్టాన్లీ. ఎవరైనా స్విచ్ నొక్కగానే కరెంట్ షాక్ తగిలి విలవిలలాడుతున్నట్టు నటించమని చెప్పాడు. ఇక బయట నుంచి వాలంటీర్లను తీసుకువచ్చి కుర్చీలో కూర్చున్నవ్యక్తికి ఎలక్ట్రిక్ షాక్ తగిలేలా చేయమన్నాడు. అతడు విలవిలలాడుతున్నా కూడా మీరు కచ్చితంగా ఆ పని చేసి తీరాలి దానికి తగ్గ బహుమతి కూడా మీకు ఉంటుంది అని చెప్పాడు.

వచ్చిన వాలంటీర్లు స్టాన్లీ చెప్పిన విధంగానే స్విచ్ ను నొక్కారు. నిజానికి ఎలాంటి ఎలక్ట్రిక్ షాక్ అక్కడ కుర్చీలో కూర్చున్న వ్యక్తికి తగలకపోయినా ఆయన బాధపడుతున్నట్టు నటించాడు. అతని అరుస్తున్నా కూడా ఈ వాలంటీర్లు ఎవరూ వెనక్కి తగ్గలేదు. బాధపడుతూనే మరింతగా డోసేజ్ పెంచడానికి ప్రయత్నించారు. స్టాన్లీ ఇచ్చిన ఆదేశాలను పాటించారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది ఈ ప్రయోగంలో పాల్గొన్నారు.

44
భయపడుతూనే చేశారు
Image Credit : Getty

భయపడుతూనే చేశారు

ఈ ప్రయోగంలో వచ్చిన ఫలితాలు స్టాన్లీని చాలా ఆశ్చర్యపరిచాయి. దాదాపు 65 శాతం మంది వాలంటీర్లు చివరి వరకు అతని ప్రాణాలు పోతాయని అనిపించినా కూడా షాక్ ఇస్తూనే ఉన్నారు. భయపడుతూ, టెన్షన్ పడుతూనే ఆ పని చేశారు. అంటే అధికారంలో ఉన్న వ్యక్తి లేదా బలమైన వ్యక్తి చెప్పడంతో వారు చేసేందుకు సిద్ధపడ్డారు. నిజానికి వారంతా మంచి వాళ్లే.. కానీ ఆదేశాల వల్ల చెడు పని చేయడానికి కూడా సిద్ధపడ్డారు. పైనుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక తమ మనస్సాక్షి చెప్పేది వినకుండా ఆ పనులు చేసినట్టు స్టాన్లీ చివరకు నిర్ధారించాడు. నాజీ సైనికులు కూడా ఇలా ఇలాగే చేసి ఉంటారని తన పరీక్ష ద్వారా ప్రపంచానికి నిరూపించాడు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
యుద్ధం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Stray Dogs: వీధి కుక్కలకు ఫుడ్ పెడుతున్నారా? ముందుగా ఈ రూల్స్ తెలుసుకోండి, లేకపోతే ఇబ్బందులే
Recommended image2
Parenting Tips : మీ పిల్లల్ని ఎలా పెంచాలి..? ఎలా పెంచకూడదు..?
Recommended image3
Worlds ugliest car: ప్రపంచంలోనే అత్యంత వికారమైన కారు ఇది.. 35 ఏళ్ల తరువాత మళ్లీ రోడ్డు మీదకొచ్చింది
Related Stories
Recommended image1
Wealth Mantras: పేదరికాన్ని తొలగించే శక్తివంతమైన మంత్రాలు ఇవిగో, వీటిని ఎప్పుడు జపించాలంటే
Recommended image2
Baba Vanga: ఈ ఏడాది చివరి వరకు ఈ 4 రాశుల వారికి కష్ట నష్టాలు తప్పకపోవచ్చు, బాబా వంగా జోస్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved