- Home
- Entertainment
- జీ సినీ అవార్డ్స్ 2025: తారల సందడి: మైండ్ బ్లోయింగ్ లుక్ లో రష్మిక, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ సందడి
జీ సినీ అవార్డ్స్ 2025: తారల సందడి: మైండ్ బ్లోయింగ్ లుక్ లో రష్మిక, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ సందడి
జీ సినీ అవార్డ్స్ 2025: ముంబైలో జరిగిన జీ సినీ అవార్డ్స్ వేడుకలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. కృతి సనన్, రష్మిక మందన్న నుండి తమన్నా భాటియా వరకు చాలా మంది నటీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జీ సినీ అవార్డ్స్ వేడుకలో తారల సందడి
శనివారం రాత్రి జీ సినీ అవార్డ్స్ వేడుక జరిగింది. బాలీవుడ్ మరియు టీవీ నటీమణుల సందడి నెలకొంది. ఫోటోలు చూడండి…
కృతి సనన్ మెరూన్ గౌనులో
కృతి సనన్ మెరూన్ ఆఫ్ షోల్డర్ గౌనులో మెరిసిపోయారు. జీ సినీ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై ఆమె అందంగా కనిపించారు.
చీరకట్టులో రాశా, అనన్య
జీ సినీ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై రాశా థడాని, అనన్య పాండే చీరకట్టులో మెరిశారు.అనన్య పాండే తెలుగులో లైగర్ చిత్రంలో నటించింది.
శర్వరి, ఈషా
జీ సినీ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై శర్వరి వాగ్ బ్లాక్ గౌనులో, ఈషా కొప్పికర్ బంగారురంగు దుస్తుల్లో కనిపించారు.
సోహా, ప్రజ్ఞ
సోహా అలీ ఖాన్, ప్రజ్ఞా జైస్వాల్ కూడా అవార్డ్స్ వేడుకలో సందడి చేశారు. ప్రగ్యా జైస్వాల్ తరచుగా సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ షేర్ చేస్తుంటారు.
ఎర్రటి గౌనులో ఆకాంక్ష
ఆకాంక్ష పూరీ కూడా ఎర్రటి ఆఫ్ షోల్డర్ గౌనులో అలరించారు. గ్లామరస్ లుక్ లో ఆమె మెరిసిపోతోంది. ఆమె గ్లామర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఫాతిమా, వాణీ కపూర్
ఫాతిమా సనా షేక్, వాణీ కపూర్ కూడా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. వాణి కపూర్ బాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్స్ లో ఒకరు.
తనీషా, షనాయా
తనీషా ముఖర్జీ, షనాయా కపూర్ కూడా అవార్డ్స్ వేడుకలో సందడి చేశారు. జీ అవార్డుల వేడుక నటీమణుల సందడితో ఘనంగా జరిగింది.
క్రిస్టల్ దుస్తుల్లో నైరా
టీవీ నటి నైరా బెనర్జీ క్రిస్టల్ దుస్తుల్లో మెరిశారు. వైవిధ్యంగా ఉన్న ఆమె అవుట్ ఫిట్ ప్రతిఒక్కరిని ఆకర్షించే విధంగా ఉంది.
క్రిస్టల్, హేలీ
టీవీ నటీమణులు క్రిస్టల్ డిసౌజా, హేలీ షా కూడా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. జీ అవార్డుల వేడుకలో నటీమణులు ఒకరిని మించేలా మరొకరు గ్లామర్ లుక్ లో రెచ్చిపోయారు.