MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay Rashmika: విజయ్ దేవరకొండతో పెళ్లైతే రాజకీయాల్లోకి రష్మిక.. వారి జాతకం ఇదే చెబుతోందా?

Vijay Rashmika: విజయ్ దేవరకొండతో పెళ్లైతే రాజకీయాల్లోకి రష్మిక.. వారి జాతకం ఇదే చెబుతోందా?

స్ఠార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నల నిశ్చితార్థం శుక్రవారం నాడు నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు నటుల జాతకాల ప్రకారం పెళ్లి తర్వాత రష్మిక రాజకీయాల్లోకి వస్తుందా? జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Oct 04 2025, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయ్ దేవరకొండ రష్మిక మందన్న
Image Credit : X/GeethaArts

విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న

నిన్న(శుక్రవారం) ఎంగేజ్ మెంట్ తో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా వీరి ప్రేమ, పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పుడు చాలామంది జ్యోతిష్య నిపుణులు… విజయ్ , రష్మికల జాతకాల ప్రకారం వీరు చాలా తెలివైనవారు. రెండు కుటుంబాల అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటారని చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య విజయ్, రష్మిక ఎంగేజ్ మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెళ్లి తర్వాత వీరిద్దరి లైఫ్ ఎలా మారిపోతుంది? పెళ్లి ఎవ్వరికి బాగా కలిసివస్తుంది. పెళ్లి తర్వాత రష్మిక రాజకీయాల్లోకి వస్తుందా? పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

25
రష్మిక మందన్న
Image Credit : stockphoto

రష్మిక మందన్న

రష్మిక మందన్న సినీరంగంలోకి వచ్చిన తర్వాత ఆమె జీవితంలో అతిపెద్ద ప్రతికూల అంశం ఏదైనా ఉందంటే అది ఆమె గత నిశ్చితార్థమే. రష్మిక మందన్నకు గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు వారు విడిపోయారు. అక్కడితో అది ముగిసిపోయింది. అయితే రష్మిక జాతకం ప్రకారం ఆ ఎంగేజ్ మెంట్ రద్దు చేసిన తర్వాతే ఆమెకు కలిసివచ్చిందని చాలామంది పండితులు చెబుతున్నారు. రష్మిక జాతకం.. అనుకూలత లేని బంధాల్లో ఉంటేనే ప్రతికూల ఫలితాలను ఇస్తుందనేది వారి మాట. నిజానికి ఆమె వ్యక్తిగత అదృష్టం చాలా బలమైనదని వారు చెబుతున్నారు.

Related Articles

Related image1
Rashmika Vijay: విజయ్, రష్మికల పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది? వారి జాతకాలు ఏం చెబుతున్నాయో తెలుసా?
Related image2
Karthika Deepam 2 Latest Episode: వేలంపాటలో కార్తీక్ ను లేకుండా చేసిన జ్యో- దీపను బాధపెట్టిన సుమిత్ర
35
విజయ్ దేవరకొండ
Image Credit : Asianet News

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ జాతకంలో వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేసే ప్రత్యక్ష దోషం ఉన్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. శుక్రుడు నీచ స్థితిలో ఉంటడం వల్ల విజయ్ కెరీర్‌ సమస్యలతో పాటు, వివాహ సంబంధిత సమస్యలు తప్పవని అంచనా వేస్తున్నారు. అయితే రష్మికకు ఉన్న అద్భుత యోగం, విజయ్ దేవరకొండ జాతకంలో ఉన్న శుక్రుడి నీచం కారణంగా ఏర్పడే వివాహ సమస్యలను అధిగమించడానికి బలంగా సహాయపడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కర్కాటక లగ్నం కారణంగా విజయ్‌లో ఉన్న రక్షించే స్వభావం రష్మికకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వవచ్చని చెబుతున్నారు.

45
కుటుంబ నేపథ్యం
Image Credit : Getty

కుటుంబ నేపథ్యం

నిజానికి ఈ స్టార్స్ ఇద్దరూ మధ్యతరగతి నేపథ్యం నుంచి స్వయంకృషితో ఎదిగినవారే. రష్మిక కూడా తన కుటుంబ ఆర్థిక కష్టాల గురించి చాలాసార్లు అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా విజయ్ కూడా తన తండ్రి కష్టపడటం చూసి, కుటుంబ జీవన ప్రమాణాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉమ్మడి నేపథ్యం వారి కుటుంబాల మధ్య బంధాన్ని, గౌరవాన్ని పెంచడానికి సహాయపడుతాయని పండితులు అంచనా వేస్తున్నారు.

55
రాజకీయాల్లోకి రష్మిక!
Image Credit : X: Rashmika Mandanna

రాజకీయాల్లోకి రష్మిక!

రష్మిక జాతకంలోని అసాధారణ అదృష్టం దేవరకొండ కుటుంబ ప్రతిష్టపై కూడా సానుకూల ప్రభావం చూపించే అవకాశం ఉందట. రష్మిక మందన్నకు ఉన్న బలమైన అదృష్టం కారణంగా ఆమె భవిష్యత్తులో లోక్‌సభ ఎంపీ అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ రష్మిక రాజకీయాల్లోకి ప్రవేశిస్తే, తద్వారా విజయ్ దేవరకొండ కుటుంబానికి మరింత సామాజిక గుర్తింపు, ప్రజాదరణ దక్కే అవకాశం ఉంది. రష్మిక రాజకీయ, సినీరంగాలలో సాధించే అద్భుత విజయాలు దేవరకొండ కుటుంబ ప్రతిష్టను మరింత పెంచవచ్చని పండితులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
తెలుగు సినిమా
వినోదం
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న

Latest Videos
Recommended Stories
Recommended image1
Akhanda 2 OTT: థియేటర్లో డిజాస్టర్‌, ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతున్న `అఖండ 2`.. బాలయ్య ర్యాంపేజ్‌
Recommended image2
Jagapathi Babu: పెట్టెలో పెట్టి మర్చిపోయారు.. మరణగండం గురించి మతిపోయే విషయాలు బయటపెట్టిన జగపతిబాబు
Recommended image3
Top 5 Heroes: అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న హీరోలు.. చిరు, ప్రభాస్‌, నాగ్‌, బన్నీ, మహేష్‌ హౌజెస్‌ ఎలా ఉన్నాయంటే?
Related Stories
Recommended image1
Rashmika Vijay: విజయ్, రష్మికల పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది? వారి జాతకాలు ఏం చెబుతున్నాయో తెలుసా?
Recommended image2
Karthika Deepam 2 Latest Episode: వేలంపాటలో కార్తీక్ ను లేకుండా చేసిన జ్యో- దీపను బాధపెట్టిన సుమిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved