MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళి , కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా ఎలా మిస్ అయ్యిందో తెలుసా?

రాజమౌళి , కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా ఎలా మిస్ అయ్యిందో తెలుసా?

తెలుగు సినిమా గౌరవాన్ని హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టాడు రాజమౌళి.. అయితే జక్కన్నతో చాలామంది స్టార్ హీరోల సినిమాలు మిస్ అయ్యాయి. ఆ లిస్ట్ లో కమల్ హాసన్ కూడా ఉన్నారు. ఇంతకీ వీరి కాంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 25 2025, 09:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు సినిమా గర్వపడేలా చేసిన దర్శకుడు..
Image Credit : Rajamouli\Twitter

తెలుగు సినిమా గర్వపడేలా చేసిన దర్శకుడు..

టాలీవుడ్ లో తన ప్రస్థానం స్టార్ట్ చేసి.. ఇండియన్ సినిమా గర్వపడేలా చేసిన దర్శకుడు రాజమౌళి. టాలీవుడ్ ను హాలీవుడ్ స్థాయిలోనిలబెట్టిన ఎస్.ఎస్. రాజమౌళి.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. ఈ స్థాయికి చేరకున్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న అగ్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు రాజమౌళి. ఒకప్పుడు మన టాలీవుడ్ ను చిన్న చూపు చూసినవారికి.. పెద్ద సమాధానం చెప్పాడు జక్కన్న. ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయడానికి పెద్ద పెద్ద హీరోలంతా పోటీపడుతున్నారు.. కానీ..ఒకప్పుడు జక్కన్న ఇచ్చిన ఆఫర్ను రిజెక్ట్ చేసిన హీరోలు ఉన్నారు. ఈ స్టార్ డైరెక్టర్ తో సినిమా మిస్ అయిన వారిలో సూర్య, కమల్ హాసన్ లాంటి స్టార్స్ ఉన్నారు.

24
సెలక్టివ్ గా సినిమాలు చేస్తోన్న రాజమౌళి..
Image Credit : jio hotstar

సెలక్టివ్ గా సినిమాలు చేస్తోన్న రాజమౌళి..

టీవీ సీరియల్ తో , చిన్న సినిమాలతో తన కెరీర్‌ను మొదలుపెట్టిన రాజమౌళి, క్రమంగా తన స్టైల్‌, విజన్‌తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో వారణాసి సినిమాతో పాన్ వరల్డ్ ను టచ్ చేయబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రాజమౌళి విజన్ కు.. జేమ్స్ కామరూన్ లాంటి హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా సపోర్ట్ చేయడం విశేషం. రాజమౌళితో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ హీరోలు, స్టార్ నటులంతా పోటీపడుతుంటారు. కానీ జక్కన్న మాత్రం తనకు నచ్చిన కథలు, తనకు సరిపోయే హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ చాలా సెలెక్టివ్‌గా ముందుకు సాగుతున్నారు.

Related Articles

Related image1
Anasuya : బట్టల గురించి మాట్లాడటం చేతకానితనం, మేము ఏం వేసుకోవాలో మీరే చెప్తారా? శివాజీపై అనసూయ మళ్లీ ఫైర్..
Related image2
బిగ్ బాస్ తెలుగు 9 కోసం 15 కోట్లు పెంచిన నాగార్జున ? ఈ సీజన్ కి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా?
34
కమల్ హాసన్ తో మిస్సైన సినిమా..?
Image Credit : @iKamalHaasan

కమల్ హాసన్ తో మిస్సైన సినిమా..?

ఈ క్రమంలో రాజమౌళి గతంలో చాలామంది స్టార్ హీరోలకు ఆఫర్ ఇచ్చాడు. కానీ వారు ఆ అవకాశాలను వదులుకున్నారు. బాహుబలి లాంటి కథలను సూర్యతో రూపొందించాలని అనుకున్నాడు జక్కన్న. కానీ అది కుదరలేదు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్‌తో కూడా రాజమౌళి సినిమా చేయాలని ప్రయత్నించాడట. అది కూడా 20 ఏళ్ల క్రితమే ఈ పనిచేశాడట జక్కన్న. 2005వ సంవత్సరంలో కమల్ హాసన్‌కు తగ్గట్టుగా ఒక డిఫరెంట్ స్టోరీని రాసుకుని.. కమల్ కు వివరించాడట. ఆ కథలో డ్యాన్స్‌తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌కు విపరీతమైన స్కోప్ ఉండడంతో, కమల్ హాసన్ అయితే ఆ పాత్రకు సరిపోతారని రాజమౌళి భావించారని సమాచారం.

44
రాజమౌళి ఆఫర్ కు కమల్ సమాధానం..
Image Credit : Jio hotstar

రాజమౌళి ఆఫర్ కు కమల్ సమాధానం..

కమల్ హాసన్ తో తెలుగు, తమిళం రెండుభాషల్లో వర్కౌట్ అయ్యేలా ఓ ప్లాన్ ను రెడీ చేసుకున్నాడట రాజమౌళి. అయితే అప్పటికే కమల్ హాసన్‌ చాలా బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలు చేస్తున్నాడు. దాంతో ఈ సినిమా కోసం కోంత కాలం ఆగాల్సి ఉంటుందని రాజమౌళితో అన్నాడట. తన వద్ద డేట్స్ లేకపోవడంతో కమల్ హాసన్ ఈసినిమాను హోల్డ్ లో పెట్టాడు. ఇక చేసేది లేక రాజమౌళి ఆ స్క్రిప్ట్‌ను పక్కన పెట్టి మరో సినిమా మీద వర్క్ చేయడం ప్రారంభించారు. ఆతరువాత కాలంలో అసలు ఈ సినిమాపై ఎటువంటి కదలిక రాలేదు. ఇలా వీరిద్దరి కాంబో మిస్ అయినట్టు తెలుస్తోంది. ఒకవేళ అప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ అయి ఉంటే, ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసేదని అభిమానులు అంటున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
Recommended image2
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image3
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Related Stories
Recommended image1
Anasuya : బట్టల గురించి మాట్లాడటం చేతకానితనం, మేము ఏం వేసుకోవాలో మీరే చెప్తారా? శివాజీపై అనసూయ మళ్లీ ఫైర్..
Recommended image2
బిగ్ బాస్ తెలుగు 9 కోసం 15 కోట్లు పెంచిన నాగార్జున ? ఈ సీజన్ కి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved