MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • థియేటర్లు ఇంకా హౌస్ ఫుల్స్.. కాంతార చాప్టర్ 1 ఇంత త్వరగా ఓటీటీలోకి ఎందుకు ? కారణం ఇదే

థియేటర్లు ఇంకా హౌస్ ఫుల్స్.. కాంతార చాప్టర్ 1 ఇంత త్వరగా ఓటీటీలోకి ఎందుకు ? కారణం ఇదే

థియేటర్లలో భారీ విజయం సాధించిన కాంతార చాప్టర్ 1 సినిమా, విడుదలైన 29వ రోజే ఓటీటీలోకి వస్తోంది. దీని వెనుక ఓ ముఖ్యమైన కారణం ఉంది. ఇప్పటికీ థియేటర్స్ లో బాగా రాణిస్తున్న ఈ చిత్రం ఓటీటీలో ఎందుకు రిలీజ్ అవుతుందో ఈ కథనంలో తెలుసుకోండి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Oct 30 2025, 07:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్
Image Credit : Asianet News

కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్

నిర్మాతలకు ఓటీటీ హక్కులు అదనపు ఆదాయ మార్గం. థియేటర్లలో సరిగా ఆడని సినిమాలకు ఓటీటీ డీల్ బాగా ఉపయోగపడుతుంది. కానీ, బాగా ఆడే సినిమాల ఓటీటీ విడుదలను వీలైనంత ఆలస్యం చేయాలనుకుంటారు. బాలీవుడ్‌లో 8 వారాల గ్యాప్ ఉంటే, సౌత్‌లో 4 వారాలే. ఈ మధ్య కొన్ని సినిమాలు 8 వారాల గ్యాప్‌ తీసుకుంటున్నాయి.

24
ప్రైమ్ వీడియోలో కాంతార చాప్టర్ 1
Image Credit : X

ప్రైమ్ వీడియోలో కాంతార చాప్టర్ 1

'కాంతార చాప్టర్ 1' ఓటీటీ విడుదలపై పెద్ద చర్చే జరుగుతోంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం కనీసం నెలరోజులు కూడా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అక్టోబర్ 31న నుంచి సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇంత పెద్ద హిట్ సినిమా ఇంత త్వరగా ఓటీటీలోకి రావడానికి ఓ కారణం ఉంది. .

Related Articles

Related image1
'మాస్ జాతర' నటీనటుల రెమ్యునరేషన్స్.. ఫ్లాపుల్లో ఉన్న రవితేజ, శ్రీలీల ఎంత తీసుకున్నారో తెలుసా ?
Related image2
'బాహుబలి 3' ఎలా ఉండబోతోందో తెలుసా ? బడ్జెట్ కూడా ప్రకటించిన రాజమౌళి.. ప్రభాస్ కి మైండ్ బ్లాక్
34
కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
Image Credit : instagram

కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్

ఈ సినిమా 28 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹821.5 కోట్లు వసూలు చేసింది. ఇంకా మంచి వసూళ్లు రాబట్టే సినిమా ఓటీటీ ప్రకటన షాకిచ్చింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లు రేపు (అక్టోబర్ 31) అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతాయి. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది.

44
మూడేళ్ళ క్రితమే ఒప్పందం
Image Credit : X

మూడేళ్ళ క్రితమే ఒప్పందం

హిందీ వెర్షన్ 8 వారాల తర్వాతే వస్తుంది. ఇది నిర్మాతలు కోరుకున్నది కాదు, తప్పనిసరి పరిస్థితి. మూడేళ్ల క్రితం చేసుకున్న ఓటీటీ ఒప్పందమే కారణం. అందుకే 29వ రోజే ఓటీటీలోకి వస్తోంది. సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అప్పుడు ఊహించలేదు. ఓటీటీ విడుదల తర్వాత కూడా వసూళ్లు తగ్గవని నిర్మాతల నమ్మకం.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ఓటీటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Prime Video Top 10 Movies: ఓటీటీలో `నారీ నారీ నడుమ మురారి` సంచలనం.. ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌.. టాప్‌ 10 మూవీస్‌
Recommended image2
Rajinikanth MGR: రజినీ జీవితాన్ని మార్చేసిన ఎంజీఆర్ 'మాస్టర్ ప్లాన్'! ఆ స్టైల్ ఎందుకంత నచ్చలేదంటే?
Recommended image3
Zero Flop Record: ఫ్లాప్ ఎరుగని హీరో.. చేసిన 3 సినిమాలు బ్లాక్‌బస్టర్.. ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
'మాస్ జాతర' నటీనటుల రెమ్యునరేషన్స్.. ఫ్లాపుల్లో ఉన్న రవితేజ, శ్రీలీల ఎంత తీసుకున్నారో తెలుసా ?
Recommended image2
'బాహుబలి 3' ఎలా ఉండబోతోందో తెలుసా ? బడ్జెట్ కూడా ప్రకటించిన రాజమౌళి.. ప్రభాస్ కి మైండ్ బ్లాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved