- Home
- Entertainment
- 'కన్నప్ప' హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఎక్కడ ? ప్రమోషన్స్ కి పూర్తిగా దూరం.. అసలేం జరిగింది
'కన్నప్ప' హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఎక్కడ ? ప్రమోషన్స్ కి పూర్తిగా దూరం.. అసలేం జరిగింది
మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించారు.

మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించారు. ఆయన కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు.తొలి షో నుంచే కన్నప్ప చిత్రానికి మంచి రెస్పాన్స్ మొదలైంది. ఫస్ట్ హాఫ్ విషయంలో ఆడియన్స్ కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ, క్లైమాక్స్ లో మంచు విష్ణు పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికే హైలెట్ గా నిలిచినట్లు ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, ప్రభుదేవా, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు. తమిళ బ్యూటీ ప్రీతి ముకుందన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ భక్తి రస చిత్రం అయినప్పటికీ ప్రీతి ముకుందన్ తన పాత్ర మేరకు గ్లామరస్ గా కనిపించారు.
కానీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం ఒకటి ఉంది. కన్నప్ప లాంటి భారీ చిత్రంలో నటించినప్పటికీ ప్రీతి ముకుందన్ ఎక్కడా ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఆమె ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో ఫ్యాన్స్ లో అనుమానాలు మొదలవుతున్నాయి.
కన్నప్ప చిత్రంలో కీలక పాత్రల్లో నటించిన మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి అగ్ర హీరోలు కూడా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా ఫుల్ లెన్త్ రోల్ లో నటించింది. అయినప్పటికీ ఆమె ప్రమోషన్స్ కి పూర్తిగా దూరంగా ఉంది. ఆమె ప్రస్తావన కూడా ప్రమోషన్ సమయంలో అంతగా రాలేదు. అయితే ప్రీతి ముకుందన్ కన్నప్ప ప్రమోషన్స్ కి దూరంగా ఉండడానికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు.
అయితే సోషల్ మీడియా మాత్రం కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర న్యూజిలాండ్ షూటింగ్ సమయంలో కన్నప్ప టీమ్ తో ఆమెకు కొన్ని సమస్యలు వచ్చాయని అప్పటి నుంచి ఆంటీ ముట్టనట్లు వ్యవహరిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. అగ్రిమెంట్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఓం భీమ్ బుష్, స్టార్ లాంటి చిత్రాల్లో నటించింది.