MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మళ్లీ వాయిదా పడిన విశాల్ పెళ్లి, బర్త్ డే రోజు స్టార్ హీరో కీలక ప్రకటన ?

మళ్లీ వాయిదా పడిన విశాల్ పెళ్లి, బర్త్ డే రోజు స్టార్ హీరో కీలక ప్రకటన ?

ఆగస్టు 29న జరగాల్సిన హీరో విశాల్, నటి సాయి ధన్సిక పెళ్లి వాయిదా పడింది. గతంలో కూడా పలు మార్లు  విశాల్ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. మరి విశాల్ పెళ్లి చేసుకునేది ఎప్పుడు ? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 17 2025, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit : X/ Vishal

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగు కుర్రాడు విశాల్. స్టార్ హీరోగా ఎదిగిన విశాల్ పెళ్లి వార్త ప్రతీసారి వైరల్ న్యూస్ అవుతూనే ఉంటుంది. 2016లో నటుల సంఘం భవన నిర్మాణం ప్రారంభమైనప్పుడు, ఆ భవనం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పారు విశాల్. 

అనేక సమస్యల కారణంగా ఆ భవనం పూర్తి కావడానికి 9 సంవత్సరాలు పట్టింది. ఇంకా ఆ భవన నిర్మాణం పూర్తి కాలేదు. ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయి. తాను చెప్పినట్లుగానే నటుల సంఘం భవనం పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు విశాల్.

24
Image Credit : x/VishalKOfficial

విశాల్ కు ప్రస్తుతం 47 ఏళ్ళు. నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తి కావస్తున్న తరుణంలో, విశాల్ తను ప్రేమించి అమ్మాయి గురించి రీసెంట్ గా అనౌన్స్ చేశాడు. హీరోయిన్ సాయి ధన్సికను ప్రేమిస్తున్నట్లు విశాల్ వెల్లడించారు. 

యోగిత సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఇద్దరూ జంటగా పాల్గొని తమ ప్రేమ, పెళ్లి గురించి ప్రకటించారు. ఆగస్టు 29న తన పుట్టినరోజు సందర్భంగా తమ పెళ్లి జరుగుతుందని విశాల్ ప్రకటించారు. దీంతో విశాల్ - సాయి ధన్సిక జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Related Articles

Related image1
బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు?
Related image2
అన్నమయ్య సినిమా కోసం ప్రాణాలకు తెగించిన నాగార్జున, ఆ ఒక్క సీన్ కోసం అంత రిస్క్ చేశాడా?
34
Image Credit : x/VishalKOfficial

రెడ్ ఫ్లవర్ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా పాల్గొన్న విశాల్‌ను పెళ్లి గురించి ప్రశ్నించారు మీడియా ప్రతినిథులు. నటీనటుల సంఘ భవనం కోసం 9 ఏళ్లు పెళ్లి చేసుకోకుండా ఆగిపోయా, ఇంకో 3 నెలలు ఆగలేనా, అప్పటికి నటుల సంఘం భవనం సిద్ధమవుతుంది అని ఆయన అన్నారు. 

అంతే కాదు ఆగస్టు 29న నా పుట్టినరోజు సందర్భంగా శుభవార్త వస్తుంది, ప్రస్తుతం భవన నిర్మాణ పనులు పూర్తి చేయడంలో బిజీగా ఉన్నా, ఆ భవనంలో మొదటి పెళ్లి నాదే, ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకున్నా అని విశాల్ అన్నారు. దీన్ని బట్టి ఆగస్టు 29న తన పెళ్లి జరగదని విశాల్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

44
Image Credit : x/VishalKOfficial

ఇక విశాల్ పెళ్లి మళ్లీ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తి కావడానికి మరికొంత కాలం టైమ్ పట్టే అవకాశం ఉంది. దాంతో ఆగస్టు 29న పెళ్లి చేసుకోవాలి అనుకున్న విశాల్.. ఈసారి కూడా ఆ డేట్ ను వాయిదా వేసుకున్నట్టు సమాచారం. అయితే అగస్ట్ 29 న మాత్రం తన పెళ్లిడేట్ ప్రకటించే అవకాశం ఉంది. అంతే కాదు అదే రోజు భవనం ఓపెనింగ్ కు సబంధించి కూడా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌
Recommended image2
Actress Poorna: రెండోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ, బేబీ బంప్ ఫోటోలు చూసేయండి
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 11: అమూల్యను పెళ్లిచేసుకోలేదని వల్లికి చెప్పేసిన విశ్వక్, నర్మద ప్రేమలకు షాకిచ్చిన భాగ్యం
Related Stories
Recommended image1
బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు?
Recommended image2
అన్నమయ్య సినిమా కోసం ప్రాణాలకు తెగించిన నాగార్జున, ఆ ఒక్క సీన్ కోసం అంత రిస్క్ చేశాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved