MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుమన్ అయితే ఒప్పుకోను, చిరంజీవి అయితేనే చేస్తా.. మెగాస్టార్ కోసం విజయశాంతి అంత పని చేసిందా

సుమన్ అయితే ఒప్పుకోను, చిరంజీవి అయితేనే చేస్తా.. మెగాస్టార్ కోసం విజయశాంతి అంత పని చేసిందా

చిరంజీవి కోసం ఓ సినిమా విషయంలో విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఆ చిత్రాన్ని ఆమె రిజెక్ట్ చేసింది. కానీ చిరంజీవి మాత్రం పవన్ కళ్యాణ్ కోసం విజయశాంతికి షాకిచ్చారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 08 2025, 07:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి, విజయశాంతి సినిమాలు
Image Credit : Asianet News

చిరంజీవి, విజయశాంతి సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి లది వెండితెరపై తిరుగులేని జోడీ. వీరి కాంబినేషన్ లో వచ్చిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. చిరంజీవి, విజయశాంతి ఏకంగా 19 చిత్రాల్లో కలిసి నటించారు. వీరి కాంబోలో పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. స్వయం కృషి, కొండవీటి దొంగ, ఛాలెంజ్ లాంటి అద్భుతమైన చిత్రాల్లో కూడా వీరిద్దరూ నటించారు.

25
విజయశాంతితో లేడీ ఓరియెంటెడ్ చిత్రం
Image Credit : stockPhoto

విజయశాంతితో లేడీ ఓరియెంటెడ్ చిత్రం

కర్తవ్యం సినిమాతో విజయశాంతి తెలుగులో లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడ్డారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా విజయశాంతితో సినిమా చేయాలని ప్రయత్నించారు. ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. విజయశాంతితో సినిమా చేయాలని ప్రయత్నించా. దామిని అనే చిత్రానికి రీమేక్ ని విజయశాంతితో చేయాలని అనుకున్నాం. దామిని సూపర్ హిట్ అయిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం. విజయశాంతి చేస్తే బావుంటుంది అని అనిపించింది. నేను డైరెక్ట్ గా అడగకుండా నిర్మాత రవికిశోర్ తో అడిగించా. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే నేను మాట్లాడతా అని చెప్పా.

Related Articles

Related image1
చిరంజీవి కాలేంటి ఇలా ఉంది ? ఆ గాయం ఇప్పటిది కాదా.. వైరల్ వీడియో
Related image2
మహేష్ బాబు 'ఒక్కడు' ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడిన ఒకే ఒక్క మూవీ.. ఎన్టీఆర్, రవితేజ సినిమాలు గల్లంతు
35
తమ్ముడి కోసం విజయశాంతికి షాకిచ్చిన చిరు
Image Credit : stockPhoto

తమ్ముడి కోసం విజయశాంతికి షాకిచ్చిన చిరు

అప్పటికే విజయశాంతి కూడా దామిని మూవీ చూశారట. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది అని రవికిశోర్ చెప్పడంతో వెళ్లి మీట్ అయ్యా. విజయశాంతి ఈ చిత్రం చేయడానికి అంగీకరించింది. టైటిల్ ఊర్మిళ అని అనుకున్నాం. అందులో ఎవరైనా స్టార్ హీరో గెస్ట్ రోల్ లో నటించాలి. గెస్ట్ రోల్ కి చిరంజీవి గారిని అడగాలని అనుకున్నాం. వెళ్లి అడిగితే.. కళ్యాణ్ బాబుని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో లాంచ్ చేస్తున్నాం. ఆ మూవీలో నేను గెస్ట్ గా చేద్దాం అని అనుకుంటున్నా. ఇప్పుడు విజయశాంతి మూవీలో చేస్తే అన్నీ గెస్ట్ రోల్స్ అయిపోతాయి. కాబట్టి వద్దులే అని అన్నారు.

45
చిరంజీవి అయితేనే చేస్తా
Image Credit : our own

చిరంజీవి అయితేనే చేస్తా

చిరంజీవి నో చెప్పడంతో సుమన్ ని ఆ పాత్ర కోసం అడిగాం. సుమన్ ఓకె చెప్పారు. కానీ విజయశాంతి అడ్డం తిరిగారు. నేను చిరంజీవి అయితేనే చేస్తాను, సుమన్ అయితే చేయను అని అన్నారు. ఆమె సూపర్ స్టార్ కదా.. ఆమెకి తగ్గ హీరో ఉండాలి అని అనుకున్నారేమో అంటూ తమ్మారెడ్డి కామెంట్స్ చేశారు. చిరంజీవి కోసమే ఆమె అంత పెద్ద చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. ఆమె నో చెప్పడంతో వెంటనే మాలశ్రీని తీసుకోవడం జరిగింది. సుమన్ గెస్ట్ రోల్ లో నటించారు అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.

55
మీనా కూడా కండిషన్స్ పెట్టింది
Image Credit : Facebook/Suman

మీనా కూడా కండిషన్స్ పెట్టింది

ఇదిలా ఉండగా చిరంజీవి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించలేదు. విజయశాంతి రిజెక్ట్ చేసిన తర్వాత మీనాని కూడా అడిగాం. మీనా కూడా చాలా కండిషన్స్ పెట్టింది. గెస్ట్ రోల్ లో హీరోగా ఎవరిని తీసుకుంటున్నారు ? అది ఎలా చేస్తారు ఇది ఎలా చేస్తారు అని చాలా డౌట్లు అడిగింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో గెస్ట్ రోల్ లో ఎవరు నటిస్తే ఏంటి అని అనుకుని చివరికి మాలశ్రీని తీసుకున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
O Romeo Cast: 'ఓ రోమియో' స్టార్స్ ఆస్తులెంత? షాహిద్, తృప్తి, తమన్నా.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంది?
Recommended image2
Kadhalar Dhinam: భారతీయుడు సినిమాను మించిన బడ్జెట్, యువతకు పిచ్చెక్కించిన ఆ లవ్ స్టోరీ ఇదే!
Recommended image3
Silk Smitha: రజినీ, కమల్‌కే చుక్కలు చూపించింది.. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న ఆమె టాప్ 5 సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
చిరంజీవి కాలేంటి ఇలా ఉంది ? ఆ గాయం ఇప్పటిది కాదా.. వైరల్ వీడియో
Recommended image2
మహేష్ బాబు 'ఒక్కడు' ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడిన ఒకే ఒక్క మూవీ.. ఎన్టీఆర్, రవితేజ సినిమాలు గల్లంతు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved