MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కథ విపరీతంగా నచ్చింది, అయినా ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశా.. విజయ్ దేవరకొండ వదులుకున్న ఆ మూవీ ఇదే

కథ విపరీతంగా నచ్చింది, అయినా ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశా.. విజయ్ దేవరకొండ వదులుకున్న ఆ మూవీ ఇదే

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రీసెంట్ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తాను మిస్ చేసుకున్న ఒక మంచి చిత్రం గురించి చెప్పారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 15 2025, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Vijay Devarakonda

Vijay Devarakonda

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. గౌతమ్ తిన్ననూరి టాలెంటెడ్ డైరెక్టర్. జెర్సీ లాంటి క్లాసిక్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ తో కింగ్డమ్ చిత్రాన్ని యాక్షన్ మూవీ గా రూపొందిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

25
Vijay Deverakonda

Vijay Deverakonda

వాస్తవానికి ఈ చిత్రం మే 30న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలవల్ల జూలై 4వ తేదీకి వాయిదా వేశారు. విజయ్ దేవరకొండ ఈ చిత్రం కోసం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి హీరో తన దగ్గరకు వచ్చిన అన్ని కథల్ని ఓకే చేయలేరు. కొన్నిసార్లు కొన్ని కథల్ని రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. అలా వేరే హీరోల చేతుల్లోకి వెళ్లి బ్లాక్ బాస్టర్స్ అయిన చిత్రాలు చాలా ఉన్నాయి.
 

Related Articles

Related image1
నాకు పెళ్లి కాకుంటే ఆ హీరోతో డేటింగ్ చేసేదాన్ని, అనసూయ ఓపెన్ గా చెప్పేసింది.. ఇంతకీ ఆ స్టార్ ఎవరు ?
Related image2
RRR 2 చేస్తారా ? ఉపాసన ప్రశ్నకి స్పందించిన రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ అల్లరి వైరల్
35

రీసెంట్ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తాను మిస్ చేసుకున్న ఒక మంచి చిత్రం గురించి చెప్పారు. విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న ఆ చిత్రం 'ఒకే ఒక జీవితం'. శర్వానంద్, రీతూ వర్మ కలిసి నటించిన ఈ చిత్రం టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందింది. డెబ్యూ డైరెక్టర్ శ్రీకార్తీక్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ కమర్షియల్ గా పూర్తిస్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

45

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ శ్రీకార్తిక్ ముందుగా ఒకే ఒక జీవితం కథని నాకే చెప్పాడు. మూడుసార్లు ఆ కథని విన్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఎంతలా అంటే నేనే స్వయంగా ఆ చిత్రాన్ని నిర్మించి నటించాలని అనుకున్నా. కథ అద్భుతంగా ఉన్నప్పటికీ నా బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవుతుందా అనే డౌట్ వచ్చింది. అందుకే ఆ మూవీలో నటించలేకపోయానని విజయ్ దేవరకొండ తెలిపారు.

ఒకే ఒక జీవితం చిత్రంలో శర్వానంద్ హీరోగా నటించగా.. అక్కినేని అమల, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, నాజర్ కీలక పాత్రలో నటించారు. వీళ్ళందరి పర్ఫామెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. టైం ట్రావెల్ అంశాలు, మదర్ సెంటిమెంట్ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి.
 

55

అదేవిధంగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్ర విశేషాలను కూడా పంచుకున్నాడు. కింగ్డమ్ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందడం లేదని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. ఒకే కథని పూర్తిగా చెబుతున్నాం. కాబట్టి మరో భాగం అవసరం లేదు. ఇది యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువగా ఉంటుంది అని విజయ్ దేవరకొండ తెలిపారు. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. అనిరుద్ సంగీత దర్శకుడు. సితార ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
Recommended image2
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image3
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Related Stories
Recommended image1
నాకు పెళ్లి కాకుంటే ఆ హీరోతో డేటింగ్ చేసేదాన్ని, అనసూయ ఓపెన్ గా చెప్పేసింది.. ఇంతకీ ఆ స్టార్ ఎవరు ?
Recommended image2
RRR 2 చేస్తారా ? ఉపాసన ప్రశ్నకి స్పందించిన రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ అల్లరి వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved