MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Upasana: కవలలు పుట్టాక తొలిసారి ఉపాసన ఎమోషనల్ రియాక్షన్..చిరంజీవి మాటలు వినిపిస్తూ..

Upasana: కవలలు పుట్టాక తొలిసారి ఉపాసన ఎమోషనల్ రియాక్షన్..చిరంజీవి మాటలు వినిపిస్తూ..

Upasana Konidela: జనవరి 31న రాంచరణ్, ఉపాసన దంపతులు ఆడ, మగ కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. తనకు కవల పిల్లలు జన్మించిన తర్వాత ఉపాసన తాజాగా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆమె ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Feb 09 2026, 10:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కవలలకు తల్లిదండ్రులు అయిన ఉపాసన, చరణ్
Image Credit : X/Upasana

కవలలకు తల్లిదండ్రులు అయిన ఉపాసన, చరణ్

మెగా కోడలు ఉపాసన కొణిదెల ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చింది. జనవరి 31న రాంచరణ్, ఉపాసన దంపతులు ఆడ, మగ కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. రాంచరణ్ ఉపాసన దంపతులకు తొలి సంతానంగా క్లీంకార 2023లో జన్మించింది. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలిలో మరో ఇద్దరు మెంబర్స్ జాయిన్ అయ్యారు. 

25
ఉపాసన ఫస్ట్ రియాక్షన్
Image Credit : X/Upasana

ఉపాసన ఫస్ట్ రియాక్షన్

కవల పిల్లలు పుట్టాక ఉపాసన కొణిదెల తొలిసారి తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన డెలివరీ ప్రాసెస్.. అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పటి నుంచి కవలలు జన్మించి ఫ్యామిలీ, అభిమానులు సంబరాలు చేసుకునే వరకు జరిగిన పరిణామాలని ఆమె వీడియో రూపంలో పోస్ట్ చేశారు. 

Related Articles

Related image1
సినిమా కోసం ఏడాది వయసున్న తన కూతురితో వీడియో చేసిన చిరు.. ఎన్టీఆర్ తర్వాత నువ్వే, జోస్యం చెప్పిన డైరెక్టర్
Related image2
OTT Thrillers: జియో హాట్‌స్టార్ లో అస్సలు మిస్ కాకూడని టాప్ 3 థ్రిల్లర్స్..బుర్రని హీటెక్కించే ట్విస్టులు
35
ఎమోషనల్ వీడియో వైరల్
Image Credit : instagram/@alwaysramcharan

ఎమోషనల్ వీడియో వైరల్

ఈ వీడియోలో రాంచరణ్ తన సతీమణి ఉపాసనని అపోలో ఆసుపత్రికి తీసుకెళుతున్న దృశ్యాలు, ఉపాసన డెలివరీకి డాక్టర్స్ టీం చేస్తున్న ఏర్పాట్లు చూపించారు. అదే విధంగా ఉపాసన పర్సనల్ ఆధ్యాత్మిక గురువు, జ్యోతిష్యుడు మహేష్ బాంగ్ చెబుతున్న మాటలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. 

Every time I watch this, my heart feels full. I’m deeply grateful for the love, strength, and positivity that surrounds us. With folded hands 🙏, THANK YOU
My family is truly blessed.
Tejesvi Garu & the entire @HospitalsApollo team — your care & commitment meant everything to us.… pic.twitter.com/FKRtfBfMy9

— Upasana Konidela (@upasanakonidela) February 9, 2026

45
డాక్టర్స్ టీమ్ పనిచేసిన విధానం
Image Credit : X

డాక్టర్స్ టీమ్ పనిచేసిన విధానం

అదే విధంగా అపోలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కె సుబ్బారెడ్డి చెబుతున్న వివరాలు కూడా ఉన్నాయి. ఉపాసన సేఫ్ డెలివరీ కోసం అపోలో ఆసుపత్రిలో 2 డాక్టర్ల బృందాలు పనిచేసినట్లు ఆయన తెలిపారు. డాక్టర్ లతా మాట్లాడుతూ తప్పకుండా ఒత్తిడి ఫీల్ అయ్యా. ఎందుకంటే ఉపాసన సేఫ్ డెలివరీ కావడం, వారికి ఆరోగ్యకరమైన పిల్లలను అందించడం నా రెస్పాన్సిబిలిటీ అని తెలిపారు. 

55
చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా 
Image Credit : Instagram/Chiranjeevi

చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా 

 ఉపాసన కవలలకు జన్మనిచ్చిన తర్వాత చిరంజీవి మీడియా సమావేశం నిర్వహించి ఆ శుభవార్తని పంచుకున్న మాటలు చూపించారు. అదే విధంగా చిరంజీవి ఆల్ ఇండియా ఫాన్స్ ప్రెసిడెంట్ రవణం స్వామి నాయుడు తన సంతోషాన్ని తెలియజేస్తున్న మాటలు ఈ వీడియోలో ఉన్నాయి. ఉపాసన..స్పందిస్తూ  ఈ వీడియో చూసిన ప్రతి సారీ.. నా గుండె నిండిపోతోంది. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా. అపోలో ఆసుపత్రి టీం కి ప్రత్యేక కృతజ్ఞతలు. రాంచరణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఉపాసన ఎమోషనల్ పోస్ట్ చేశారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Surekha Vani కి రెండో పెళ్లి, కూతురు సుప్రీత ప్లాన్‌.. ఆఫర్స్ లేవంటూ ఆవేదన
Recommended image2
ఫస్ట్ టైమ్‌ డేట్‌కి వెళ్తున్నారా? ఈ 7 బెస్ట్ రొమాంటిక్ సినిమాలు చూడండి
Recommended image3
Sonam Kapoor Baby Shower: సోనమ్ కపూర్ సీమంతం వేడుక.. గెస్ట్ లు ఎవరెవరో తెలుసా, వైరల్ ఫోటోస్
Related Stories
Recommended image1
సినిమా కోసం ఏడాది వయసున్న తన కూతురితో వీడియో చేసిన చిరు.. ఎన్టీఆర్ తర్వాత నువ్వే, జోస్యం చెప్పిన డైరెక్టర్
Recommended image2
OTT Thrillers: జియో హాట్‌స్టార్ లో అస్సలు మిస్ కాకూడని టాప్ 3 థ్రిల్లర్స్..బుర్రని హీటెక్కించే ట్విస్టులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved