- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: వైరాకు దిమ్మతిరిగే షాక్-డబ్బుల బ్యాగులో ఇటుకలు-కార్తీక్‍కి జ్యో హగ్
Karthika Deepam 2 Today Episode: వైరాకు దిమ్మతిరిగే షాక్-డబ్బుల బ్యాగులో ఇటుకలు-కార్తీక్‍కి జ్యో హగ్
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 24వ తేదీ)లో వైరాను చంపడానికి గన్ తీసుకొచ్చిన శివన్నారాయణ. డబ్బుల బ్యాగులో ఇటుకలు చూసి షాక్ అయిన వైరా. కార్తీక్ ని హగ్ చేసుకున్న జ్యోత్స్న. కంటతడి పెట్టుకున్న శ్రీధర్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో ఆవేశంగా గన్ తీసుకొని వస్తాడు శివన్నారాయణ. ఎవరో డబ్బుల కోసం కిడ్నాప్ చేశారనుకున్నాను కానీ.. ఆ వైరా పగతో ఈ ఇంటి ఆడపిల్లను కిడ్నాప్ చేశాడంటే.. వాడి అంతు చూడాల్సిందే. ఈ శివన్నారాయణ అంటే ఏంటో వాడికి చూపించాల్సిందే అంటాడు శివన్నారాయణ. ఇప్పుడు ఎవ్వరికీ ఏం కాలేదు కదా తాత... వదిలెయ్. వాడ్ని చట్టప్రకారమే శిక్షించాలి అని తాత దగ్గర ఉన్న గన్ తీసుకుంటాడు కార్తీక్.
శ్రీధర్ కంగారు
మరోవైపు పారుకు ఫోన్ చేస్తాడు శ్రీధర్. ఎక్కడున్నారు అత్తయ్య అని అడిగితే ఇంటి దగ్గరే ఉన్నాను. జ్యోత్స్న కూడా వచ్చింది. నీ కొడుకు బుల్లెట్ కు ఎదురెళ్లి మరీ జ్యోత్స్నను కాపాడాడు అని చెప్తుంది పారు. కార్తీక్ కి ఏమైందని కంగారు పడతాడు శ్రీధర్. కార్తీక్ చేతికి బుల్లెట్ తగిలింది ఇప్పుడు బాగానే ఉన్నాడు అని చెప్పగానే.. ఫోన్ కట్ చేసి శివన్నారాయణ ఇంటికి బయల్దేరుతాడు శ్రీధర్.
జ్యోత్స్న డ్రామా
కాసేపటకి ఇంటికి చేరుకున్న శ్రీధర్.. కంగారుగా కార్తీక్ దగ్గరికి వచ్చి.. ఏమైందని అడుగుతాడు. నీకు బుల్లెట్ తగిలిందని అత్తయ్య చెప్పిందని చెప్తాడు. అందులో తన పాత్ర కూడా ఉందని మీ అత్తయ్య చెప్పలేదా అని అడుగుతాడు శివన్నారాయణ. నేనేం చేశానండీ అంటుంది పారు. మీరు వెళ్లకపోతే జ్యోత్స్నతోపాటు డబ్బు కూడా సేఫ్ గా ఇంటికి వచ్చేది.. పోనీలే డబ్బు పోతే పోయింది.. మీకు ఎవ్వరికీ ఏం కాలేదు, అది చాలు అంటాడు శివన్నారాయణ. డబ్బును వదులుకోవద్దనే వాడితో ఫైట్ చేశాను. అందుకే వాడు నన్ను చంపాలి అనుకున్నాడు. ఆ బుల్లెట్ బావకు తగిలిందని చెప్తుంది జ్యోత్స్న. బ్యాగులో డబ్బు ఉందంటావా పారు అని అడుగుతాడు కార్తీక్. ఓ లుక్ ఇస్తుంది పారు.
వైరాకు దిమ్మతిరిగే షాక్
మరోవైపు బ్యాగును చూసి మురిసిపోతుంటాడు వైరా. జ్యోత్స్నకు వాటా ఇవ్వకుండా, పోలీసులకు దొరక్కుండా భలే తప్పించుకున్నాము అని తన అసిస్టెంట్ తో చెప్తాడు. ముందు బ్యాగు ఓపెన్ చెయ్ బాస్. దెబ్బకు మన దరిద్రం పోవాలి అంటాడు అసిస్టింట్. బ్యాగు ఓపెన్ చేస్తే.. అందులో ఇటుక రాళ్లు ఉంటాయి. వాటిని చూసి షాక్ అవుతాడు వైరా. పెద్దగా నవ్వుతాడు అసిస్టెంట్. జ్యోత్స్న మళ్లీ నీకు వెన్నుపోటు పొడిచింది. కాదు కాదు గుండె పోటు పొడించింది అంటాడు అసిస్టెంట్. దాన్ని వదిలిపెట్టను అని ఆవేశంతో ఊగిపోతాడు వైరా. కార్తీక్ ఎంట్రీ ఇచ్చినప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని ఊహించాను అంటాడు అసిస్టెంట్.
డబ్బులు సేఫ్
మరోవైపు బ్యాగులో ఇటుక రాళ్లు పెట్టిన విషయాన్ని అందరితో చెప్తారు పారు, కార్తీక్. ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు. ఆ తర్వాత బయటకు వెళ్లి డబ్బులు పెట్టిన సంచిని ఇంట్లోకి తీసుకొస్తుంది పారు. ఫైట్ చేసే గ్యాపులో డబ్బులు మార్చేశామని చెప్తుంది.
కార్తీక్ కి జ్యో హగ్
కిడ్నాప్ చేసింది వైరా అని తెలిస్తే సీన్ మరోలా ఉండేది. అక్కడికి వెళ్లాకే నాకు ఆ విషయం తెలిసింది అంటాడు కార్తీక్. అయినా నువ్వు వైరాను ఎందుకు గుర్తు పట్టలేదు. కాల్ చేసినప్పుడు వాడి గురించి మాతో చెప్తే సరిపోయేది కదా అని జ్యోత్స్నతో అంటాడు కార్తీక్. చెప్తే చంపేస్తానన్నాడు బావ. అందుకే చెప్పలేదు అని కవర్ చేస్తుంది జ్యోత్స్న.
కిడ్నాప్ గురించి ఆరా తీస్తాడు కార్తీక్. జ్యోత్స్న తెలివిగా కార్తీక్ దగ్గరికి వచ్చి జరిగిందంతా ఒక పీడకల అనుకొని మర్చిపోదాం. నీ ప్రాణాలు అడ్డుపెట్టి నా ప్రాణాలు కాపాడావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. థ్యాంక్స్ బావ అంటూ కార్తీక్ ని హగ్ చేసుకొని, దీపకు సైగ చేస్తుంది జ్యోత్స్న. అంతా షాక్ అవుతారు. దీపకు మాత్రం పట్టరాని కోపం వస్తుంది. కార్తీక్, దీపలను మనం ఇంటికి వెళ్దాం పదా అని తీసుకెళ్తాడు శ్రీధర్.
కన్నీళ్లు పెట్టుకున్న శ్రీధర్
కార్తీక్ ని చూసి ఏడుస్తుంది కాంచన. జ్యోత్స్న కోసం నువ్వు ప్రాణాలు అడ్డుపెట్టడం ఏంటి? అసలు నిన్ను ఎవరు పంపించారు అని ఏడుస్తూ కార్తీక్ పై సీరియస్ అవుతుంది కాంచన. మన ఫ్యామిలీ కోసం మనం రిస్క్ చేయకపోతే ఎవరు చేస్తారు. అయినా నాకేం కాలేదు కదా అమ్మా వదిలెయ్ అంటాడు కార్తీక్. పారిజాతం అత్తయ్య ఫోన్ చేసి నీకు బుల్లెట్ తగిలిందని చెప్పగానే, ఇంటికి వచ్చి నిన్ను చూసేవరకు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు అని కంటతడి పెట్టుకుంటాడు శ్రీధర్.
ఇంకెప్పుడు ఇలా బాధపెట్టే పనులు చేయనని నాకు మాటివ్వమని కార్తీక్ తో ఒట్టు వేయించుకుంటాడు శ్రీధర్. రాయిలాంటి మనిషి కూడా కొడుకు కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఎంతైనా తండ్రి ప్రేమ తండ్రి ప్రేమే అని మనసులో అనుకుంటుంది కాంచన. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

