MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అఫీషియల్: సెన్సేషనల్ బ్యూటీని 'స్పిరిట్' హీరోయిన్ గా ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా

అఫీషియల్: సెన్సేషనల్ బ్యూటీని 'స్పిరిట్' హీరోయిన్ గా ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా

స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో స్పిరిట్ చిత్రంలో నటించబోయే హీరోయిన్ ని ప్రకటించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 24 2025, 07:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ
Image Credit : Asianet News

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ

గత కొన్ని రోజులుగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందబోయే స్పిరిట్ చిత్రం గురించి చాలా వార్తలు వచ్చాయి. ఈ మూవీ నుంచి బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనె తప్పుకోవడమే అందుకు కారణం. దీపికా ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో హీరోయిన్ విషయంలో రూమర్స్ మొదలయ్యాయి. ఎట్టకేలకు ఈ రూమర్స్ కి చెక్ పెట్టి స్పిరిట్ మూవీలో నటించే హీరోయిన్ ని అధికారికంగా ప్రకటించారు.

25
అఫీషియల్ 
Image Credit : our own

అఫీషియల్ 

స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో స్పిరిట్ చిత్రంలో నటించబోయే హీరోయిన్ ని ప్రకటించారు. ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా త్రిప్తి డిమ్రీని ఎంపిక చేసినట్టు ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.వంగా తన అధికారిక ఖాతాలో, “నా తదుపరి చిత్రంలో హీరోయిన్ గా నటించే నటి ఇక అధికారికం '' అంటూ సందీప్ రెడ్డి త్రిప్తి డిమ్రీ పేరు ప్రకటించారు. దీనితో ఒక్కసారిగా త్రిప్తి డిమ్రీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఆమెకి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. 

Related Articles

Related image1
హరిహర వీరమల్లు టార్గెట్ గా థియేటర్ల బంద్ ? తెలుగు ఫిలిం ఛాంబర్ రియాక్షన్ ఇదే
Related image2
బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ అసభ్యకర మార్ఫింగ్ వీడియో వైరల్, పోలీసులకు ఫిర్యాదు
35
దీపికాతో విభేదాలు 
Image Credit : Instagram

దీపికాతో విభేదాలు 

ఈ పాత్రకు తొలుత దీపికా పదుకొనేని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ, ఆమెకు దర్శకుడితో పారితోషికం, ఇతర కండిషన్స్ కి సంబంధించిన విషయాల్లో విభేదాలు తలెత్తాయి. దీనితో దీపికా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత శ్రద్ధా కపూర్, రుక్మిణి వసంత్ లాంటి హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. చివరికి త్రిప్తి డిమ్రీనే ఫైనల్ చేశారు.

45
త్రిప్తి డిమ్రీకి గోల్డెన్ ఛాన్స్ 
Image Credit : instagram

త్రిప్తి డిమ్రీకి గోల్డెన్ ఛాన్స్ 

త్రిప్తి డిమ్రీ గతంలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘యానిమల్’లో తన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆ చిత్రంలో ఆమె పాత్ర చిన్నదే అయినా, ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ‘స్పిరిట్’ చిత్రంలో ఆమె ప్రధాన కథానాయికగా ఎంపిక కావడం త్రిప్తి డిమ్రీ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.

55
భారీ అంచనాలు
Image Credit : Instagram/TriptiDimri

భారీ అంచనాలు

ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

‘స్పిరిట్’ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవబోతుందనే భావన అభిమానుల్లో నెలకొంది. సందీప్ రెడ్డి వంగా అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ క్రేజీ డైరెక్టర్ ప్రభాస్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi Movie: మహేష్‌, రాజమౌళి ఎంత కష్టపడ్డా అది సాధ్యం కాలేదు.. వారణాసిపై గ్లోబల్‌ హైప్‌ ఇచ్చిన ప్రియాంక భర్త
Recommended image2
Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
Recommended image3
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Related Stories
Recommended image1
హరిహర వీరమల్లు టార్గెట్ గా థియేటర్ల బంద్ ? తెలుగు ఫిలిం ఛాంబర్ రియాక్షన్ ఇదే
Recommended image2
బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ అసభ్యకర మార్ఫింగ్ వీడియో వైరల్, పోలీసులకు ఫిర్యాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved