MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 3700 కోట్ల నష్టం, టాలీవుడ్ కు చెమటలు పట్టించిన దొంగ, పక్కా ప్లాన్ తో పట్టుకున్న పోలీసులు

3700 కోట్ల నష్టం, టాలీవుడ్ కు చెమటలు పట్టించిన దొంగ, పక్కా ప్లాన్ తో పట్టుకున్న పోలీసులు

ఒకే ఒక్క వ్యక్తి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం తీసుకువచ్చాడు, నిర్మాతలకు చెమటలు పట్టించాడు. ఎట్టకేలకు ఆ వ్యక్తిని పక్కా ప్లాన్ తో పట్టుకున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి, ఏంటా కథ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 03 2025, 06:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit : social media

తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న అతి పెద్ద సమస్య పైరసీ. ఈ పైరసీ మాఫియా టాలీవుడ్ పెద్దలకు నిద్రలేకుండా చేస్తోంది. సినిమా కలెక్షన్స్ పై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. దాంతో ఈ సమస్యపై చాలా కాలంగా పోరాటం జరుగుతుంది. అయితే ఈ పైరసీ మాఫియాను నడిపిస్తున్న కీలక వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. 

సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా ప్లాన్ తో అతన్ని పట్టుకున్నారు. సినిమా విడుదల రోజునే ఫుల్ HD వర్షన్ లో సినిమాను పైరసీ చేసి ఆన్లైన్‌కి అప్‌లోడ్ చేస్తున్నాడు ఆ నిందితుడు. ఈ ఘటనలో తూర్పు గోదావరి జిల్లా కు చెందిన జన కిరణ్ కుమార్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

24
Image Credit : Asianet News

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా లాజ్ చేసిన ఫిర్యాదులో, 2024 సంవత్సరంలో తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ వల్ల 3700 కోట్ల మేర నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు చేపట్టిన దర్యాప్తులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జన కిరణ్‌ను అరెస్ట్ చేసి, పలు కీలక వివరాలను వెలుగులోకి తీసుకువచ్చారు.

జన కిరణ్ కుమార్ గత కొంత కాలంగా సినిమా విడుదలైన రోజే వాటి HD వర్షన్‌లను పైరసీ చేసి వివిధ వెబ్‌సైట్లకు అమ్ముతున్నాడని విచారణలో వెల్లడైంది. ఆయన ఇప్పటి వరకు దాదాపు 65 సినిమాలను పైరసీ చేసినట్టు పోలీసులు తెలిపారు. చిన్న సినిమాలను 32,000కి, పెద్ద సినిమాలను 80,000కి పైరసీ వెబ్‌సైట్లకు విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Related Articles

Related image1
మెగాస్టార్ చిరంజీవిని ఎండలో నిలబెట్టిన నిర్మాత, కారణం ఏంటో తెలుసా?
Related image2
రామాయణం ఫస్ట్ లుక్ పోస్టర్, రణబీర్, యష్ లుక్స్ ఎలా ఉన్నాయంటే
34
Image Credit : our own

ఈ నేపథ్యంలో జన కిరణ్‌పై 1957 కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు గత కొంతకాలంగా పైరసీ సమస్య ఎక్కువయ్యిందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

ముఖ్యంగా సంక్రాంతి 2024లో విడుదలైన "గేమ్ ఛేంజర్" నుంచి తాజాగా "కన్నప్ప" వరకు పలు భారీ సినిమాలు పైరసీ బారిన పడ్డాయి. థియేటర్‌లలో వీడియోలు రికార్డ్ చేసి నెట్‌లో అప్‌లోడ్ చేయడం, డార్క్ వెబ్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వేగంగా పంచడం వల్ల పైరసీ తలెత్తుతున్నట్టు అధికారులు తెలిపారు.

44
Image Credit : our own

ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆడియన్స్ కు కొన్ని సూచనలు చేశారు. పైరసీ చేసేవారిని, పైరసీ కంటెంట్‌ను చూసేవారిని కూడా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ కేసు ఆధారంగా ఇతర నిందితులను గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగుతున్నట్టు సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఈ అరెస్ట్‌ను స్వాగతించింది. పైరసీని కట్టడి చేయాలంటే ప్రభుత్వం, పోలీస్ శాఖ, సినీ సంస్థలు, ప్రేక్షకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. పైరసీ వల్ల కలుగుతున్న నష్టంతో చిన్న, మధ్య తరహా నిర్మాతలు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr Ntr: ఆగిపోయిన ఎన్టీఆర్‌ సినిమాని ఇండస్ట్రీ హిట్‌ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా? తారక్‌ కెరీర్‌నే మార్చేసిన మూవీ
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Recommended image3
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ డ్రైవర్ గా కాశీ- షాక్ నుంచి కోలుకోని జ్యో,పారు- దశరథ డౌట్
Related Stories
Recommended image1
మెగాస్టార్ చిరంజీవిని ఎండలో నిలబెట్టిన నిర్మాత, కారణం ఏంటో తెలుసా?
Recommended image2
రామాయణం ఫస్ట్ లుక్ పోస్టర్, రణబీర్, యష్ లుక్స్ ఎలా ఉన్నాయంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved