MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 46 ఏళ్లకే రోబో శంకర్ కన్నుమూత, ఇంతటి విషాదానికి కారణం ఏంటి..కొంప ముంచింది అదేనా

46 ఏళ్లకే రోబో శంకర్ కన్నుమూత, ఇంతటి విషాదానికి కారణం ఏంటి..కొంప ముంచింది అదేనా

నటుడు, కమెడియన్ రోబో శంకర్ 46 ఏళ్ల వయసులో చెన్నైలో కన్నుమూశారు. రోబో శంకర్ మరణవార్త విని అభిమానులు, సినీ ప్రముఖులు శోక సంద్రంలో మునిగిపోయారు. పిన్న వయసులోనే రోబో శంకర్ మృతికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 19 2025, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోబో శంకర్ కన్నుమూత
Image Credit : Asianet News

రోబో శంకర్ కన్నుమూత

తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, కమెడియన్‌గా గుర్తింపు పొందిన రోబో శంకర్ ఇక లేరు. చెన్నైలో గురువారం ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 46 సంవత్సరాలు.ఈ వారం ప్రారంభంలో రోబో శంకర్ అస్వస్థతకు గురయ్యారని, ఒక్కసారిగా మూర్చిపోయారని సమాచారం. అనంతరం ఆయనను చెన్నైలోని OMRలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

25
ఆరోగ్యం బాగా క్షీణించిన తర్వాత ఆసుపత్రికి
Image Credit : X

ఆరోగ్యం బాగా క్షీణించిన తర్వాత ఆసుపత్రికి

GEM హాస్పిటల్ సీఈఓ డాక్టర్ ఎస్. అశోకన్ ప్రకారం, “శంకర్ గారిని అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆయనకు తీవ్రమైన గ్యాస్ట్రోఇంటెస్టినల్ బ్లీడ్, కాంప్లెక్స్ అబ్డామినల్ కండీషన్ కారణంగా మల్టీ ఆర్గన్ డిస్‌ఫంక్షన్ వచ్చింది. మా మల్టీడిసిప్లినరీ టీమ్ అన్ని విధాలైన వైద్య సహాయం చేసినప్పటికీ, ఆయన పరిస్థితి వేగంగా దిగజారిపోయింది” అని వివరించారు.

Related Articles

Related image1
రూల్స్ బ్రేక్ చేశాడని భరణిని గెంటేసిన రీతూ, బాబోయ్ మామూలు ఫైర్ కాదు.. కొత్త కెప్టెన్ గా డిమాన్ పవన్
Related image2
రిలీజ్ కి ముందే 4 నిమిషాల సినిమా చూపించేసిన విజయ్ ఆంటోనీ.. మరో హిట్టు కొట్టేసినట్లేనా, ఇదిగో వీడియో
35
బుల్లితెరపై నటన ప్రారంభించిన రోబో శంకర్
Image Credit : X

బుల్లితెరపై నటన ప్రారంభించిన రోబో శంకర్

రోబో శంకర్ గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో కన్నుమూశారని వైద్యులు ధృవీకరించారు. రోబో శంకర్ కి భార్య, కుమార్తె ఉన్నారు. రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ శంకర్ కూడా నటిగా రాణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆయన అంత్యక్రియలు శుక్రవారం చెన్నైలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమ ప్రముఖులు, సహనటులు, అభిమానులు హాజరై చివరి వీడ్కోలు చెప్పనున్నారు.రోబో శంకర్ తన కెరీర్‌ను చిన్న తెరపై ప్రారంభించి, అనంతరం విజయవంతంగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తన ప్రత్యేకమైన కామిక్ టైమింగ్ తో, హాస్యభరిత పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.

45
రోబో శంకర్ మూవీస్
Image Credit : instagram

రోబో శంకర్ మూవీస్

అజిత్ నటించిన విశ్వాసం, విజయ్ నటించిన పులి, సూర్య నటించిన సింగం 3, విక్రమ్ నటించిన కోబ్రా వంటి అనేక చిత్రాలలో ఆయన మెరిశారు. అదనంగా, ఇధర్కుతానే ఆసైపట్టై బాలకుమార,  మారి, వెలైనూ వందుట్టా వెల్లైకారన్ వంటి సినిమాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.

55
కొంప ముంచింది ఆ అలవాటేనా 
Image Credit : instagram

కొంప ముంచింది ఆ అలవాటేనా 

ఒక ఇంటర్వ్యూలో ఆయన తన మద్యం సేవించే అలవాటు గురించి కూడా చెప్పుకొచ్చారు. అది తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని అంగీకరించారు.అధికంగా మద్యం సేవించడం వల్లే రోబో శంకర్ పిన్న వయసులోనే తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారని అభిమానులు భావిస్తున్నారు. రోబో శంకర్ ఎంతో ప్రతిభగల నటుడు అని అభిమానులు కొనియాడుతున్నారు. తమిళనాడులో సినీ రాజకీయ ప్రముఖులు రోబో శంకర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రోబో శంకర్ ఆకస్మిక మరణం తమిళ సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటు. ఆయన వినోదాత్మక నటన ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: రేపు జరగబోయేది ఈరోజే న్యూస్ పేపర్లో వస్తే.. ఊహకందని ట్విస్టులు బాబోయ్. ఈ వెబ్ సిరీస్ చూశారా.?
Recommended image2
కళ్యాణ్ పడాల తనూజ మధ్య మళ్లీ మొదలయ్యిందా..? ఏకంగా రింగు తొడిగిన బిగ్ బాస్ విన్నర్..
Recommended image3
3 ఏళ్లకంటే ఎక్కువ బ్రతకడన్న డాక్టర్లు, 30 ఏళ్లు హ్యాపీగా బ్రతికి చూపించిన ఏఎన్నార్.. ఎలా సాధ్యమయ్యింది?
Related Stories
Recommended image1
రూల్స్ బ్రేక్ చేశాడని భరణిని గెంటేసిన రీతూ, బాబోయ్ మామూలు ఫైర్ కాదు.. కొత్త కెప్టెన్ గా డిమాన్ పవన్
Recommended image2
రిలీజ్ కి ముందే 4 నిమిషాల సినిమా చూపించేసిన విజయ్ ఆంటోనీ.. మరో హిట్టు కొట్టేసినట్లేనా, ఇదిగో వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved