MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఏపీలో ఆ పని చేయాలంటూ పవన్ కళ్యాణ్ కి సుమన్ రిక్వస్ట్.. వెరీ గుడ్ థాట్ అంటున్న ఫ్యాన్స్

ఏపీలో ఆ పని చేయాలంటూ పవన్ కళ్యాణ్ కి సుమన్ రిక్వస్ట్.. వెరీ గుడ్ థాట్ అంటున్న ఫ్యాన్స్

సీనియర్ నటుడు సుమన్, ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ను పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్ ప్రవేశపెట్టాలని కోరారు. సుమన్, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ మార్షల్ ఆర్ట్స్ లో అనుభవం ఉంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 15 2025, 09:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మార్షల్ ఆర్ట్స్ లో అనుభవం 
Image Credit : Asianet News

మార్షల్ ఆర్ట్స్ లో అనుభవం 

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ హోల్డర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన తన అనుభవాన్ని గతంలో అనేక సినిమాలలో ప్రదర్శించారు. రాబోయే గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా OGలో కూడా తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని అభిమానులకు చూపించనున్నారు.

25
డిప్యూటీ సీఎంకి సుమన్ రిక్వస్ట్ 
Image Credit : Asianet News

డిప్యూటీ సీఎంకి సుమన్ రిక్వస్ట్ 

ఇలాంటి సమయంలో, ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు సుమన్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. సుమన్ కూడా కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్. పాడేరులో నిర్వహించిన ఒక కరాటే శిక్షణా అకాడమీ ఈవెంట్‌లో పాల్గొన్న సుమన్ మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణుడు. ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్‌ను ప్రవేశ పెడితే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం అవుతుంది. నేను కూడా రాష్ట్రంలో ఏమీ ఆశించకుండా మార్షల్ ఆర్ట్స్ ప్రాచుర్యానికి చేయగలిగినంత చేస్తాను,” అని పేర్కొన్నారు.

Related Articles

Related image1
OTT Releases : ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు..థ్రిల్లర్ స్టోరీతో కాజోల్ రెడీ
Related image2
ఎన్టీఆర్ ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా ? పెళ్ళికి రెడీ అయిన టైంలో పారిపోయింది
35
గిరిజన ప్రాంతాల్లో మార్షల్ ఆర్ట్స్
Image Credit : instagram

గిరిజన ప్రాంతాల్లో మార్షల్ ఆర్ట్స్

 ఈ సందర్భంగా సుమన్, గిరిజన విద్యార్థులకు కరాటే, జూడో వంటి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇవ్వడానికి చేస్తున్న కృషిని అభినందించారు. ఇటువంటి ప్రయత్నాలు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి తోడ్పడతాయని చెప్పారు.

45
సినిమాల్లో నటిస్తూనే సామాజిక కార్యక్రమాలు
Image Credit : Facebook/Suman Talwar Hero

సినిమాల్లో నటిస్తూనే సామాజిక కార్యక్రమాలు

సుమన్ నటుడిగా తన కెరీర్‌లో విభిన్న పాత్రల్లో కనిపించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయనను చివరిసారిగా ప్రేక్షకులు 2023లో విడుదలైన నితిన్ నటించిన “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాన్” సినిమాలో చూశారు. ప్రస్తుతం సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా చురుకుగా స్పందిస్తూ ఉంటున్నారు.

55
మంచి ఆలోచన అంటున్న ఫ్యాన్స్
Image Credit : our own

మంచి ఆలోచన అంటున్న ఫ్యాన్స్

 మొత్తం మీద, సీనియర్ నటుడు సుమన్ పవన్ కళ్యాణ్ కు  చేసిన ఈ విజ్ఞప్తి, రాజకీయ సినీ వర్గాల్లో కొత్త చర్చలకు దారితీసే అవకాశం ఉంది. ఏపీ పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్ పాఠ్యాంశంగా చేరితే విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. సుమన్ చాలా మంది ఆలోచనని పవన్ కళ్యాణ్ ముందు ఉంచారని అభిమానులు అంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
OTT Releases : ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు..థ్రిల్లర్ స్టోరీతో కాజోల్ రెడీ
Recommended image2
ఎన్టీఆర్ ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా ? పెళ్ళికి రెడీ అయిన టైంలో పారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved