MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 6 కోట్ల బడ్జెట్, 100 కోట్లు వసూలు చేసి, ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన చిన్న సినిమా ఏదో తెలుసా?

6 కోట్ల బడ్జెట్, 100 కోట్లు వసూలు చేసి, ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన చిన్న సినిమా ఏదో తెలుసా?

2025లో చాలా హిట్ సినిమాలు వచ్చినా,  ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమా మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచింది. 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఓ చిన్న సినిమా 100 కోట్లు వసూలు చేసి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏంటా సినిమా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 21 2025, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit : youtube

6 కోట్ల బడ్జెట్ తో 100 కోట్లు వసూలు చేసిన సినిమా

పెద్ద పెద్ద స్టార్ హీరోలు,  వందల కోట్లతో నిర్మించిన భారీ బడ్జెట్  సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యే ఈ రోజుల్లో, కేవలం ఆరు కోట్లతో నిర్మించిన `సు ఫ్రమ్ సో` సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా తొలి వారంలోనే లాభాల బాట పట్టింది. 100 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే షాక్ ఇచ్చింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటింది. 

24
Image Credit : @rajbshetty/ Instagram

రజినీకాంత్ కు ఎదురు నిలిచిన సినిమా 

రాజ్ బి. శెట్టి బృందం నిర్మించిన ఈ సినిమాకు జె.పి. తుమినాడు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే వసూళ్ల వర్షం కురిపిస్తోంది.  ఫ్రమ్ సో ఒక పట్టణంలో జరిగే కథ. ఒక ఇంట్లో తలెత్తే సమస్యను ఆ ఊరు  ఎలా ఫేస్ చేసింది అనేది కథ. విడుదలైన మొదటి రోజు నుండి అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంటున్న సు ఫ్రమ్ సో చిత్రాన్ని అభిమానులు స్వయంగా ప్రమోట్ చేస్తున్నారు. అందుకే ప్రమోషన్స్ లేకపోయినా.. థియేటర్ల కు క్యూ కడుతున్నారు ఆడియన్స్.  జూలై 25న విడుదలైన ఈ సినిమా కర్ణాటకలో సూపర్ స్టార్ రజినీకాంత్  కూలీ సినిమాకు పోటీ ఇస్తోంది.

Related Articles

Related image1
బాహుబలిలో అనుష్క డూప్ గా నటించిన మరో హీరోయిన్ ఎవరో తెలుసా?
Related image2
ఎన్టీఆర్ సినిమా చూడాలని ఇండియాకు, ఈ మహిళా అభిమానిది ఏ దేశమో తెలుసా?
34
Image Credit : Su From So

 తెలుగు, మలయాళంలో కూడా

సు ఫ్రమ్ సో చిత్రంలో అశోక్ పాత్ర పోషించిన జె.పి. దుమినాడు ఈ చిత్రానికి దర్శకుడు. ఒక ఇంటర్వ్యూలో, దుమినాడు మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో అద్భుతమైన సినిమా తీయడం రాజ్ బి. శెట్టికి తెలుసని  అన్నారు. ఈ సినిమాలో జె.పి. తుమినాడు, రాజ్ బి. శెట్టి, శనీల్ గౌతమ్ తదితరులు నటించారు. కన్నడలో మాత్రమే కాదు తెలుగు, మలయాళంలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. మలయాళంలో ఈసినిమాను యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కు సబందించిన వేఫేరర్ సంస్థ మలయాళ హక్కులను సొంతం చేసుకొని ఆగస్ట్ 1న కేరళలో విడుదల చేసింది. అక్కడ కూడా సినిమా మంచి స్పందన సాధించింది.

44
Image Credit : Social Media

కన్నడలో సంచలనంగా మారిన సినిమా 

కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన సు ఫ్రమ్ సో చిత్రం రూ.100 కోట్ల కలెక్షన్లతో  సరికొత్త రికార్డును సృష్టించింది. 100 కోట్ల బడ్జెట్‌తో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా కూడా సు ఫ్రమ్ సో రికార్డు సృష్టించింది. ఈ మూవీ ప్రస్తుతం 120 కోట్ల  కలెక్షన్ మార్క్ కు దగ్గరగా దూసుకుపోతోంది. ఇప్పటికీ కన్నడనాట థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది.  సు ఫ్రామ్ సో చిత్రం నుండి నిర్మాతలు భారీ లాభాలను ఆర్జించారు. తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ మాదిరిగానే, సు ఫ్రమ్ సో కన్నడలో భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. మరి ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ రావాల్సి ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
బాహుబలిలో అనుష్క డూప్ గా నటించిన మరో హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
ఎన్టీఆర్ సినిమా చూడాలని ఇండియాకు, ఈ మహిళా అభిమానిది ఏ దేశమో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved