MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sobhita Dhulipala: ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్న శోభిత.. నేటి హీరోయిన్లకు రోల్ మోడల్

Sobhita Dhulipala: ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్న శోభిత.. నేటి హీరోయిన్లకు రోల్ మోడల్

Sobhita Dhulipala: నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత శోభిత ధూళిపాల విలువ పెరిగిపోయింది. ఆమె సినిమాల ద్వారా కాకుండా బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా భారీగా సంపాదిస్తోంది. శోభితా ఏడాదికి కేవలం బ్రాండ్ ప్రమోషన్ల ద్వారానే కోట్లలో సంపాదిస్తున్నట్టు సమాచారం. 

2 Min read
Author : Haritha Chappa
| Updated : Apr 15 2026, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శోభిత ధూళిపాల బ్రాండ్ ప్రమోషన్లు
Image Credit : Sobhitad/Instagram

శోభిత ధూళిపాల బ్రాండ్ ప్రమోషన్లు

నాగచైతన్యకు భార్యగా మారిన తర్వాత శోభిత ధూళిపాలకు సినీ రంగంలోనే కాదు.. మోడల్ రంగంలో కూడా మరింత విలువ పెరిగింది. ప్రస్తుతం సినీ రంగంలో ఉన్న హీరోయిన్లు సినిమాలకే పరిమితం కావడం లేదు.. బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. ఆ జాబితాలో శోభితా ధూళిపాల ముందు స్థానంలో ఉంటుంది. ఆమె ఒక క్లాసీ స్టైల్ తో, గ్లోబల్ లుక్ తో కనిపిస్తుంది. అందుకే పెద్ద పెద్ద బ్రాండ్లకు ప్రమోషన్ చేసే అవకాశాన్ని దక్కించుకుంటుంది. కేవలం బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శోభితకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయమంటూ ఆమెను కోరుతున్నారు.

24
ఒక్కో బ్రాండ్‌తో ఎంత సంపాదన?
Image Credit : Sobhitad/instagam

ఒక్కో బ్రాండ్‌తో ఎంత సంపాదన?

తెలిసిన సమాచారం ప్రకారం శోభిత ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ చేసేందుకు 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు తీసుకుంటుందని సమాచారం. ఒక యాడ్ షూట్ లేదా ఫోటోషూట్ కోసం కొన్ని రోజులు కేటాయిస్తారు. ఇక సోషల్ మీడియాలో ప్రమోషన్లు కూడా చేస్తారు. ఒక ఏడాదికి ఆ బ్రాండ్ డీల్ కోసం ఒప్పందం జరుగుతుంది. ఆమె క్రేజీ బ్రాండ్ విలువ సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి రెమ్యూనరేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. శోభిత ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ బ్రాండ్లను ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది.

Related Articles

Related image1
Masala Dosa: బ్రేక్‌ఫాస్ట్‌కు మసాలా దోశె మంచిది కాదా? తినడం వల్ల ఏం లాభం లేదా? కారణాలు ఇవే
Related image2
Astrology Forecast: శుక్రుడి వల్ల ఈ 5 రాశుల వారికి ఉద్యోగంలో సక్సెస్, రెట్టింపు ఆదాయం
34
ఏడాదికి ఎంత సంపాదన?
Image Credit : Sobhitad/instargam

ఏడాదికి ఎంత సంపాదన?

ఒక్కో బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు తీసుకుంటుందని టాక్. అలా ఇప్పుడు శోభిత చేతిలో 5 నుంచి 8 వరకు ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. వీటి ద్వారా ఆమె ఏడాదికి ఎంత లేదన్నా.. 10 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తుందని సమాచారం. ఇది సినిమా ఆదాయంతో పోలిస్తే తక్కువేమీ కాదు. ఒక్కోసారి బ్రాండ్ డీల్స్ ద్వారా వచ్చే ఆదాయం సినిమాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా తన జీవితాన్ని, కెరీర ను అందంగా, తనకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకుంటోంది శోభిత.  సొంత కాళ్లపై నిలబడే విషయంలో ఇప్పటి తరం అమ్మాయిలకు శోభిత ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పొచ్చు

44
ఒక్కో సినిమాకు ఎంత ఛార్జ్?
Image Credit : Sobhitad/Instagram

ఒక్కో సినిమాకు ఎంత ఛార్జ్?

ఇక శోభిత చేస్తున్న సినిమాల విషయానికొస్తే ఒక సినిమా చేయడానికి కోటిన్నర నుంచి రెండున్నర కోట్ల రూపాయల వరకు తీసుకుంటుందని సమాచారం. సినిమా పూర్తి అవడానికి రెండు మూడు నెలల సమయం పడుతుంది. అందుకే శోభిత సినిమాలకన్నా బ్రాండ్ ప్రమోషన్లకే ఎక్కువ విలువను ఇస్తోంది. తన కెరీర్ ను తెలివిగా ముందుకు తీసుకెళ్తూ ఈ తరం హీరోయిన్లకు రోల్ మోడల్ గా నిలుస్తోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
నాగ చైతన్య
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మహేష్, పవన్, రాంచరణ్ అస్సలు మరచిపోలేని హీరోయిన్లు వీళ్ళే.. పెళ్లయ్యాక అడ్రెస్ లేకుండా పోయారు
Recommended image2
సెలబ్రిటీ బాడీగార్డ్‌ల జీతం కోట్లలో ఉంటుందా? షారుఖ్ ఖాన్ మాజీ బాడీగార్డ్ చెప్పిన అసలు నిజం..
Recommended image3
Jr NTR Transformation: 7 వారాల్లో 9.5 కిలోలు మాయం, కండలు తిరిగిన తారక్ బాడీ సీక్రెట్ ఇదే
Related Stories
Recommended image1
Masala Dosa: బ్రేక్‌ఫాస్ట్‌కు మసాలా దోశె మంచిది కాదా? తినడం వల్ల ఏం లాభం లేదా? కారణాలు ఇవే
Recommended image2
Astrology Forecast: శుక్రుడి వల్ల ఈ 5 రాశుల వారికి ఉద్యోగంలో సక్సెస్, రెట్టింపు ఆదాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved