MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బీబీ హౌస్ లోకి జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్ శ్రష్ఠి వర్మ.. ఇక రణరంగమే..

బీబీ హౌస్ లోకి జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్ శ్రష్ఠి వర్మ.. ఇక రణరంగమే..

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఎంట్రీలతో సందడి చేస్తోంది. ఈ సీజన్‌లో ఐదవ కంటెస్టెంట్‌గా ఫేమస్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్‌లోకి అడుగుపెట్టారు.   

2 Min read
Author : Rajesh K
Published : Sep 07 2025, 09:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డబుల్ హౌస్ – డబుల్ డోస్
Image Credit : Starmaa

డబుల్ హౌస్ – డబుల్ డోస్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. హోస్ట్ కింగ్ నాగార్జున స్టైల్, ఎనర్జీతో షోలో ఎంట్రీ ఇస్తూ మొదటి ఎపిసోడ్‌కు హంగులు జోడించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు ఆడియన్స్‌లో ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశాయి. వాటికి తగ్గట్టుగానే షో మొదటి ఎపిసోడ్ కూడా కలర్‌ఫుల్‌గా సాగింది. 

ఈసారి బిగ్ బాస్ "డబుల్ హౌస్ – డబుల్ డోస్" అనే కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు వేర్వేరు హౌస్‌లు ఉండటంతో కంటెస్టెంట్స్ మధ్య కంపిటీషన్, డ్రామా, కాంట్రవర్సీస్ మరింత ఎంటర్టైనింగ్‌గా ఉండబోతున్నాయని మేకర్స్ హింట్ ఇచ్చారు.

24
కొరియోగ్రాఫర్ శ్రష్టి ఎంట్రీ
Image Credit : instagram/shrasti verma

కొరియోగ్రాఫర్ శ్రష్టి ఎంట్రీ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఎంట్రీలతో సందడి చేస్తోంది. ఈ సీజన్‌లో ఐదవ కంటెస్టెంట్‌గా ఫేమస్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఎంట్రీకి ముందే స్టేజ్‌పై అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు శ్రష్టి వర్మ మాట్లాడుతూ, " ప్లుట్ జింకా ముందు ఊదు.. శ్రేష్టి వర్మ ముందు కాదు ’ అంటూ వచ్చి రాగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ హౌస్‌లో మనలోని అసలైన రియాలిటీ బయటపడుతుంది. ‘నన్ను నేను నిరూపించుకునే వేదిక ఇది" అని ఎమోషనల్‌గా చెప్పారు.

Related Articles

Related image1
Bigg Boss Telugu 9: తండ్రిని ఎదిరించి ఇండస్ట్రీకి, బిగ్ బాస్ ఫస్ట్ కంటెస్టెంట్ గా ముద్ద మందారం హీరోయిన్ ?
Related image2
ఆర్మీ నుంచి బిగ్ బాస్ వరకు.. ఫస్ట్ కామనర్ గా సోల్జర్ పవన్ కల్యాణ్
34
శ్రష్టి కెరీర్ జర్నీ
Image Credit : https://www.instagram.com/p/DOTgbiwkr58/

శ్రష్టి కెరీర్ జర్నీ

శ్రష్టి వర్మ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. "మనమే" మూవీలో శర్వానంద్‌కి, అలాగే రీసెంట్‌గా "పుష్ప 2" పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ఢీ డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా పరిచయం పొందిన ఆమె, జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించారు. తన ఎనర్జీ, డ్యాన్స్ మూవ్స్‌తో చిన్నకాలంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

44
వివాదాల్లోనూ నిలిచిన శ్రష్టి
Image Credit : https://www.instagram.com/p/DOTgbiwkr58/

వివాదాల్లోనూ నిలిచిన శ్రష్టి

కొద్ది కాలం క్రితం శ్రష్టి వర్మ తనకు లైంగిక వేధింపులు చేశారంటూ జానీ మాస్టర్‌పై కేసు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ విషయంతో సోషల్ మీడియాలో, టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యారు. ఈ కారణంగా ఆమె పేరు మరింతగా హైలైట్ అయింది. డ్యాన్స్‌లో ఎనర్జీ, రియల్ లైఫ్‌లో బోల్డ్ అటిట్యూడ్ కలిగిన శ్రష్టి వర్మ బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ఆడుతారు? ఇతర కంటెస్టెంట్స్‌తో ఎలా కలిసిపోతారు? అనేది ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా, ఆమె బోల్డ్ నేచర్ బిగ్ బాస్ 9లో ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొత్త కలర్ ఇస్తుందని భావిస్తున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
దళపతి విజయ్ కీలక నిర్ణయం, జన నాయగన్ టీమ్ బ్యాక్ స్టెప్, సెన్సార్ బోర్డ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?
Recommended image2
రామ్ చరణ్ కోసం మలయాళ హీరోయిన్ ను సెట్ చేస్తోన్న సుకుమార్, నిజమెంత..?
Recommended image3
Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 9: తండ్రిని ఎదిరించి ఇండస్ట్రీకి, బిగ్ బాస్ ఫస్ట్ కంటెస్టెంట్ గా ముద్ద మందారం హీరోయిన్ ?
Recommended image2
ఆర్మీ నుంచి బిగ్ బాస్ వరకు.. ఫస్ట్ కామనర్ గా సోల్జర్ పవన్ కల్యాణ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved