- Home
- Entertainment
- 15 వేల కోట్లు కోల్పోతున్న `దేవర` స్టార్.. ఎన్టీఆర్ విలన్ చేస్తున్న పోరాటం ఫలించేనా?
15 వేల కోట్లు కోల్పోతున్న `దేవర` స్టార్.. ఎన్టీఆర్ విలన్ చేస్తున్న పోరాటం ఫలించేనా?
ఎన్టీఆర్ విలన్ చాలా బాధలో ఉన్నాడు. ఆయన సుమారు రూ.15వేల కోట్లు కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు. దాని కోసం ఆయన చివరి వరకు పోరాడుతున్నారు.

వారసత్వ ఆస్తులను కోల్పోతున్న ఎన్టీఆర్ విలన్
ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యధిక ఆస్తులున్న హీరోలు కొందరే ఉంటారు. కొందరు బాలీవుడ్‌లో ఉంటే, మరికొందరు టాలీవుడ్‌లో ఉన్నారు.
వీరిలో చాలా వరకు స్వయంగా భారీగా ఆస్తులు సంపాదించిన వారైతే, మరికొందరు వారసత్వంగా పొందిన వారు కూడా ఉండటం విశేషం.
ఎన్టీఆర్ కి విలన్‌గా నటించి అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు సుమారు రూ.15వేల కోట్లు పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. అసలు ఏం జరిగిందనేది చూస్తే.
పటౌడీ ఫ్యామిలీ వారసుడు సైఫ్ అలీ ఖాన్‌కి వేల కోట్ల ఆస్తులు
బాలీవుడ్ స్టార్ హీరో, ఎన్టీఆర్ హీరోగా నటించిన `దేవర`లో విలన్‌గా నటించిన సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్‌లో అత్యంత కోటీశ్వరుడు. మిగిలిన స్టార్ హీరోలందరితో పోల్చితే ఆయన వద్ద ఎక్కువ ఆస్తులున్నాయి.
వారిది పటౌడీ ఫ్యామిలీ. ఒకప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్‌లు. పైగా నవాబ్‌ల వంశం. వారి వారసత్వంగా భారీగా ఆస్తులు సైఫ్‌కి వచ్చాయి.
కొన్ని వేల కోట్లకు ఇప్పుడు సైఫ్ అధిపతి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వేల కోట్ల ఆస్తులున్నాయి, కానీ ఏది ఎక్కడుందో కూడా సైఫ్‌కి తెలియని పరిస్థితి.
15వేల కోట్ల ఆస్తిని కోల్పోతున్న సైఫ్ అలీ ఖాన్
ఇదిలా ఉంటే ఇప్పుడు సైఫ్ భారీగా ఆస్తులను కోల్పోతున్నారు. సుమారు రూ. 15వేల కోట్ల ప్రాపర్టీని ఆయన మిస్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోబోతుందట.
మధ్య ప్రదేశ్‌లో వారి పూర్వీకులకు చెందిన ప్రాపర్టీ ఉంది. దాని విలువల ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.15వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఆ ఆస్తిని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటించింది.
సైఫ్ పూర్వీకుల ఆస్తిని ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటించిన మధ్య ప్రదేశ్ ప్రభుత్వం
దీన్ని వ్యతిరేకిస్తూ సైఫ్ అలీ ఖాన్ హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. తమ ప్రాపర్టీగా ఆయన చెబుతున్నారు, కానీ ఈ పిటిషన్‌ని హైకోర్ట్ కొట్టేసింది.
అక్కడ ఉన్నది ఎనిమీ ప్రాపర్టీనే అని, దీనిపై మరోసారి పూర్తిగా విచారణ జరిపించాలని, అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్ట్ ఆదేశించింది.
దీంతో ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన నిర్ణయం ప్రభుత్వం చేతిలో ఉంది. వారి నిర్ణయం ప్రకారం దీన్ని ఎనిమీ ప్రాపర్టీగానే ప్రకటించే అవకాశం ఉంది.
ఇదే జరిగితే ఈ ఆస్తిని సైఫ్ కోల్పోవల్సి వస్తుంది. ఇక దేశ విభజన సమయంలో సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులు కొందరు పాకిస్తాన్ వెళ్లిపోయారు. వారికి సరైన వారసులు లేరని, దీంతో ఆ ఆస్తిని ఎనిమీ ప్రాపర్టీగా ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.
`దేవర`లో విలన్‌గా అదరగొట్టిన సైఫ్
ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణించిన సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకుంటున్నారు. నెగటివ్ రోల్స్ కూడా చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు.
`తానాజీ`, `ఆదిపురుష్`, `దేవర` చిత్రాల్లో నెగటివ్ రోల్స్ చేశారు. ఇప్పుడు `దేవర 2`లోనూ నటించబోతున్నారు. సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌కి భర్త అనే విషయం తెలిసిందే.