MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Roja LoveStory: `సమరం` చేశాక నా జీవితం సమరంలా మారిపోయింది.. అదిరిపోయే లవ్ స్టోరీ బయటపెట్టిన రోజా

Roja LoveStory: `సమరం` చేశాక నా జీవితం సమరంలా మారిపోయింది.. అదిరిపోయే లవ్ స్టోరీ బయటపెట్టిన రోజా

Roja: మాజీ మంత్రి రోజా తన ప్రేమ కథని వెల్లడించింది. సెల్వమణి చేసిన పనిని బయటపెట్టింది. సమరం సినిమా చేస్తే, తన లైఫ్‌ సమరంలా మారిపోయిందని వాపోయింది.  ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 22 2026, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన రోజా
Image Credit : facebook.com/rojaselvamanirk

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన రోజా

మాజీ మంత్రి రోజా ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా అలరించిన విషయం తెలిసిందే. తిరుగులేని స్టార్‌డమ్‌తో రాణించింది. సౌత్‌ సినిమాని ఓ ఊపు ఊపేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యింది.  రాజకీయాల్లోకి వచ్చింది. మొదట టీడీపీలో జాయిన్‌ అయిన ఆమె ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. ఒకసారి మంత్రిగా పనిచేసింది. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇప్పుడు మళ్లీ టీవీ షోస్‌ చేస్తుంది. గతంలో జబర్దస్త్ కామెడీ షోతో మరింతగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోజా తన లవ్‌ స్టోరీని వెల్లడించింది. సమరం తన జీవితాన్ని సమరంలా మార్చిందని తెలిపింది.

25
ఆర్కే సెల్వమణితో రోజా లవ్‌ స్టోరీ
Image Credit : our own

ఆర్కే సెల్వమణితో రోజా లవ్‌ స్టోరీ

రోజా దర్శకుడు ఆర్కే సెల్వమణిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కూతురు అన్షు మాలిక, కొడుకు కృష్ణ కౌశిక్‌ ఉన్నారు. రోజా 1991లో సినిమాలోకి వచ్చింది. తన మొదటి సినిమా, మొదటి రోజు షూటింగ్‌లోనే తనని చూసి సెల్వమణి పడిపోయాడట. అప్పుడు తనది చిన్న ఏజ్‌ అని, ఆ లవ్వూ గురించి తెలియదని వెల్లడించింది.సెల్వమణికి తాను, తన కుటుంబం బాగా నచ్చిందట. తమ ఫ్యామిలీ బాండింగ్‌  నచ్చిందట. ఆ తర్వాత కొన్నిరోజులకు ఆయన డైరెక్ట్ గా వచ్చి తన పేరెంట్స్ తో మాట్లాడాడట. తనకు కూడా ఆ విషయం చెప్పకుండా తమపేరెంట్స్ వద్దకు వెళ్లి.. ` మీ అమ్మాయి నాకు నచ్చింది. `నేను ఆమె వెనకబడి, ప్రేమించి, ఆ తర్వాత మీరు నో అంటే బాధపడి, గెడ్డం పెంచుకోవడం ఇష్టం లేదు. నాకు మీ అమ్మాయి నచ్చింది. మీకు నేను నచ్చితే పెళ్లి చేసుకుంటాన`ని చెప్పాడట సెల్వమణి.

Related Articles

Related image1
Anchor Suma Remuneration: యాంకర్‌ సుమ ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే మతిపోవాల్సిందే.. స్టార్‌ హీరోల రేంజ్‌
Related image2
Divvala Madhuri ఇచ్చిన సర్‌ప్రైజ్‌లు బయటపెట్టిన దువ్వాడ శ్రీనివాస్‌.. ఆ విషయంలో స్వీట్‌ వార్నింగ్‌
35
11ఏళ్లు ప్రేమలోనే
Image Credit : Asianet News

11ఏళ్లు ప్రేమలోనే

సెల్వమణి చెప్పిన విధానం నచ్చిందట. దీంతో తన మొదటి సినిమా సమయంలోనే(1991)లోనే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారట. నిజానికి తన మొదటి సినిమా విడుదల రోజే పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ అప్పుడే పేరెంట్స్ నుంచి దూరమైతే బాగోదు, వారికి కొంత అండగా ఉండాలని, అన్నయ్యలను సెటిల్‌ చేయాలని చెప్పి కొన్నాళ్లు వెయిట్‌ చేశారట. అలా 11ఏళ్ల తర్వాత 2002లో మ్యారేజ్‌ చేసుకున్నారట. దాదాపు 11ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని తెలిపింది రోజా.

45
రోజా లైఫ్‌ని సమరంలా మార్చిన సమరం మూవీ
Image Credit : facebook.com/rojaselvamanirk

రోజా లైఫ్‌ని సమరంలా మార్చిన సమరం మూవీ

`అమ్మ రిటైర్‌ మెంట్‌ తీసుకుంది, అన్నయ్యలు తనతో ఉండిపోయారు, వాళ్లకోసం ఒక సినిమా చేద్దాం, ఆ తర్వాత మ్యారేజ్‌ చేసుకుందామనుకున్నాం. దీంతో `సమరం` అనే సినిమాని స్టార్ట్ చేశాం. ఆ టైటిల్‌ వాళ్లో, ఏంటో గానీ, ఆ తర్వాత  నా జీవితమే సమరంలా మారిపోయింద`ని తెలిపింది రోజా. ఆ సమయంలోనే యాక్సిడెంట్‌ అయ్యిందని, తలకు గాయమైందని, కాళ్లకి గాయాలయ్యాయని, సినిమా డిలే అయ్యిందని, దీంతో బాగా అప్పులు అయ్యాయని చెప్పింది. అన్నీ క్లీయర్‌ చేసుకుని, సెటిల్‌ కావడానికి పదేళ్లు పట్టిందని, దీంతో 2002లో మ్యారేజ్‌ చేసుకున్నామని తెలిపింది రోజా. మొత్తంగా సమరం సినిమా తన లైఫ్‌ని సమరంగా మార్చేసిందని వెల్లడించింది రోజా.

55
ప్రేమ తపస్సుతో హీరోయిన్‌గా పరిచయమైన రోజా
Image Credit : our own

ప్రేమ తపస్సుతో హీరోయిన్‌గా పరిచయమైన రోజా

రోజా 1991లో `ప్రేమ తపస్సు` అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఇందులో రాజేంద్రప్రసాద్‌తో కలిసి నటించింది. తొలిచిత్రంతోనే ఆకట్టుకుంది రోజా. ఆ తర్వాత `సర్పయాగం`లో మెరిసింది. తమిళంలో `చెంబరుతి` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. దీనికి ఆర్కే సెల్వమణి దర్శకుడు. ఆ తర్వాత అటు తమిళంలో, ఇటు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది రోజా. చిరంజీవితోపాటు అందరు టాప్‌ హీరోలతో కలిసి నటించి మెప్పించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi అని కూడా చూడకుండా మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసిన ఐదుగురు హీరోయిన్లు, ఆమెది కరెక్ట్ డెసిషన్
Recommended image2
Divvala Madhuri ఇచ్చిన సర్‌ప్రైజ్‌లు బయటపెట్టిన దువ్వాడ శ్రీనివాస్‌.. ఆ విషయంలో స్వీట్‌ వార్నింగ్‌
Recommended image3
Upcoming Movies: 7 సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చేశాయ్.. బాలీవుడ్, సౌత్ సినిమాల జాతర
Related Stories
Recommended image1
Anchor Suma Remuneration: యాంకర్‌ సుమ ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే మతిపోవాల్సిందే.. స్టార్‌ హీరోల రేంజ్‌
Recommended image2
Divvala Madhuri ఇచ్చిన సర్‌ప్రైజ్‌లు బయటపెట్టిన దువ్వాడ శ్రీనివాస్‌.. ఆ విషయంలో స్వీట్‌ వార్నింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved