- Home
- Entertainment
- రష్మిక 'మైసా' ఫస్ట్ లుక్ పై విజయ్ దేవరకొండ క్రేజీ రియాక్షన్.. అతడిని ముద్దుగా ఏమని పిలిచిందో తెలుసా ?
రష్మిక 'మైసా' ఫస్ట్ లుక్ పై విజయ్ దేవరకొండ క్రేజీ రియాక్షన్.. అతడిని ముద్దుగా ఏమని పిలిచిందో తెలుసా ?
రష్మిక అడుగుపెడితే హిట్ గ్యారెంటీ అన్నట్లుగా ఆమె హవా కొనసాగుతోంది. పుష్ప 2, ఛావా, యానిమల్, తాజాగా కుబేర చిత్రాలతో రష్మిక వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది.

రష్మిక అడుగుపెడితే హిట్ గ్యారెంటీ అన్నట్లుగా ఆమె హవా కొనసాగుతోంది. పుష్ప 2, ఛావా, యానిమల్, తాజాగా కుబేర చిత్రాలతో రష్మిక వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. రష్మిక ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలపై కూడా ఫోకస్ పెడుతోంది.
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆమె తదుపరి చిత్రం మైసాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి రష్మిక ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో తన పాత్ర తాను ఇప్పటివరకు చేయనిదిగా, ఇంటెన్స్ తో కూడినదిగా ఉండబోతుందంటూ, రష్మిక సోషల్ మీడియాలో పేర్కొంది. సెలెబ్రిటీలు కూడా రష్మిక లుక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మైసా ఫస్ట్ లుక్ లో రష్మిక లుక్ పై ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ విజయ్ దేవరకొండ స్పందించారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్లో మైసా పోస్టర్‌ను షేర్ చేస్తూ "This one is going to be terrific" అని కామెంట్ చేశారు. దీనికి రష్మిక స్పందిస్తూ, "విజ్జూ! ఈ సినిమాతో నిన్ను గర్వపడేలా చేస్తా" అంటూ క్రేజీగా రిప్లై ఇచ్చింది. ఇలా వీళ్లిద్దరి కాన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫస్ట్‌లుక్ విడుదల సందర్భంగా రష్మిక రాసిన సందేశంలో, "నేను ఎప్పుడూ మీకు కొత్తగా, భిన్నంగా, ఆసక్తికరంగా ఏదైనా ఇవ్వాలనే ప్రయత్నం చేస్తుంటాను. మైసా అలాంటి ఒక ప్రయోగమే. నేను గతంలో చేయని పాత్ర, సరికొత్త లోకంలోకి ఇది నన్ను తీసుకెళ్లింది. నాలో నేనే చూడని కొత్త రూపాన్ని కనుగొన్నాను. ఇది బలంగా ఉంటుంది, తీవ్రతతో ఉంటుంది, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. చాలా నర్వస్‌గా ఉన్నా కానీ ఎగ్జైట్మెంట్ కూడా ఉంది" అని తెలిపారు.
ప్రస్తుతం రష్మిక.. ధనుష్తో కలిసి నటించిన తాజా చిత్రం కుబేరా విజయవంతంగా రన్ అవుతోంది. అదే విధంగా రష్మిక ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో కూడా నటిస్తోంది. మరికొన్ని చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఇలా రష్మిక ఒకవైపు వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే, విజయ్ దేవరకొండతో రిలేషన్ విషయంలో ఫ్యాన్స్ కి పరోక్షంగా హింట్స్ ఇస్తోంది.