MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ ఫస్ట్ క్రష్ ఎవరు? గ్లోబల్ స్టార్ సిగ్గుపడుతూ చెప్పిన అతి పెద్ద సీక్రెట్

రామ్ చరణ్ ఫస్ట్ క్రష్ ఎవరు? గ్లోబల్ స్టార్ సిగ్గుపడుతూ చెప్పిన అతి పెద్ద సీక్రెట్

మెగా పవర్ స్టార్, గ్లోబల్  హీరో రామ్ చరణ్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక లేడీస్ అయితే చాలామంది ఆయన్ను ప్రేమిస్తుంటారు. చరణ్ అంటే క్రష్ ఉన్నవారు ఎంతో మంది. మరి రామ్ చరణ్ కు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 19 2025, 08:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : facebook / Ramcharan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు మాస్ ఇమేజ్ తో పాటు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. రామ్ చరణ్ అంటే  క్రష్ ఉన్నవారు ఎందరో. సెలబ్రిటీలలో కూడా చరణ్ ను పిచ్చిగా ప్రేమించేవారు ఉన్నారు. మరి ఇంతమంది అభిమానించి, ప్రేమించే చరణ్ కు ఫస్ట్ క్రష్ ఎవరై ఉంటారు ఈ విషయాన్ని చరణ్ స్వయంగా కొంత కాలం క్రితం వెల్లడించారు. ఇంతకీ రామ్ చరణ్ ఫస్ట్ క్రఫ్ ఎవరు..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తొలి క్రష్ ఎవరో స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి షాక్ ఇచ్చారు. ఓ హాలీవుడ్ హీరోయిన్ ను ఎంతో అభిమానించేవాడిని అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రామ్ చరణ్, పాన్ ఇండియా స్థాయిని దాటి, హాలీవుడ్ మీడియాను ఆకర్షించిన తెలుగు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2022లో విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సమయంలో  హాలీవుడ్ మీడియాతో పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.

DID YOU
KNOW
?
రామ్ చరణ్ నెక్ట్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నారు. ఈసినిమా తరువాత ఆయన సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
25
Image Credit : facebook/AlwaysRamCharan

రామ్ చరణ్ ఫస్ట్ క్రష్

2023లో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అందులో భాగంగా, “మీ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఎవరు?” అని ప్రశ్నించగా, “జూలియా రాబర్ట్స్” అని చెప్పారు చరణ్. ఆ పేరు చెప్పేముందు రామ్ చరణ్ కాస్త సిగ్గుపడ్డారు. ఆయన అలా సిగ్గుపడుతూ చెప్పడం అభిమానులను మరింతగా ఆకర్శించింది.

Related Articles

Related image1
ఒక్క హిట్టు కోసం మెగా హీరోల ఎదురుచూపులు, నెక్స్ట్ బ్లాక్ బస్టర్ పక్కానా?
Related image2
రామ్ చరణ్ కి ఇష్టమైన ఫుడ్, వదలకుండా తినేస్తాడు, ఉపాసన చెప్పిన సీక్రెట్ రెసిపీ ఏంటీ?
35
Image Credit : instagram / julia roberts

చరణ్ మాట్లాడుతూ, “జూలియా రాబర్ట్స్ నా ఫస్ట్ క్రష్. ఆమెను టీవీలో కానీ, బిగ్ స్క్రీన్‌పై కానీ చూసినప్పుడు నా కళ్లను పక్కకు తిప్పుకోకుండా చూసేవాడిని. ఆమెకి నేను పెద్ద ఫ్యాన్. ‘ప్రెట్టి ఉమెన్’ సినిమా చూసిన తర్వాత ఆమెపై నాకు ప్రత్యేక అభిమానం ఏర్పడింది,” అని పేర్కొన్నారు.అంతే కాకుండా మరో హాలీవుడ్ నటి పేరు కూడా చరణ్ బయటపెట్టారు. కేథరిన్ జీటా జోన్స్ తనకు ఇష్టమైన నటి అని తెలిపారు. “తాను ఆమె నటన చూసిన మొదటి సినిమా ‘ది మార్క్ ఆఫ్ జోరో’. ఆ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ నన్నెంతో ఆకట్టుకుంది” అని అన్నారు.

45
Image Credit : facebook/AlwaysRamCharan

ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ గుర్తింపు

ఇటీవలే ఆస్కార్ అవార్డు వేదికపై మెరిసిన ఆర్ ఆర్ ఆర్ టీమ్‌లో భాగంగా రామ్ చరణ్ కూడా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. అయితే ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ రెండు డిజాస్టర్స్ ను ఫేస్ చేశారు. తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య సినిమాతో పాటు, సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘గేమ్ చేంజర్’ కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన రిజల్ట్ ను చూపించింది. దాంతో ఈసారి ఎలాగైన సాలిడ్ హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు రామ్ చరణ్. అందుకు తగట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

55
Image Credit : facebook/AlwaysRamCharan

పెద్ది సినిమా బిజీలో మెగా పవర్ స్టార్

ఈసారి పక్కగా హిట్ కొట్టి.. తన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి మూవీని అందించాలని పట్టుదలతో ఉన్నాడు రామ్ చరణ్. సుకుమార్ రాసిన కథతో, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తన 16వ సినిమాను చేస్తున్నాడు. పెద్ది టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా తరువాత ఆయన సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
జాన్వీ కపూర్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
ఒక్క హిట్టు కోసం మెగా హీరోల ఎదురుచూపులు, నెక్స్ట్ బ్లాక్ బస్టర్ పక్కానా?
Recommended image2
రామ్ చరణ్ కి ఇష్టమైన ఫుడ్, వదలకుండా తినేస్తాడు, ఉపాసన చెప్పిన సీక్రెట్ రెసిపీ ఏంటీ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved