MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫస్ట్ లుక్ ఈవెంట్ తోనే 50 కోట్ల సంపాదన, ఇది రాజమౌళికి మాత్రమే సాధ్యం.. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు

ఫస్ట్ లుక్ ఈవెంట్ తోనే 50 కోట్ల సంపాదన, ఇది రాజమౌళికి మాత్రమే సాధ్యం.. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ మూవీ ఈవెంట్ గ్రాండ్ గా ఉండబోతోంది. భారీ మొత్తానికి ఈ ఈవెంట్ ప్రసార హక్కులని విక్రయించినట్లు తెలుస్తోంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 13 2025, 05:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజమౌళి స్టయిలే వేరు
Image Credit : instagram

రాజమౌళి స్టయిలే వేరు

సాధారణంగా ఏ సినిమాకి అయినా ఫస్ట్ లుక్ కానీ, ఫస్ట్ టీజర్, గ్లింప్స్ కానీ ఎలా రిలీజ్ చేస్తారు ? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పడేసి ఊరుకుంటారు. ఫస్ట్ లుక్, టీజర్ బావుంటే సోషల్ మీడియాలో వైరల్ కావడం, సినిమాకి బజ్ రావడం జరుగుతుంది. సినిమా బిజినెస్ లెక్కలన్నీ ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైనప్పుడు బయటకి వస్తాయి. కానీ రాజమౌళి స్థాయి, ఆయన స్టైల్ పూర్తిగా వేరు. మరో రెండు రోజుల్లో మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ మూవీ ఈవెంట్ అత్యంత భారీ స్థాయిలో జరగబోతోంది. 

25
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్
Image Credit : x/ssrajamouli

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్

ఈ ఈవెంట్ లో గ్లోబ్ ట్రాటర్ మూవీలో మహేష్ ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కోసం ఇంత భారీ ఈవెంట్ ని రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 15న జరిగే ఈవెంట్ కోసం 100 అడుగుల భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. వెయ్యి కోట్ల బడ్జెట్ లో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ని జక్కన్న ఫస్ట్ లుక్ ఈవెంట్ తోనే ప్రారంభించినట్లు అర్థం చేసుకోవచ్చు. 

Related Articles

Related image1
నటి రాశిని వల్గర్ గా చూపించిన దర్శకుడికి పార్టీ ఇచ్చిన స్టార్ హీరో, అసలేం జరిగింది.. మూవీ బ్లాక్ బస్టర్ హిట్
Related image2
అతడితో లిప్ లాక్ సీన్స్ లో నటించడం కంఫర్టబుల్, ఈ గిరిజా ఓక్ ఎవరు ?
35
మైండ్ బ్లోయింగ్ ధరకి ఈవెంట్ టెలికాస్ట్ హక్కులు
Image Credit : Social Media

మైండ్ బ్లోయింగ్ ధరకి ఈవెంట్ టెలికాస్ట్ హక్కులు

ఈ ఈవెంట్ ఎక్స్ క్లూజివ్ గా జియో హాట్ స్టార్ లో మాత్రమే ప్రసారం అవుతుంది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ హక్కులని జియో హాట్ స్టార్ కి భారీ మొత్తానికి విక్రయించారు. ఏకంగా ఈ ఈవెంట్ ప్రసార హక్కులకు గాను జియో హాట్ స్టార్ సంస్థ 50 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈవెంట్ కి ఖర్చయ్యే మొత్తం కంటే భారీ లాభాలు దక్కుతున్నాయి. ఇదంతా జక్కన్న మాస్టర్ మైండ్ వల్లే సాధ్యం అని చెప్పొచ్చు. 

45
ఒక్క దెబ్బకి రెండు పిట్టలు
Image Credit : SS Rajamouli/ X

ఒక్క దెబ్బకి రెండు పిట్టలు

సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మొన్నటి వరకు ఒక్క అప్డేట్ ఇవ్వలేదు. ఇలా ఈ ఒక్క ఈవెంట్ తో రాజమౌళి తన సినిమాకి పీక్ పబ్లిసిటీ తీసుకురావడం, ఈవెంట్ తోనే లాభాలు మొదలు పెట్టడం జరుగుతోంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నమాట. 

55
గ్లోబ్ ట్రాటర్ నుంచి వరుస అప్డేట్లు
Image Credit : Asianet News

గ్లోబ్ ట్రాటర్ నుంచి వరుస అప్డేట్లు

ఇప్పటికే గ్లోబ్ ట్రాటర్ మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ ఫస్ట్ లుక్, ప్రియాంక చోప్రా మందాకిని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అదే విధంగా ఈ మూవీలో హీరో పాత్ర గురించి వర్ణించేలా శృతి హాసన్ పాడిన సంచారి అనే సాంగ్ ని కూడా వదిలారు. ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్ ని రాజమౌళి టార్గెట్ గా పెట్టుకున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja Secrets: మణిరత్నంను పరిచయం చేసింది నేనే.. ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు!
Recommended image2
Rajinikanth Remuneration: కమల్‌ హాసన్‌తో సినిమాకి రజనీకి రికార్డ్ రెమ్యూనరేషన్‌.. ఇండియాలోనే టాప్‌
Recommended image3
రాంచరణ్ 'చికిరి' హుక్ స్టెప్ క్రెడిట్ జానీ మాస్టర్ కి దక్కలేదా, ఎమోషనల్ కామెంట్స్.. ఏం జరిగిందో తెలుసా
Related Stories
Recommended image1
నటి రాశిని వల్గర్ గా చూపించిన దర్శకుడికి పార్టీ ఇచ్చిన స్టార్ హీరో, అసలేం జరిగింది.. మూవీ బ్లాక్ బస్టర్ హిట్
Recommended image2
అతడితో లిప్ లాక్ సీన్స్ లో నటించడం కంఫర్టబుల్, ఈ గిరిజా ఓక్ ఎవరు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved