MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ కుదరదని చెప్పేసిన రాఘవేంద్ర రావు.. మరి రాంచరణ్ ప్రశ్నకి ఆన్సర్ ఏది ?

జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ కుదరదని చెప్పేసిన రాఘవేంద్ర రావు.. మరి రాంచరణ్ ప్రశ్నకి ఆన్సర్ ఏది ?

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో రూపొందిన దృశ్య కావ్యం జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం. ఈ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్ కథ అందించారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ నిర్మించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 07 2025, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan

Ram Charan

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో రూపొందిన దృశ్య కావ్యం జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం. ఈ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్ కథ అందించారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ నిర్మించారు. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన సంగీతం అందించారు.

25

దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ చిత్రం 4k వెర్షన్ లో రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. మే 9న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రాఘవేంద్రరావు, అశ్వినీ దత్, మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేస్తున్నారు. చిరంజీవి కెరీర్ లోనే ఈ చిత్రం ఆల్ టైం క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
 

Related Articles

Related image1
ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున నటించిన ఆ మూడు చిత్రాలు.. ఎప్పటికీ ఎవ్వరూ తిరిగి చేయలేరు
Related image2
కిరణ్ అబ్బవరం భార్య రహస్య గోరక్ బేబీ బంప్ ఫోటోస్.. వైరల్
35

ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే అందులో చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్, శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ కలిసి నటించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ చిత్ర సీక్వెల్ గురించి చాలా ఏళ్లుగా ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే సీక్వెల్ పై రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రానికి సీక్వెల్ చేయొచ్చు.
 

45

ఎందుకంటే మూవీ చివర్లో ఉంగరాన్ని చేప మింగినట్లు లీడ్ ఇచ్చాం. అక్కడి నుంచి మరో కథ రెడీ చేయొచ్చు. రామ్ చరణ్, జాన్వి కపూర్ ని హీరో హీరోయిన్లు పెట్టి సీక్వెల్ చేయొచ్చు. కానీ ఒక రిస్క్ ఉంది. సీక్వెల్ని ఎంత అద్భుతంగా చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రాన్ని మించి తీయడం సాధ్యం కాదు. జాన్వి కపూర్ ఎంత అందంగా ఉన్నా తప్పనిసరిగా వాళ్ళమ్మతో పోల్చుతారు. ఎందుకంటే ఆడియన్స్ కి దేవకన్య అంటే శ్రీదేవి మాత్రమే అనే ముద్ర పడిపోయింది.
 

55

ప్రతి అంశంలోనూ కంపారిజన్ వస్తుంది. పాటలు కూడా అంతే బాగా వస్తాయా అనేది అనుమానం. కాబట్టి జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ చేయకపోవడమే బెటర్ అని రాఘవేంద్రరావు అన్నారు. రాఘవేంద్రరావు కామెంట్స్ మెగా ఫ్యాన్స్ కి నిరాశని కలిగించేవే. అయితే ఈ చిత్రం రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా రామ్ చరణ్.. ఒక ఆసక్తికర ప్రశ్న సంధించారు. ఆ ఉంగరం మింగిన చేప ఏమైంది? ఆ ఉంగరం ఏమైంది? 30 ఏళ్లుగా ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఈ ప్రశ్నకి ఒక్కరు మాత్రమే సమాధానం చెప్పగలరు అని రామ్ చరణ్ అన్నారు. అయితే ఆ ఒక్కరు ఎవరు అనేది త్వరలోనే తెలియనుంది. అశ్విని దత్, చిరంజీవి, రాఘవేంద్రరావు ముగ్గురు కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు సమాధానం దొరకనుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image2
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Recommended image3
Jeffrey Epstein: ఎవ‌రీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ
Related Stories
Recommended image1
ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున నటించిన ఆ మూడు చిత్రాలు.. ఎప్పటికీ ఎవ్వరూ తిరిగి చేయలేరు
Recommended image2
కిరణ్ అబ్బవరం భార్య రహస్య గోరక్ బేబీ బంప్ ఫోటోస్.. వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved