MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విషాదంలో ఉన్న అలీని నిజం తెలుసుకోకుండా కొట్టిన నిర్మాత, వార్నింగ్ ఇచ్చి షూటింగ్ ఆపేసిన రాఘవేంద్రరావు

విషాదంలో ఉన్న అలీని నిజం తెలుసుకోకుండా కొట్టిన నిర్మాత, వార్నింగ్ ఇచ్చి షూటింగ్ ఆపేసిన రాఘవేంద్రరావు

కమెడియన్ అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే అలీ చిన్నతనంలో సీతాకోకచిలుక చిత్రంతో గుర్తింపు పొందాడు. అలీ తన చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 30 2025, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చైల్డ్ ఆర్టిస్ట్ గా కమెడియన్ అలీ
Image Credit : Instagram

చైల్డ్ ఆర్టిస్ట్ గా కమెడియన్ అలీ

కమెడియన్ అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే అలీ చిన్నతనంలో సీతాకోకచిలుక చిత్రంతో గుర్తింపు పొందాడు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అలీ చురుకుదనం కామెడీ టైమింగ్ చూసి దర్శక నిర్మాతలు చాలా చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. పెద్దయ్యాక అలీ టాలీవుడ్ లో తిరుగులేని కమెడియన్ గా, హీరోగా కూడా ఎదిగిన సంగతి తెలిసిందే.

25
రాఘవేంద్రరావు దర్శకత్వంలో..
Image Credit : our own

రాఘవేంద్రరావు దర్శకత్వంలో..

ఓ ఇంటర్వ్యూలో అలీ తన చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకున్నారు. లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్రరావు రూపొందించిన చాలా చిత్రాల్లో అలీ నటించారు. 1980లో రాఘవేంద్రరావు దర్శకుడిగా మురళీమోహన్ తో 'నిప్పులాంటి నిజం' అనే చిత్రం రూపొందించారు. ఈ చిత్రంలో అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. అప్పట్లో తెలుగు సినిమాలు కూడా చెన్నైలో షూటింగ్ జరుపుకునేవి.

Related Articles

Related image1
సమంతని కలిసే సీన్, ఆవేశంతో బల్ల గుద్దిన నాగార్జున.. అసలేం జరిగిందంటే..
Related image2
అప్పుడు ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసి.. ఇప్పుడు నాగార్జున రియల్ హీరో అంటూ రేవంత్ రెడ్డి ప్రశంసలు
35
అలీ ఇంట్లో విషాదం
Image Credit : our own

అలీ ఇంట్లో విషాదం

అలీ రాజమండ్రికి చెందిన వ్యక్తి. నిప్పులాంటి నిజం షూటింగ్ కోసం అలీ రాజమండ్రి నుంచి చెన్నైకి వెళ్ళాలి. కానీ అప్పట్లో ఆంధ్రాలో పెద్ద తుఫాను వచ్చింది. పైగా అదే సమయంలో అలీ మూడవ సోదరి మరణించారట. అలీ మాట్లాడుతూ మా చెల్లి చనిపోయింది.. ఆ టైంలో తుఫాను కూడా ఎక్కువగా ఉండటంతో షూటింగ్ కి వెళ్ళలేకపోయాను. మరుసటి రోజు ఎలాగోలా చెన్నైకి వెళ్లి షూటింగ్ కి హాజరయ్యాను. ఆ చిత్ర నిర్మాత నన్ను పిలిచి షూటింగ్ కి ఎందుకు రాలేదని కొట్టారు.

45
నిజం తెలుసుకోకుండా కొట్టిన నిర్మాత
Image Credit : Raghavendra Rao

నిజం తెలుసుకోకుండా కొట్టిన నిర్మాత

ఇంతమంది ఆర్టిస్టులు షూటింగ్ కి వస్తే నీకు రావడానికి ఏం.. అంటూ గట్టిగా అరుస్తూ నన్ను కొట్టారు. నేను బాధపడుతూ పక్కన కూర్చుండి పోయాను. రాఘవేంద్ర రావు గారు అప్పుడే కారు దిగి నన్ను చూశారు. ఏరా ఎందుకలా ఉన్నావ్ ఏం జరిగింది అని అడిగారు. దీనితో నేను నిర్మాత కొట్టారు అని చెప్పాను.

55
షూటింగ్ ఆపేసిన రాఘవేంద్ర రావు
Image Credit : our own

షూటింగ్ ఆపేసిన రాఘవేంద్ర రావు

రాఘవేంద్ర రావు గారు నిర్మాతను పిలిచి వీడిని ఎందుకు కొట్టారు అని అడిగారు. షూటింగ్ కి రాలేదు కదా అని నిర్మాత సమాధానం ఇచ్చారు. షూటింగ్ కి రాకపోతే కొడతారా? వాడు చిన్న పిల్లాడు కారణం తెలుసుకోకుండా అలా కొట్టడం ఏంటి.. వాడి చెల్లి చనిపోయింది తెలుసా అందుకే షూటింగ్ కి రాలేదు. నిజం తెలుసుకోకుండా ఇలా ప్రవర్తించవద్దు అని నిర్మాతకు వార్నింగ్ ఇచ్చి ఆరోజు షూటింగ్ ను రాఘవేంద్రరావు గారు క్యాన్సిల్ చేసేశారు అని అలీ తెలిపారు. 

రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఆలీని చూస్తే నాకు శ్రీదేవి గుర్తొస్తుంది. ఎందుకంటే అలీ కూడా ఆమెలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా నా కళ్ళముందే పెరిగాడు. అలీ కూడా శ్రీదేవి తరహాలో బాలీవుడ్ కి వెళ్లి రాణించాలని కోరుకుంటున్నట్లు రాఘవేంద్రరావు తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Recommended image2
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Recommended image3
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌
Related Stories
Recommended image1
సమంతని కలిసే సీన్, ఆవేశంతో బల్ల గుద్దిన నాగార్జున.. అసలేం జరిగిందంటే..
Recommended image2
అప్పుడు ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసి.. ఇప్పుడు నాగార్జున రియల్ హీరో అంటూ రేవంత్ రెడ్డి ప్రశంసలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved