MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ పాట వినగానే తన మూవీ ఫ్లాప్ అనుకున్న ప్రభాస్.. కట్ చేస్తే చిరు, బాలయ్య చిత్రాలని కూడా తొక్కి పడేసింది

ఆ పాట వినగానే తన మూవీ ఫ్లాప్ అనుకున్న ప్రభాస్.. కట్ చేస్తే చిరు, బాలయ్య చిత్రాలని కూడా తొక్కి పడేసింది

Prabhas : ప్రభాస్ తాను నటించిన ఓ మూవీ ఫ్లాప్ అవుతుందని భయపడ్డారు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 11 2025, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కృష్ణంరాజు వారసుడిగా..
Image Credit : Asianet News

కృష్ణంరాజు వారసుడిగా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే తొలి హిట్ అందుకోవడం కోసం ప్రభాస్ కొంత సమయం ఎదురుచూడాల్సి వచ్చింది. మూడవ చిత్రంతో ప్రభాస్ కి తొలి హిట్ ముచ్చట తీరింది. అది కూడా అలాంటి ఇలాంటి హిట్ కాదు.. తన సినిమాతో ప్రభాస్ ఏకంగా చిరంజీవి, బాలయ్య లకే చెమటలు పట్టించారు. 

25
ప్రభాస్, త్రిష మధ్య కెమిస్ట్రీ హైలైట్
Image Credit : india today

ప్రభాస్, త్రిష మధ్య కెమిస్ట్రీ హైలైట్

ఆ చిత్రం మరేదో కాదు వర్షం. శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లవ్ అండ్ యాక్షన్ మిక్స్ చేసి సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో ప్రభాస్, త్రిష మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరో అద్భుతం. ఈ చిత్రం విషయంలో ప్రభాస్ కి సిరివెన్నెల సీతా రామశాస్త్రికి మధ్య ఒక సరదా సంఘటన జరిగింది. 

Related Articles

Related image1
హన్సిక పరిస్థితి ఇలా అయింది ఏంటి.. గృహ హింస కేసులో ఫ్యామిలీ మొత్తం ఇరుక్కుపోయారు
Related image2
ఆదుకోవాలని ప్రయత్నించిన కృష్ణకే నమ్మక ద్రోహం చేసిన శోభన్ బాబు..సూపర్ స్టార్ చేసిన పనికి మతి పోయింది
35
ఇదేంటి ఇంత దారుణంగా ఉంది పాట
Image Credit : our own

ఇదేంటి ఇంత దారుణంగా ఉంది పాట

ఈ చిత్రంలోని అన్ని పాటలని సిరివెన్నెలే రాశారు. ఈ మూవీ సమయంలోనే తాను సిరివెన్నెల గారిని తొలిసారి మీట్ అయ్యానని ప్రభాస్ అన్నారు. శాస్త్రి గారిని తొలిసారి కలిసినప్పుడు మెల్లగా కరగనీ అనే సాంగ్ వినిపించారు. ఆయన బేస్ వాయిస్ తో మెల్లగా కరగనీ అని పాడుతుంటే.. నాకు అస్సలు నచ్చలేదు. అప్పటికి ఆ సాంగ్ ని దేవిశ్రీ ఇంకా రికార్డింగ్ చేయలేదు. ఆ ట్యూన్ ఎలా ఉంటుందో తెలియదు. సిరివెన్నెల గారు తన బేస్ వాయిస్ తో నాకు పాడి వినిపించినప్పుడు.. ఇదేంటి బాబోయ్ ఇంత దారుణంగా ఉంది పాట అని అనుకున్నా. ఈ సాంగ్ పోయినట్లే.. దీని ఎఫెక్ట్ మూవీపై పడుతుందేమో.. మూవీ కూడా పోతుందేమో అని అనుకున్నా. 

45
చిరు, బాలయ్య చిత్రాలని మించేలా..
Image Credit : our own

చిరు, బాలయ్య చిత్రాలని మించేలా..

కానీ దేవిశ్రీ ఆ పాటని రికార్డ్ చేసి రిలీజ్ చేసిన తర్వాత అది నా ఫేవరిట్ సాంగ్ అయిపోయింది అని ప్రభాస్ అన్నారు. ప్రభాస్ భయపడినట్లు ఏమీ జరగలేదు. ఒక వైపు చిరంజీవి అంజి చిత్రం మరోవైపు బాలయ్య లక్ష్మీ నరసింహ చిత్రం ఉన్నప్పటికీ వర్షం మూవీ సంచలన విజయం సాధించింది. చిరు, బాలయ్య చిత్రాలని మించేలా వసూళ్లు రాబట్టింది. 

55
నంది అవార్డు
Image Credit : Varsham Movie

నంది అవార్డు

వర్షం మూవీలో లంగా ఓణీ అనే సాంగ్ లోని లిరిక్స్ అంటే కూడా తనకి చాలా ఇష్టం అని ప్రభాస్ తెలిపారు. వర్షం చిత్రానికి గాను బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా కెఎస్ చిత్ర నంది అవార్డు అందుకున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ప్రభాస్
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sequel Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఇండియన్ సీక్వెల్స్.. 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొడుతుందా?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: పారుతో ఆడుకున్న కార్తీక్- స్వప్నను లాక్ చేసిన శ్రీధర్- జ్యో నటన
Recommended image3
మహేష్ బాబు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా తూచ్, ఇలా చేసి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్.. అట్టర్ ఫ్లాప్ అయింది అందుకే
Related Stories
Recommended image1
హన్సిక పరిస్థితి ఇలా అయింది ఏంటి.. గృహ హింస కేసులో ఫ్యామిలీ మొత్తం ఇరుక్కుపోయారు
Recommended image2
ఆదుకోవాలని ప్రయత్నించిన కృష్ణకే నమ్మక ద్రోహం చేసిన శోభన్ బాబు..సూపర్ స్టార్ చేసిన పనికి మతి పోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved