MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas: 2025 లో ఒక్క మూవీ లేని హీరో, కానీ చేతిలో 4000 కోట్ల బిజినెస్.. ఆ రెండు సినిమాలపైనే అందరి గురి ?

Prabhas: 2025 లో ఒక్క మూవీ లేని హీరో, కానీ చేతిలో 4000 కోట్ల బిజినెస్.. ఆ రెండు సినిమాలపైనే అందరి గురి ?

ప్రభాస్ నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. రాజా సాబ్ విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడింది. రాజా సాబ్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రాజాసాబ్ నుంచి ప్రభాస్ నటిస్తున్న సినిమాల బిజినెస్ ఏ స్థాయిలో ఉందో ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 12 2025, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్
Image Credit : Instagram/actorprabhas

పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని పరిగణించబడే స్థాయికి చేరిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ వందల కోట్ల బిజినెస్ తో ముడిపడి ఉన్నాయి. కృష్ణం రాజు నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగారు. ప్రభాస్ చివరగా నటించిన సినిమా కల్కి 2898 ఎడి. ఈ చిత్రం 1000 కోట్లకి పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 

27
ఈ ఏడాది ప్రభాస్ నుంచి నో మూవీ
Image Credit : X

ఈ ఏడాది ప్రభాస్ నుంచి నో మూవీ

ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. ఇక ఈ ఏడాది ప్రభాస్ నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడం అభిమానులకు నిరాశ కలిగించే అంశం. రాజా సాబ్ చిత్రం పలుమార్లు రిలీజ్ వాయిదా పడడంతో ప్రభాస్ క్యాలెండర్ లో 2025 ఖాళీగా మారింది. మొత్తానికి ప్రభాస్ హంగామా 2026 సంక్రాంతి నుంచి మొదలవుతుంది. 2025లో ప్రభాస్ నుంచి ఎలాంటి మూవీ రాలేదు కానీ.. ప్రభాస్ పేరుపై ప్రస్తుతం 4000 కోట్ల బిజినెస్ ఉంది. ఇండియాలో ఏ ఇతర స్టార్ హీరోకి సాధ్యం కానీ ఫీట్ ఇది. ఒక్క హీరోని నమ్మి ఏకంగా 4 వేల కోట్ల బిజినెస్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. ప్రభాస్ సినిమాలపై ట్రేడ్ లో ఉన్న క్రేజ్ కి ఇది నిదర్శనం. ఆ సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం. 

Related Articles

Related image1
Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
Related image2
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
37
ది రాజా సాబ్
Image Credit : instagram

ది రాజా సాబ్

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రం తెరకెక్కుతోంది. సుదీర్ఘంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతూనే ఉంది. అందుకే రిలీజ్ ఆలస్యం అయింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఈ చిత్రంతో తన స్టైల్ లో వినోదం అందించబోతున్నారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ బావుంటుంది. భారీ బడ్జెట్ చిత్రాల కారణంగా ప్రభాస్ లోని ఫన్ యాంగిల్ ని అభిమానులు మిస్ అవుతూ వచ్చారు. రాజా సాబ్ మూవీ హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల వరకు జరిగే అవకాశం ఉంది. 

47
ఫౌజీ
Image Credit : Instagram/@hanurpudi

ఫౌజీ

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా 2026లోనే రిలీజ్ కాబోతోంది. సో 2026లో ప్రభాస్ అభిమానులకు డబుల్ ధమాకా ఖాయం. ఇది బ్రిటిష్ టైం పీరియడ్ లో తెరకెక్కుతున్న పీరియడ్ వార్ యాక్షన్ డ్రామా. భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. ఈ చిత్ర బిజినెస్ 500 కోట్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. 

57
స్పిరిట్
Image Credit : Youtube/T series telugu

స్పిరిట్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ చిత్రం రీసెంట్ గా ప్రారంభమైంది. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ రిలీజ్ కి ముందే కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్న చిత్రం ఇది. తప్పకుండ ఈ చిత్ర బిజినెస్ 1000 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు. 

67
సలార్ పార్ట్ 2
Image Credit : Asianet News

సలార్ పార్ట్ 2

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ 1 మంచి విజయం సాధించింది. దీనితో సలార్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. పార్ట్ 2 ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు కానీ ఈ చిత్రానికి 800 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. 

77
కల్కి పార్ట్ 2
Image Credit : X/@VyjayanthiFilms

కల్కి పార్ట్ 2

భవిష్యతులో ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో కల్కి 2 కూడా ఉంటుంది అని చెప్పడం లో సందేహం లేదు. ఎందుకంటే కల్కి మొదటి భాగం సాధించిన విజయం.. చివర్లో పార్ట్ 2కి లీడ్ చేసేలా ముగించిన విధానం ఈ సినిమాని ప్రత్యేకంగా నిలిపాయి. ఈ మూవీలో కర్ణుడిగా ప్రభాస్ చేసిన విధ్వంసాన్ని జస్ట్ శాంపిల్ చూపించారు. పార్ట్ 2లో అది ఏ రేంజ్ లో ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2 బిజినెస్ తప్పకుండా 1200 కోట్ల రేంజ్ లో ఉంటుంది. 

ఈ చిత్రాల బిజినెస్ మొత్తం కలుపుకుంటే 3850 కోట్ల నుంచి 4000 కోట్ల వరకు ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
Recommended image2
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image3
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Related Stories
Recommended image1
Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
Recommended image2
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved