MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ లతో సూపర్ హిట్లు.. ఆ తర్వాత వరుసగా 7 డిజాస్టర్లు అందుకున్న హీరోయిన్

అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ లతో సూపర్ హిట్లు.. ఆ తర్వాత వరుసగా 7 డిజాస్టర్లు అందుకున్న హీరోయిన్

ఒకప్పుడు అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ లతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఒక హీరోయిన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అయితే అది పాజిటివ్ ట్రెండ్ కాదు. ఇటీవల కాలంలో ఆ హీరోయిన్ వరుసగా 7 డిజాస్టర్ చిత్రాలు ఎదుర్కొంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 04 2025, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pooja Hegde

Pooja Hegde

ఒకప్పుడు అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ లతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఒక హీరోయిన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అయితే అది పాజిటివ్ ట్రెండ్ కాదు. ఇటీవల కాలంలో ఆ హీరోయిన్ వరుసగా 7 డిజాస్టర్ చిత్రాలు ఎదుర్కొంది. ఆ హీరోయిన్ ఎవరు, ఏంటా డిజాస్టర్ చిత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

 

25

పూజా హెగ్డే కెరీర్ ని మార్చేసిన డీజే 

స్టార్ బ్యూటీ పూజా హెగ్డే గురించి పరిచయం అవసరం లేదు. 2014లో పూజా హెగ్డే ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీ ఆశించినంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నటించిన ముకుంద కూడా ఫ్లాప్ అయింది. దీనితో పూజా హెగ్డే మూడేళ్ళ పాటు టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చింది. బాలీవుడ్ లో చేసిన ప్రయత్నాలు కూడా వర్కౌట్ కాలేదు. కానీ అదృష్టం కొద్దీ ఆమెకి 2017లో అల్లు అర్జున్ సరసన డీజే చిత్రంలో నటించే అవకాశం అందుకుంది. డీజే పూజా హెగ్డే కెరీర్ ని మార్చేసింది. ఈ చిత్రంలో గ్లామర్ పరంగా పూజా హెగ్డేకి సూపర్ క్రేజ్ వచ్చేసింది. 

Related Articles

Related image1
ఆ డైరెక్టర్ తో రాంచరణ్ మూవీ చేయకుండా అడ్డుకున్న చిరంజీవి సతీమణి సురేఖ, ఇది మాత్రం ఊహించని ట్విస్ట్
Related image2
ఆదిపురుష్ ఫ్లాప్ అని ఒప్పుకున్న సైఫ్ అలీ ఖాన్, డైరెక్టర్ తెలివితక్కువ వాదనతో అంతా షాక్
35

మహేష్, ఎన్టీఆర్, బన్నిలతో సూపర్ హిట్లు 

డీజే తర్వాత పూజా హెగ్డే వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్ తో అరవింద సమేత, మహేష్ బాబుతో మహర్షి, మరోసారి బన్నీతో అల వైకుంఠపురములో లాంటి చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. దీనితో పూజా హెగ్డే టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది. అఖిల్ తో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత పూజా హెగ్డేకి బ్యాడ్ టైం మొదలైంది. 

45

రాధే శ్యామ్ నుంచి ఫ్లాపులు మొదలు 

ప్రభాస్ తో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్ మూవీతో పూజా హెగ్డేకి ఫ్లాపులు మొదలయ్యాయి. రాంచరణ్ తో నటించిన ఆచార్య, విజయ్ సరసన నటించిన బీస్ట్ చిత్రాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే స్టార్ హీరోలతో నటించింది. రణ్వీర్ సింగ్ తో నటించిన సర్కస్, సల్మాన్ ఖాన్ తో నటించిన కిసీకీ భాయ్ కీసీకి జాన్, షాహిద్ కపూర్ తో నటించిన దేవా చిత్రాలు కనిపించకుండా పోయాయి. 

55

ఆశలు పెట్టుకున్న రెట్రో కూడా పోయినట్లే 

ఇటీవల పూజా హెగ్డే సూర్య సరసన రెట్రో చిత్రంలో నటించింది. ఈ మూవీపై పూజా హెగ్డే బోలెడు అసలు పెట్టుకుంది. కానీ రెట్రో చిత్రం కూడా డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. మే 1 న విడుదలైన ఈ చిత్రానికి వసూళ్లు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఇది పూజా హెగ్డేకి వరుసగా 7వ ఫ్లాప్ మూవీ. ఇన్ని ఫ్లాపుల తర్వాత పూజా హెగ్డే కేరీర్ లో ఎలా బౌన్స్ బాక్ అవుతుంది అనేది ఆసక్తిగా మారింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Bang: రామ్ చరణ్ ఉపాసన కవలల డెలివరీ ముహూర్తం పెట్టిన జ్యోతిష్కుడు ఈయనే
Recommended image2
ప్రభాస్ కంటే వయసులో చిన్నదైనా.. ఆయనకు తల్లిగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
SuperStar Krishna కి చుక్కలు చూపించిన వెంకటేష్‌.. `సంక్రాంతి` దెబ్బకి అడ్రస్‌ లేకుండా పోయిన సినిమాలివే
Related Stories
Recommended image1
ఆ డైరెక్టర్ తో రాంచరణ్ మూవీ చేయకుండా అడ్డుకున్న చిరంజీవి సతీమణి సురేఖ, ఇది మాత్రం ఊహించని ట్విస్ట్
Recommended image2
ఆదిపురుష్ ఫ్లాప్ అని ఒప్పుకున్న సైఫ్ అలీ ఖాన్, డైరెక్టర్ తెలివితక్కువ వాదనతో అంతా షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved