MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ustaad Bhagat Singh OTT Price: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ ఓటీటీ ధర ఎంతో తెలుసా? నిర్మాతలకు లాభాల పంట

Ustaad Bhagat Singh OTT Price: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ ఓటీటీ ధర ఎంతో తెలుసా? నిర్మాతలకు లాభాల పంట

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ థియేట్రికల్‌ ఫ్లాప్‌ దిశగా వెళ్తోంది. కానీ నిర్మాతలు మాత్రం లాభాల్లోకి వెళ్లారు. కారణం ఓటీటీ రైట్స్. ఈ మూవీకి అదిరిపోయే ఓటీటీ బిజినెస్‌ అయ్యిందట. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Mar 21 2026, 06:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
థియేటర్లలో సందడి చేస్తోన్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Image Credit : Asianet News

థియేటర్లలో సందడి చేస్తోన్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో `ఉస్తాద్ భగత్‌ సింగ్‌` మూవీ రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఉగాదికి ఆడియెన్స్ ముందుకు వచ్చింది. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. అభిమానులను ఆకట్టుకుంటోంది. కానీ జనరల్‌ ఆడియెన్స్ నుంచి నెగటివ్ టాక్‌ వస్తోంది.

24
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ కలెక్షన్లు
Image Credit : Asianet News

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ కలెక్షన్లు

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ తొలి రోజు బాగానే సత్తా చాటింది. కానీ రెండో రోజు దారుణంగా పడిపోయింది. ఈ మూవీ రెండు రోజుల్లో దాదాపు రూ.39కోట్ల షేర్‌ని, రూ.65కోట్ల గ్రాస్‌ని రాబట్టినట్టు సమాచారం. ఈ సినిమాకి రూ.123కోట్ల బిజినెస్‌ అయ్యిందట. బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే దాదాపు రూ.250కోట్లకుపైగా గ్రాస్‌ రాబట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న టాక్‌, థియేటర్ల ఆక్యుపెన్సీని బట్టి చూస్తే ఇది కష్టమనే టాక్‌ వినిపిస్తోంది.

Related Articles

Related image1
Amala Akkineni: నేనేమీ నాగార్జునని వెంటపడి పట్టుకోలేదు, హీరోయిన్లతో ఎఫైర్లు.. సంచలన విషయాలు బయటపెట్టిన అమల
Related image2
Top 10 Heroines: దుమ్ములేపిన రష్మిక, కాజల్‌, తమన్నా.. పడిపోయిన త్రిష, శ్రీలీల.. నెంబర్‌ 1 హీరోయిన్‌ ఎవరంటే?
34
ఉస్తాద్ భగత్‌ సింగ్‌ మూవీ నిర్మాతలకు లాభాల పంట
Image Credit : Asianet News

ఉస్తాద్ భగత్‌ సింగ్‌ మూవీ నిర్మాతలకు లాభాల పంట

ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఓటీటీ రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారు? ఎంత వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్‌ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.108కోట్లకు ఈ హక్కులను దక్కించుకుందని సమాచారం. `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీకి రూ.150కోట్ల వరకు బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. ఈ లెక్కన థియేటర్‌ హక్కులు, ఓటీటీ హక్కులు కలిపితే రూ.230కోట్లు వచ్చింది. నిర్మాతల పంట పడిందని చెప్పొచ్చు. దాదాపు ఎనభై కోట్లకుపైగానే లాభాలు వచ్చాయి.

44
బయ్యర్లకి నష్టాలు తప్పవా?
Image Credit : Asianet News

బయ్యర్లకి నష్టాలు తప్పవా?

అయితే ఈ సినిమా బిజినెస్‌ పరంగా నిర్మాతలు లాభాల్లో ఉన్నారు, కానీ ఇప్పుడు అసలు బాధ బయ్యర్లకే. ఎక్కువ రేట్‌కి ఈ థియేట్రికల్‌ హక్కులను సొంతం చేసుకున్న బయ్యర్లకి భారీగానే నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీ థియేట్రికల్‌గా సేఫ్‌ కావాలంటే ఇంకా ఎనభై కోట్లకుపైగా షేర్‌ రావాలి. అంటే రూ.170కోట్లకుపైగా గ్రాస్‌ రావాలి. మరి అది సాధ్యమేనా అనేది చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
మహేష్, పవన్, రాంచరణ్ అస్సలు మరచిపోలేని హీరోయిన్లు వీళ్ళే.. పెళ్లయ్యాక అడ్రెస్ లేకుండా పోయారు
Recommended image2
సెలబ్రిటీ బాడీగార్డ్‌ల జీతం కోట్లలో ఉంటుందా? షారుఖ్ ఖాన్ మాజీ బాడీగార్డ్ చెప్పిన అసలు నిజం..
Recommended image3
Jr NTR Transformation: 7 వారాల్లో 9.5 కిలోలు మాయం, కండలు తిరిగిన తారక్ బాడీ సీక్రెట్ ఇదే
Related Stories
Recommended image1
Amala Akkineni: నేనేమీ నాగార్జునని వెంటపడి పట్టుకోలేదు, హీరోయిన్లతో ఎఫైర్లు.. సంచలన విషయాలు బయటపెట్టిన అమల
Recommended image2
Top 10 Heroines: దుమ్ములేపిన రష్మిక, కాజల్‌, తమన్నా.. పడిపోయిన త్రిష, శ్రీలీల.. నెంబర్‌ 1 హీరోయిన్‌ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved