MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా..? డైరెక్టర్ ఎవరో తెలుసా?

పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా..? డైరెక్టర్ ఎవరో తెలుసా?

చాలా కాలంగా మెగా అభిమానులు ఎదురు చూస్తున్న కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,రామ్ చరణ్. బాబాయ్ అబ్బాయ్ కలిసి సినిమా చేస్తే చూడాలని అందరు కోరుకుంటున్నారు. మరి వీరిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 20 2026, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు..
Image Credit : facebook.com/AlwaysRamCharan

మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు..

మెగా ఫ్యామిలీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్, అల్లు అర్జున్... టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే ఇందులో చిరు, చరణ్, చరణ్ బన్నీ, పవన్ చిరు కాంబినేషన్ వెండితెరపై అప్పుడప్పుడు కనిపించింది. కానీ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే త్వరలో అభిమానులు కోరిక తీరే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు కలిసి తెరపై కనిపిస్తారా లేదా అనేది తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ నిర్మాతగా రామ్ చరణ్ సినిమా రాబోతున్నట్టు మాత్రం తెలుస్తోంది.

25
నిర్మాతగా పవన్ కళ్యాణ్ ..?
Image Credit : X

నిర్మాతగా పవన్ కళ్యాణ్ ..?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో తన కెరీర్ కు సబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా కొనసాగాలనే ఉద్దేశంతో ఆయన తన నిర్మాణ సంస్థ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్‌ను మళ్లీ యాక్టివ్ చేశారట. ఈ బ్యానర్‌పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థతో కలిసి వరుసగా సినిమాలను నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ నాలుగు చిత్రాల్లో రెండు సినిమాల్లో ఆయనే హీరోగా నటించనుండగా, మిగిలిన రెండు సినిమాలను ఇతర హీరోలతో నిర్మించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Related Articles

Related image1
ఇండియా రిచ్ స్టార్స్ లో ఇద్దరు తెలుగు హీరోలు, టాప్ 10 లో ఫస్ట్ ప్లేస్ ఎవరిదో తెలుసా?
Related image2
రాజాసాబ్ చేయకుండా తప్పించుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? ప్రభాస్ ను బుక్ చేశారుగా
35
రామ్ చరణ్ తో పవన్ కళ్యాణ్ సినిమా..?
Image Credit : facebook.com/AlwaysRamCharan

రామ్ చరణ్ తో పవన్ కళ్యాణ్ సినిమా..?

పవన్ కళ్యాన్ నిర్మించబోయే సినిమాల్లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను హీరోగా పెట్టి ఒక భారీ బడ్జెట్ సినిమాను రూపొందించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసినిమాకు పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. రామ్ చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఒక సినిమా ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పటికీ, ఇద్దరికీ వేర్వేరు కమిట్‌మెంట్లు ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు సెట్స్‌పైకి వెళ్లలేదు.

45
చరణ్ సినిమాలో పవన్ నటిస్తాడా?
Image Credit : facebook.com/AlwaysRamCharan

చరణ్ సినిమాలో పవన్ నటిస్తాడా?

అభిమానులు అయితే చరణ్, పవన్ ను కలిపి వెండితెరపై చూడాలని అనుకుంటున్నారు. అయితే పవన్ ఒక వేళ నిజంగా చరణ్ తో పెద్ద సినిమా చేస్తే..అందులో ఏదో ఒక రకంగా గెస్ట్ రోల్ అయినా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం అఫీషియల్ గా ఎవరు చెప్పకపోయినా.. రూమర్ వైరల్ అవుతుండటంతో.. నిజంగా ఇది జరిగితే బాగుండు అని.. మెగా అభిమానుల అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ స్థాయి పాన్ ఇండియా స్టార్‌గా ఉంది. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాపై అభిమానులతో పాటు ఆడియన్స్ అందరిలో.. భారీ స్థాయి అంచనాల ఉంటాయి. మరి త్రివిక్రమ్ కు ఉన్న ఇమేజ్ తో ఇది సాధ్యం అవుతుందా అనేది చూడాలి.

55
త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా ఎవరితో?
Image Credit : X / Harika and Hassine Creations

త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా ఎవరితో?

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కార్తికేయ స్వామి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనుండటంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి నిజంగానే రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందా? అది అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఉంటుందా లేదా అనేది చూడాలి?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
పవన్ కళ్యాణ్
దగ్గుబాటి వెంకటేష్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Surekha Vani కి రెండో పెళ్లి, కూతురు సుప్రీత ప్లాన్‌.. ఆఫర్స్ లేవంటూ ఆవేదన
Recommended image2
ఫస్ట్ టైమ్‌ డేట్‌కి వెళ్తున్నారా? ఈ 7 బెస్ట్ రొమాంటిక్ సినిమాలు చూడండి
Recommended image3
Sonam Kapoor Baby Shower: సోనమ్ కపూర్ సీమంతం వేడుక.. గెస్ట్ లు ఎవరెవరో తెలుసా, వైరల్ ఫోటోస్
Related Stories
Recommended image1
ఇండియా రిచ్ స్టార్స్ లో ఇద్దరు తెలుగు హీరోలు, టాప్ 10 లో ఫస్ట్ ప్లేస్ ఎవరిదో తెలుసా?
Recommended image2
రాజాసాబ్ చేయకుండా తప్పించుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? ప్రభాస్ ను బుక్ చేశారుగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved