MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OG Day 1 Collections: ఓజీ డే 1 కలెక్షన్స్, పవన్ కళ్యాణ్ విధ్వంసం..పుష్ప 2, ఆర్ఆర్ఆర్, దేవర రికార్డులు బ్రేక్

OG Day 1 Collections: ఓజీ డే 1 కలెక్షన్స్, పవన్ కళ్యాణ్ విధ్వంసం..పుష్ప 2, ఆర్ఆర్ఆర్, దేవర రికార్డులు బ్రేక్

OG First Day Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం వరల్డ్ వైడ్ గా సంచలనాలు సృష్టిస్తోంది. ఓజీ డే 1 కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 26 2025, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓజీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్(OG Movie First Day Collections)
Image Credit : Asianet News

ఓజీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్(OG Movie First Day Collections)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం గురువారం రోజు భారీ అంచనాల నడుమ విడుదలయింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్ నుంనే రికార్డుల మోత మోగించిన ఓజీ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే ఇంకెలా ఉంటుంది ? బాక్సాఫీస్ జాతర మరింత ఎక్కువైంది. ఏస్థాయిలో అంటే పలు ఏరియాల్లో ఆల్ టైం రికార్డులు నెలకొల్పే స్థాయిలో. ఓజీ చిత్రం తొలి రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

25
నైజాంలో ఊచకోత
Image Credit : Film

నైజాంలో ఊచకోత

ఓజీ మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 90 నుంచి 100 కోట్ల షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగం పైగా రికవరీ అనే చెప్పాలి. కొన్ని ఏరియాల్లో ఓజీ చిత్రం బాహుబలి 1, ఆర్ఆర్ఆర్, పుష్ప 2, దేవర, కల్కి చిత్రాల రికార్డులు బ్రేక్ చేసి ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. ముఖ్యంగా నైజాం, ఓవర్సీస్, గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కలెక్షన్ల ఊచకోత కోస్తున్నారు. నైజాం ఏరియాలో తొలి రోజు ఓజీ చిత్రం 24. 4 కోట్ల షేర్ రాబట్టింది. నైజాం ఏరియా థియేట్రికల్ హక్కుల విలువ 54 కోట్లు. అంటే తొలిరోజే ఈ చిత్రం దాదాపు సగం రికవరీ సాధించేసింది. నైజాం ఏరియాలో ఓజీ ఆల్ టైం టాప్ 2 రికార్డుగా నిలిచింది. తొలి స్థానంలో పుష్ప 2 చిత్రం 25 కోట్లతో ఉంది. ఓజీ ధాటికి ఆర్ఆర్ఆర్ (23.3 కోట్లు) దేవర (22.6 కోట్లు), సలార్ (22.5), కల్కి (19. 6 కోట్లు ) రికార్డులు గల్లంతయ్యాయి. 

Related Articles

Related image1
ఎస్పీ బాలు కోసం నెలరోజులు ఎదురుచూసి ఇళయరాజా పాడించిన మాస్టర్ పీస్ సాంగ్.. అదీ గాన గంధర్వుడి రేంజ్
Related image2
పవన్ తన కొడుక్కి కూడా జపనీస్ పేరే పెట్టారు, మొదట అనుకున్నది తేరి రీమేక్.. ఓజీలో జపాన్ గుట్టు విప్పిన సుజీత్
35
ఈస్ట్ గోదావరిలో ఆల్ టైం రికార్డు
Image Credit : Film

ఈస్ట్ గోదావరిలో ఆల్ టైం రికార్డు

ఈస్ట్ గోదావరిలో ఓజీ చిత్రం ఓపెనింగ్ డే రోజు ఆల్ టైం రికార్డు నెలకొల్పినట్లు తెలుస్తోంది. ఈస్ట్ గోదావరిలో ఓజీ చిత్రం తొలి రోజు 8 కోట్లకి పైగా షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. భారీ మార్జిన్ తో ఆ తర్వాత ఉన్న బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, పుష్ప 2 చిత్రాలని ఓజీ చిత్రం అధికమించినట్లు చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మిగిలిన ఏరియాల విషయానికి వస్తే.. కృష్ణా జిల్లాలో 4.11 కోట్లు, గుంటూరులో 6.15 కోట్లు, ఉత్తరాంధ్రలో 5.6 కోట్ల షేర్ నమోదైనట్లు తెలుస్తోంది. 

45
ఓవర్సీస్ లో సంచలనం
Image Credit : Film

ఓవర్సీస్ లో సంచలనం

ఓవర్సీస్ లో ఓజీ సంచలన నంబర్స్ ని నమోదు చేస్తోంది. ప్రీమియర్లతో కలిపి తొలి రోజు ఓవర్సీస్ లో 4.8 మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 42 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. ఇలా వరల్డ్ వైడ్ గా ఓజీ చిత్రం తొలి రోజు 90 నుంచి 100 కోట్ల షేర్.. 155 నుంచి 160 కోట్ల గ్రాస్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. 

55
సంబరాల్లో పవన్ అభిమానులు
Image Credit : X/DVV Entertainment

సంబరాల్లో పవన్ అభిమానులు

తొలిరోజు బాక్సాఫీస్ ఊచకోత కోసిన ఓజీ చిత్రం రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి. మౌత్ టాక్ సూపర్ పాజిటివ్ గా ఉంది కాబట్టి ఓజీ చిత్రం త్వరగానే బ్రేక్ ఈవెన్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి మొత్తం తీర్చేశారు. సుజీత్ దర్శకత్వం, పవన్ కళ్యాణ్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, తమన్ సంగీతం ఈ చిత్రాన్ని పిల్లర్లుగా నిలిచాయి. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా.. శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. వరల్డ్ వైడ్ గా ఓజీ చిత్రానికి 172 కోట్ల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓజీ ప్రీమియర్ షోలకు సెలెబ్రిటీలు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా, కుమార్తె ఆద్య, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, కిరణ్ అబ్బవరం, నేచురల్ స్టార్ నాని లాంటి వారంతా ఓజీ ప్రీమియర్ షోలు వీక్షించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Recommended image2
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Recommended image3
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌
Related Stories
Recommended image1
ఎస్పీ బాలు కోసం నెలరోజులు ఎదురుచూసి ఇళయరాజా పాడించిన మాస్టర్ పీస్ సాంగ్.. అదీ గాన గంధర్వుడి రేంజ్
Recommended image2
పవన్ తన కొడుక్కి కూడా జపనీస్ పేరే పెట్టారు, మొదట అనుకున్నది తేరి రీమేక్.. ఓజీలో జపాన్ గుట్టు విప్పిన సుజీత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved