MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓజీ ఇంకా దుమ్మురేపుతోంది, ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ఓజీ ఇంకా దుమ్మురేపుతోంది, ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు

Top 5 Most Watched Films on OTT : ప్రతి వారం కొత్త సినిమాల తో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నిండిపోతున్నాయి. ఈ వారం కూడా కొత్త సినిమాలు ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ఈక్రమంలో  గత వారం ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5  సినిమాలు, వెబ్ సిరీస్‌ల  ఏంటో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 29 2025, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఓటీాటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్ లు
Image Credit : X

ఓటీాటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్ లు

ఎప్పటికప్పుడు  ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరుగుతుండటంతో అందులో రిలీజ్ అయ్యే  సినిమాల సంఖ్య కూడా పెరుగుతోంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్, ఆహా, సోనీ లివ్ వంటి అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం టాప్ లో నడుస్తున్నాయి. వాటిలో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో, అక్టోబర్ 20 నుంచి 26 వరకు ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది. ఆ జాబితాలో తెలుగు సినిమాలెన్ని, తమిళ సినిమాలెన్ని. 

24
ఫస్ట్ ప్లేస్ లో పవన్ కల్యాణ్ ఓజీ
Image Credit : Film

ఫస్ట్ ప్లేస్ లో పవన్ కల్యాణ్ ఓజీ

ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5  సినిమాల జాబితాలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ  మొదటి స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు 35 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. సుజిత్ డైరెక్ట్ చేసిన సినిమా థియేటర్ లో యావరేజ్ గా నడిచినా.. ఓటీలీలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇక  ఆ తర్వాత రెండో స్థానంలో 'గ్రేటర్ కలేష్' అనే హిందీ సినిమా ఉంది. ఈ చిత్రానికి ఆదిత్య సంతోఖ్ దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు 20 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ జాబితాలో జాన్వీ కపూర్ నటించిన 'పరమ సుందరి' సినిమా మూడో స్థానంలో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న ఈ సినిమాకు 19 లక్షల వ్యూస్ వచ్చాయి.

Related Articles

Related image1
బిగ్ బాస్ ఫేమ్, కార్తీక దీపం విలన్ శోభా శెట్టి రహస్యంగా పెళ్లి చేసుకుందా? వైరల్ అవుతోన్న షాకింగ్ ఫోటోస్
Related image2
విజయ్ బాటలో రజినీకాంత్, సినిమాలకు గుడ్ బై చెప్పబోతోన్న సూపర్ స్టార్ ? లాస్ట్ మూవీ ఏదో తెలుసా?
34
చివరి స్థానంలో ఎన్టీఆర్ వార్ 2
Image Credit : Instagram

చివరి స్థానంలో ఎన్టీఆర్ వార్ 2

విజయ్ ఆంటోని నటించిన 'శక్తి తిరుమగన్' సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన 'శక్తి తిరుమగన్' సినిమా జియో హాట్‌స్టార్‌లో 17 లక్షల వ్యూస్ సాధించింది. దీని తర్వాత ఐదో స్థానంలో హృతిక్ రోషన్ నటించిన 'వార్ 2' సినిమా ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్‌లో జూనియర్ ఎన్టీఆర్ కూడా కీలక పాత్రలో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు 15 లక్షల వ్యూస్ వచ్చాయి.

44
டாப் 5 வெப் சீரிஸ்
Image Credit : netflix

டாப் 5 வெப் சீரிஸ்

అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 వెబ్ సిరీస్‌ల జాబితాలో మిర్చి సెంథిల్, షబానా, సుజిత నటించిన 'పోలీస్ పోలీస్' అనే తమిళ వెబ్ సిరీస్ ఐదో స్థానంలో ఉంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ 11 లక్షల వ్యూస్ పొందింది. దీని తర్వాత జియో హాట్‌స్టార్‌లోని 'సెర్చ్' వెబ్ సిరీస్ 12 లక్షల వ్యూస్‌తో 4వ స్థానంలో, అమెజాన్ ప్రైమ్‌లోని 'జమునాపార్ సీజన్ 2' 13 లక్షల వ్యూస్‌తో మూడో స్థానంలో, జియో హాట్‌స్టార్‌లోని 'మహాభారత్ ఏక్ ధర్మయుద్ధం' అనే ఏఐ వెబ్ సిరీస్ 14 లక్షల వ్యూస్‌తో 2వ స్థానంలో, నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన 'కురుక్షేత్ర' 20 లక్షల వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉన్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా? నిజమెంత?
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 12: రైస్ మిల్లు ఓనర్‌గా వల్లి, నర్మద సాగర్‌ను ఛీ కొట్టిన రామరాజు దంపతులు
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Related Stories
Recommended image1
బిగ్ బాస్ ఫేమ్, కార్తీక దీపం విలన్ శోభా శెట్టి రహస్యంగా పెళ్లి చేసుకుందా? వైరల్ అవుతోన్న షాకింగ్ ఫోటోస్
Recommended image2
విజయ్ బాటలో రజినీకాంత్, సినిమాలకు గుడ్ బై చెప్పబోతోన్న సూపర్ స్టార్ ? లాస్ట్ మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved