MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 40కిపైగా సినిమాల్లో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్‌, సావిత్రి అన్నా చెల్లిగా నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా?

40కిపైగా సినిమాల్లో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్‌, సావిత్రి అన్నా చెల్లిగా నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా?

ఎన్టీఆర్‌, సావిత్రి టాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటిది వీరిద్దరు ఒక మూవీలో అన్నా చెల్లిగా నటించారు. సెంటిమెంట్‌తో కన్నీళ్లు పెట్టించారు.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : May 27 2025, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హిట్‌ పెయిర్‌గా ఎన్టీఆర్‌, సావిత్రి
Image Credit : google

హిట్‌ పెయిర్‌గా ఎన్టీఆర్‌, సావిత్రి

నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌), సావిత్రి జంట అప్పట్లో హిట్‌ పెయిర్. వీరిద్దరు కలిసి ఏ మూవీ చేసినా బాక్సాఫీసు వద్ద హిట్టే. అయితే అప్పట్లో హీరోయిన్లు తక్కువ. బాగా నటించగలిగేవాళ్లు, అందంగా ఉన్నవాళ్లకే ఎక్కువగా హీరోయిన్ అవకాశాలు వచ్చేవి. అలా ఎన్టీఆర్‌, సావిత్రి కలిసి ఎన్నో సినిమాలు చేశారు. వీరి కాంబినేషన్‌లో నలభైకి పైగానే సినిమాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు.

25
వెండితెరపై పోటీ పడి నటించిన రామారావు, సావిత్రి
Image Credit : google

వెండితెరపై పోటీ పడి నటించిన రామారావు, సావిత్రి

కొన్ని మూవీస్‌లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి కలిసి నటించారు. వాటిలో కొన్ని సావిత్రి.. ఏఎన్నార్ కి జోడీగా కూడా చేసింది.  కానీ రామారావు, సావిత్రిలది తిరుగులేని హిట్‌ పెయిర్‌ అని చెప్పొచ్చు. వీరిమధ్య ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ కూడా అంతే బాగా కుదిరేది. అంతేకాదు వీరిద్దరు వెండితెరపై పోటీ పడి నటించేవారు. అలా తెలుగు ఆడియెన్స్ ని వీరిద్దరు తమదైన రొమాన్స్ తో అలరించారు. ఆడియెన్స్ గుండెల్లో నిలిచిపోయారు.

Related Articles

Related image1
ఐశ్వర్యారాయ్ రిజెక్ట్ చేసిన 8 బ్లాక్ బస్టర్ సినిమాలు.. చేసి ఉంటే ఆమె రేంజ్‌ వేరే లెవల్‌
Related image2
దాసరి నారాయణరావు వందల కోట్ల ఆస్తులు దోచుకున్నది వాళ్లే.. గురువుగారు గురువుగారు అంటూ కాజేశారు
35
`రక్తసంబంధం`లో అన్నా చెల్లిగా ఎన్టీఆర్‌, సావిత్రి
Image Credit : google

`రక్తసంబంధం`లో అన్నా చెల్లిగా ఎన్టీఆర్‌, సావిత్రి

ఇదిలా ఉంటే ఎన్నో సినిమాల్లో జంటగా చేసిన ఎన్టీఆర్‌, సావిత్రి ఒక్క మూవీలో మాత్రం అన్నా చెల్లిగా నటించారు. అటు ఇండస్ట్రీ వర్గాలను, ఇటు ఆడియెన్స్ ని ఆశ్చర్యపరిచారు. వీరిద్దరు అన్నా చెల్లిగా నటించడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. ఈ చర్చనే సినిమాపై ప్రత్యేకమైన అటెన్షన్‌ క్రియేట్‌ చేసింది. ఆ సినిమానే `రక్తసంబంధం`. అన్నా చెల్లి అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ 1962లో విడుదలైంది.

45
`రక్త సంబంధం` సినిమా టీమ్‌
Image Credit : google

`రక్త సంబంధం` సినిమా టీమ్‌

ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి వి.మధుసూదనరావు దర్శకుడు. సుందర్ లాల్ నహత, దూండి నిర్మాతలు. ఇందులో ఎన్టీఆర్, సావిత్రిలతోపాటు కాంతారావు, దేవిక, రేలంగి, ప్రభాకర్ రెడ్డి, సూర్యకాంతం వంటి వారు నటించారు. ఈ సినిమా తమిళంలో వచ్చిన `పసమలార్‌`కి రీమేక్‌. అందులో సావిత్రి, జెమినీ గణేషన్‌ నటించడం విశేషం.

55
బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన `రక్తసంబంధం`
Image Credit : google

బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన `రక్తసంబంధం`

ఎన్టీఆర్‌, సావిత్రి అన్నా చెల్లిగా నటించిన `రక్తసంబంధం` మూవీ 1962 నవంబర్‌ 1న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 11 సెంటర్లలో వంద రోజులు ఆడింది. విజయవాడలో ఏకంగా 25 వారాలు ప్రదర్శించబడింది. అంతేకాదు ఈ మూవీని 1988లో మరోసారి రీ రిలీజ్‌ చేశారు. అప్పుడు కూడా మంచి ఆదరణ పొందడం విశేషం. 

లవర్స్ గా, భార్యాభర్తలుగా వెండితెరపై రొమాన్స్ తో రెచ్చిపోయిన ఎన్టీఆర్‌, సావిత్రి.. అన్నా చెల్లిగానూ అంతే అద్భుతమైన బాండింగ్‌ని చూపించి ఆడియెన్స్ ని సర్‌ప్రైజ్‌ చేశారు. దీంతో ఈ మూవీ వీరిద్దరి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి తారక రామారావు
సావిత్రి (నటి)
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tamannaah: మైసూర్‌ సాండల్‌ సోప్‌కి తమన్నా తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే.. కన్నడ నాట రచ్చ రచ్చ
Recommended image2
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image3
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Related Stories
Recommended image1
ఐశ్వర్యారాయ్ రిజెక్ట్ చేసిన 8 బ్లాక్ బస్టర్ సినిమాలు.. చేసి ఉంటే ఆమె రేంజ్‌ వేరే లెవల్‌
Recommended image2
దాసరి నారాయణరావు వందల కోట్ల ఆస్తులు దోచుకున్నది వాళ్లే.. గురువుగారు గురువుగారు అంటూ కాజేశారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved