MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమాకు 20 కోట్లు డిమాండ్ చేస్తున్న సౌత్ హీరోయిన్, నిర్మాతలకు షాక్ ఇస్తున్న నటి ఎవరు?

సినిమాకు 20 కోట్లు డిమాండ్ చేస్తున్న సౌత్ హీరోయిన్, నిర్మాతలకు షాక్ ఇస్తున్న నటి ఎవరు?

సౌత్ లో స్టార్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కాని ఏజ్ బార్ అయిన ఓ నటి మాత్రం నిర్మాతలను భయపెడుతుందట. రెమ్యునరేపన్ విషయంలో భయపెడుతుందట.  సినిమాకు 20 కోట్లు డిమాండ్ చేస్తూ..షాక్ ఇస్తోందట ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 04 2025, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Nayanthara

Nayanthara

ఆ హీరోయిన్ మరెవరో కాదు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. 40 ఏళ్ల ఈ నటి పెళ్లై పిల్లలు ఉన్నా కాని తగ్గేది లేదంటోంది. సౌత్  సినిమాల్లో 'లేడీ సూపర్‌స్టార్' అని పేరు తెచ్చుకున్న నయనతార తన కెరీర్‌లో మరో మైలురాయికి చేరువవుతోందని కోలీవుడ్‌లో టాక్. తన తదుపరి సినిమాలకు రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే, భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే  హీరోయిన్లలో సౌత్ నుంచి ఆమే టాప్ లో ఉండబోతోంది. 

Also Read: 42 ఏళ్ల త్రిష ఆస్తి ఎన్ని కోట్లు? స్టార్ హీరోయన్ లగ్జరీ లైఫ్, నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

26
Nayanthara

Nayanthara

దాదాపు ఇరవై ఏళ్లకుపైగా తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో తనదైన ముద్ర వేసిన నయనతార, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతోనూ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. ఇటీవల షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకోవడంతో ఆమె మార్కెట్ వాల్యూ, పాన్-ఇండియా క్రేజ్ మరింత పెరిగింది. దాంతో ఆమె డిమాండ్ కూడా పెరుగుతూ వస్తోంది. 

Also Read:  50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన సుమంత్, హీరోయిన్ తో అక్కినేని హీరో ప్రేమ, నిజమెంత?

Related Articles

Related image1
పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ? కారణం ఏంటి?
Related image2
నయనతార వల్ల 50 కోట్లు నష్టపోయిన నెట్‌ఫ్లిక్స్‌ ? అసలు సంగతి ఏంటంటే?
36
Test Movie

Test Movie

ఈ సక్సెస్ తర్వాత, నయనతార తన రెమ్యునరేషన్ బాగా పెంచేసిందట. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం, తన తదుపరి ప్రాజెక్టులకు ఏకంగా 20 కోట్లు డిమాండ్ చేస్తోందని టాక్. ఇది దక్షిణాదిలో ఏ నటికీ లేనంత ఎక్కువ. దీంతో ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె, ఆలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్స్‌ను కూడా నయనతార  దాటేస్తుందని అంటున్నారు.

Also Read: అభిషేక్ కంటే ముందు ఐశ్వర్య రాయ్ 7 ప్రేమకథలు, స్టార్ హీరోయిన్ ప్రేమించిన హీరోలు ఎవరో తెలుసా?

46
Nayanthara

Nayanthara

'జవాన్' సినిమా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ కావడమే నయనతార డిమాండ్‌కు కారణమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా చేరువైంది. ఎప్పుడూ కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటూ, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చే నయనతార తన స్టార్‌డమ్‌కు తగ్గట్టుగానే రెమ్యునరేషన్ తీసుకోవడంలో తప్పేముంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇక నయన్ రెమ్యునరేపన్ విషయంలో నిర్మాతలు మాత్రం భయపడుతున్నారు. 

Also Read:  నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన తార, 4 భాషల్లో 400 సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరు ?

56
Nayanthara, Prabhas

Nayanthara, Prabhas

అయితే నయనతార  రీసెంట్ గా నటించిన  కొన్ని తమిళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ, ఆమె స్టార్ ఇమేజ్, సినిమాకు ఆమె తెచ్చే పబ్లిసిటీని చూసి నిర్మాతలు ఆమె డిమాండ్‌కు ఒప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం నయనతార 'టెస్ట్', 'మన్నాంగట్టి సిన్స్ 1960' అనే తమిళ సినిమాల్లో నటిస్తోంది.

66
Nayanthara

Nayanthara

నయనతార రెమ్యునరేషన్ వార్తల్లో నిజమెంతో తెలియదు కాని.. అదేనిజం అయితే సౌత్ లో హీరోయిన్ల విషయంలో ఆమె ట్రెండ్ సెట్టర్ గా నిలవడం ఖాయం. లేడీ సూపర్‌స్టార్ తన డిమాండ్‌ను నెగ్గించుకుని, భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల జాబితాలో చేరుతుందో లేదో చూడాలి. గతంలో హీరోల డామినేషన్ ఉన్న టైమ్ లో  హీరోయిన్లు ఇచ్చినంత తీసుకునేవారు. కాని రానురాను మారుతున్న పరిస్థితులకు ఇది అద్దం పడుతుంది. హీరోయిన్లు కూడా హీరోలమాదిరి డిమాండ్ చేస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
నయనతార
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image2
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Recommended image3
Thrice Married Actresses: మూడు పెళ్లిళ్లు చేసుకున్న సౌత్ హీరోయిన్లు వీరే
Related Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ? కారణం ఏంటి?
Recommended image2
నయనతార వల్ల 50 కోట్లు నష్టపోయిన నెట్‌ఫ్లిక్స్‌ ? అసలు సంగతి ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved