MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 50 సెకండ్స్ సీన్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్, 40 ఏళ్లు దాటినా ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్ ఎవరు?

50 సెకండ్స్ సీన్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్, 40 ఏళ్లు దాటినా ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్ ఎవరు?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లకు మాత్రమే భారీ రెమ్యునరేషన్ ఉండేది. ఇప్పుడు సౌత్ హీరోయిన్లు కూడా భారీగా వసూలు చేస్తున్నారు బాలీవుడ్ ను బీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సౌతో లో అత్యధిక పారితోషికం అందుకునే నటి ఎవరో తెలుసా? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 12 2025, 08:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : Facebook / Nayanthara

ఒకప్పుడు హీరోల డామినేషన్

ఒకప్పుడు హీరోలకు మాత్రమే రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండేది. వారు కోట్లు తీసుకుంటున్న రోజుల్లో కూడా హీరోయిన్లు లక్షలతో సరిపెట్టుకున్న రోజులు ఉన్నాయి. కాని ఇప్పుడు హీరోలను మించి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు కొంత మంది హీరోయిన్లు. బాలీవుడ్ లో 20 నుంచి 30 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకునే తారలు ఉన్నారు. ఇక ఇప్పుడు సౌత్ లో కూడా హీరోయిన్ల రెమ్యునరేషన్ భారీగా పెరుగుతోంది. ఈక్రమంలో 40 ఏళ్ల ఓ హీరోయిన్ అయితే ఎప్పటికప్పుడు రేటు పెంచుతూ వస్తోంది. 50 సెకండ్ల సీన్ కోసమే 5 కోట్లు వసూలు చేసిందట సీనియర్ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

DID YOU
KNOW
?
ధనుష్ తో వివాదం
నయనతార పెళ్లి డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుష్ తో వివాదం కొనసాగుతోంది. ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీ ధాన్ సినిమా క్లిప్ ను ఆయన పర్మీషన్ లేకుండా తన పెళ్లి డాక్యుమెంటరీలో ఉపమోగించుకుంది నయన్, దాంతో ఈ విషయంలో కోర్టును ఆశ్రయించారు ధనుష్.
26
Image Credit : Asianet News

సౌత్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్

ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు నయనతార. కేరళకు చెందిన నయనతార మలయాళ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయన్ గా గుర్తింపు పొందింది. యాంకర్‌గా తన జీవితాన్ని ప్రారంభించి, ఆసక్తి లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నయనతార, ఆతరువాత కెరీర్ లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చింది. కెరీర్‌లో వచ్చిన బ్రేకప్స్ తర్వాత తాను పరిశ్రమను విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ, మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చి తన స్థానాన్ని నిలబెట్టుకుంది నయనతార. రజనీకాంత్, చిరంజీవి, షారుఖ్ ఖాన్, మోహన్‌లాల్ లాంటి పాన్ ఇండియా స్టార్లతో కలిసి నటించిన నయనతార, తెలుగు , తమిళ భాషలలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ఇటీవల బాలీవుడ్‌లో అడుగుపెట్టి భారీ విజయాన్ని సాధించింది. షారుక్ ఖాన్ జోడీగా ఆమె నటించిన జవాన్ సినిమా 1000 కోట్ల వసూళ్లు సాధించి, నార్త్ లో కూడా నయనతారను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది. ఆతరువాత అక్కడ సినిమాలేవి చేయకపోయినా.. నయనతార ఇమేజ్ మాత్రం భారీగా పెరిగిపోయింది.

Related Articles

Related image1
నయనతార ఇంత పని చేసిందా? విగ్నేష్ శివన్ పై లేడీ సూపర్ స్టార్ పోస్ట్ లో నిజమెంత?
Related image2
నయనతార చెల్లెలు దగ్గర క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న హీరో శింబు
36
Image Credit : Instagram / Nayanthara

50 సెకండ్స్ యాడ్ కు 5 కోట్లు?

ఇప్పటి వరకు బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్లు మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారనే అపోహను చెరిపేసింది సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార. రెమ్యునరేషన్ విషయంలో ఎప్పటకప్పుడు ఆమె పెంచుకుంటూ వెళ్లున్నట్టు తెలుస్తోంది. ఒక్క సినిమాకు ఆమె 15 కోట్లకుపైగా వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఆమధ్య కాలంలో నయనతార చేసిన 50 సెకన్ల టీవీ ప్రకటన కోసం రూ.5 కోట్లు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇది హై ఎండోర్స్‌మెంట్ డీల్‌గా గుర్తించవచ్చు. టాటా స్కై కోసం నయనతార ఈ ప్రకటనలో నటించింది. అయితే ఆమె రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ లేదు.

46
Image Credit : Instagram / Nayanthara

నయనతార ఆస్తులు, సంపాదన

ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో 2018లో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ నటి నయనతార. 20 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 75కి పైగా చిత్రాల్లో నటించి అనేక అవార్డులు అందుకుంది. తన సినిమా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసినా.. ఆర్ధికంగా మాత్రం పక్కా ప్లాన్ తో వెళ్తోంది నయన్. సినమాల ద్వారా తాను సంపాదించిన డబ్బును వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతోంది. తాను కూడా సొంతంగా కొన్ని వ్యాపారాలు స్టార్ట్ చేసింది. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంది బ్యూటీ. అంతే కాదు సౌత్ తో ప్రైవేట్ జట్ కలిగిన హీరోయిన్ గా రికార్డ్ సాధించింది నయనతార. నటనతో పాటు నిర్మాతగా కూడా మారింది నయన్, రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను నడిపిస్తూ పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించింది నయనతార.

56
Image Credit : Instagram / Nayanthara

ప్రేమ పెళ్లి పిల్లలు

స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న టైమ్ లోనే రెండు సార్లు ప్రేమలో పడిన నయన్, రెండు బ్రేకప్స్ తో ఇండస్ట్రీలో కనిపించకుండాపోతుంది అనుకున్నారంతా. ఎందుకంటే నయన్ రెండు ప్రేమలు వివాదాస్పదం అయ్యాయి. శింబుతో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అది అయిపోయిన తరువాత స్టార్ కొరియోగ్రఫర్ ప్రభుదేవాతో పెళ్లికి రెడీ అయ్యింది నయన్. కాని ప్రభుదేవ భార్య చేసిన గొడవల కారణంగా వీరి బంధం తెగిపోయింది. ఆ తరువాత కొంత కాలానికి దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిన ఆమె, దాదాపు 5 ఏళ్ళు రిలేషన్ లో ఉంది. ఆతరువాత విఘ్నేష్ ను వివాహం చేసుకున్న నయనతార, సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చింది.

66
Image Credit : Instagram / Nayanthara

ధనుష్ తో వివాదం

తన పెళ్లిని డాక్యుమెంటరీగా తెరకెక్కించడానికి ఓ ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌తో డీల్ కుదుర్చుకుని ఏకంగా రూ.25 కోట్లు సంపాదించింది నయనతార. ఈ డాక్యుమెంటరీ విషయంలో కూడా వివాదంగా మారింది నటి. విఘ్నేష్ తో ప్రేమలో పడ్డ నానుమ్ రౌడీ థాన్ సినిమాలోని క్లిప్ ను తన డాక్యుమెంటరీలో పర్మీషన్ లేకుండా వాడటంతో, ఈ సినిమా నిర్మాత ధనుష్ ఈ విషయంలో లీగర్ లో ప్రొసీడ్ అయ్యారు. దాంతో ధనుష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది నయన్. ఆ వివాదం ఇంకా కోర్డులో కొనసాగుతూనే ఉంది. ఇదొక్కటే కాదు సరోగసి విషయంలో కూడా వివాదం అయ్యింది నయనతార. ఇండస్ట్రీలో మరికొన్ని విషయాల్లో ఆమె తీరు వివాదాలకు దారి తీసింది. ఇలా 40 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, స్టార్ ఇమేజ్ ను కొనసాగిస్తోంది నయనతార. ప్రస్తుతం ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడీగా అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Recommended image2
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Recommended image3
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌
Related Stories
Recommended image1
నయనతార ఇంత పని చేసిందా? విగ్నేష్ శివన్ పై లేడీ సూపర్ స్టార్ పోస్ట్ లో నిజమెంత?
Recommended image2
నయనతార చెల్లెలు దగ్గర క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న హీరో శింబు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved