MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ పుష్ప సినిమాలో షెకావత్ పాత్రను మిస్ అయిన యంగ్ హీరో ఎవరో తెలుసా?

అల్లు అర్జున్ పుష్ప సినిమాలో షెకావత్ పాత్రను మిస్ అయిన యంగ్ హీరో ఎవరో తెలుసా?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పుష్ప సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలను మిస్ అయిన నటులు చాలామంది ఉన్నారు. వారిలో షెకావత్ క్యారెక్టర్ ను మిస్ అయిన యంగ్ హీరో ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 27 2025, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Pushpa2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప', పుష్ప 2'. ఈ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో విజయం సాధించాయి. దర్శకుడు సుకుమార్ తన మార్క్ తో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్‌టైనర్లు ప్రేక్షకుల్ని పూర్తిగా ఆకట్టుకున్నాయి. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ఎంత అద్భుతంగా నటించాడో, నాగవల్లిగా అంతకు మించిన యాక్టింగ్ చేసింది హీరోయిన్ రష్మిక మందన్న.

25
Image Credit : Nara Rohith Missed Fahadh Faasils Role in Pushpa

అయితే ఈ సినిమాలో ప్రత్యేకించి విలన్ పాత్రలో నటించిన మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ తన నటనతో పాన్ ఇండియాను మెప్పించాడు. టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్యారెక్టర్ కు ఆయన అయితేనే న్యాయం చేస్తాడు అనేట్టుగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు ఫహాద్. అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం షెకావత్ పాత్ర చేయాల్సింది ఫహాద్ కాదని తెలుస్తోంది.

Related Articles

Related image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Related image2
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
35
Image Credit : our own

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఫహాద్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను ముందుగా టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కు ఆఫర్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా నారా రోహిత్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ఎందుకో ఆయన ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేయలేకపోయారు. దాంతో ఈ పాత్ర ఫహాద్ ఫాజిల్ చేతిలోకి వెళ్లింది. ఆ పాత్రలో తనదైన ముద్రవేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు మలయాళ హీరో.

45
Image Credit : Nara Rohith Missed Fahadh Faasils

ఈ వార్త తెలిసిన తర్వాత నారా రోహిత్ అభిమానులు కొంత వరకూ నిరాశ చెందారు ఎందుకంటే 'పుష్ప'లాంటి భారీ బ్లాక్ బస్టర్ లో ముఖ్యమైన పాత్రను పోషించడానికి అవకాశం వస్తే వదులుకున్నాడేంటి అని గుసగుసలాడుకుంటున్నారు. ఇక తాజాగా భైరవం' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు రోహిత్. ఈ సినిమాలో అతని పాత్ర అంద్భుతంగా ఉందని ప్రశంసలు వినిపిస్తున్నాయి.

55
Image Credit : our own

యాక్టింగ్ కు చాలా గ్యాప్ ఇచ్చిన నారా రోహిత్ రీసెంట్ గా మళ్లీ యాక్టీవ్ అవుతున్నాడు. వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ఇక నారా రోహిత్ భవిష్యత్తు ప్రాజెక్టులపై అభిమానుల్లో కూడా నమ్మకం పెరిగింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved