MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాంబు పేల్చిన నాగార్జున.. మన్మథుడు హిట్ సినిమా కాదు, ఆ నిజాలు నాకే తెలుసు

బాంబు పేల్చిన నాగార్జున.. మన్మథుడు హిట్ సినిమా కాదు, ఆ నిజాలు నాకే తెలుసు

నాగార్జున కెరీర్ లో బెస్ట్ చిత్రాలలో మన్మథుడు ఒకటి. కానీ అసలు ఆ మూవీ హిట్ సినిమానే కాదు అంటూ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 12 2025, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నాగార్జున కెరీర్ లో క్లాసిక్ మూవీగా మన్మథుడు
Image Credit : Asianet News

నాగార్జున కెరీర్ లో క్లాసిక్ మూవీగా మన్మథుడు

కింగ్ నాగార్జున కెరీర్ బెస్ట్ చిత్రాల లిస్టులో మన్మథుడు చిత్రం తప్పకుండా ఉంటుంది. ఈ చిత్రం కె విజయభాస్కర్ దర్శకత్వం లో, త్రివిక్రమ్ రచనలో రూపొందింది. మన్మథుడు చిత్రాన్ని నాగార్జున స్వయంగా తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. నాగార్జున కెరీర్ లోనే మన్మథుడు చిత్రం ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది.

25
మన్మథుడు చిత్రంలో అలరించిన అంశాలు 
Image Credit : SOCIAL MEDIA

మన్మథుడు చిత్రంలో అలరించిన అంశాలు 

ఈ చిత్రంలో నాగార్జునకి జోడిగా సోనాలి బింద్రే, అన్షు అంబానీ నటించారు. టైటిల్ కి తగ్గట్లుగానే ఈ చిత్రంలో నాగార్జున మన్మథుడిలా కనిపించారు. హీరోయిన్లతో నాగార్జున కెమిస్ట్రీ, కామెడీ సన్నివేశాలు, దేవి శ్రీ సంగీతం, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్క అంశం ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టాయి. ఆడవాళ్లు అంటే ఇష్టం లేని మేనేజర్ పాత్రలో నాగార్జున నటన భలే గమ్మత్తుగా ఉంటుంది.

Related Articles

Related image1
నీ అంత గొప్ప డ్యాన్సర్ ని కాదు నేను, కొంచెం తగ్గు అంటూ స్టార్ హీరోయిన్ కి చురకలంటించిన చిరంజీవి
Related image2
అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన మిస్టేక్ వల్ల అట్టర్ ఫ్లాప్ అయిన అల్లు అర్జున్ మూవీ, అలా ఎలా జరిగింది ?
35
మన్మథుడు అసలు హిట్ సినిమానే కాదు
Image Credit : SOCIAL MEDIA

మన్మథుడు అసలు హిట్ సినిమానే కాదు

మన్మథుడు చిత్రం బ్లాక్ బస్టర్ మూవీ అని ఆడియన్స్ ఇప్పటివరకు అనుకుంటూ వచ్చారు. కానీ నాగార్జున ఓ ఇంటర్వ్యూలో అసలు మన్మథుడు మూవీ హిట్ సినిమానే కాదు అంటూ బాంబు పేల్చారు. నాగార్జున నుంచి ఇది షాకింగ్ స్టేట్మెంట్ అనేది చెప్పాలి. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ మన్మథుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది అని ప్రశ్నించారు.

45
ఆడియన్స్ అలా అనుకున్నారు 
Image Credit : our own

ఆడియన్స్ అలా అనుకున్నారు 

నాగార్జున స్పందిస్తూ.. ఫస్ట్ మీ స్టేట్మెంట్ ని కరెక్ట్ చేయాలనుకుంటున్నా. మన్మథుడు మూవీ అసలు హిట్ సినిమా కాదు. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు అది ఒక అబౌ యావరేజ్ చిత్రం మాత్రమే. కానీ కొన్నేళ్ల పాటు ఆ చిత్రం టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత ఆడియన్స్ కి ఇంకా విపరీతంగా నచ్చేసింది, దీంతో ఆడియన్స్ ఆ మూవీ బ్లాక్ బస్టర్ సినిమా అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు.

55
ఆ లెక్కలు నాకే బాగా తెలుసు 
Image Credit : our own

ఆ లెక్కలు నాకే బాగా తెలుసు 

వాస్తవానికి రెవెన్యూ పరంగా మన్మథుడు చిత్రం సూపర్ హిట్ కాలేదు. ఆ చిత్రానికి నేనే నిర్మాతను కాబట్టి ఆ లెక్కలు నాకే బాగా తెలుసు అని సంచలనం వ్యాఖ్యలు చేశారు. మన్మథుడు కంటే ముందుగా వచ్చిన సంతోషం చిత్రం వసూళ్ల పరంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని నాగార్జున తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth MGR: రజినీ జీవితాన్ని మార్చేసిన ఎంజీఆర్ 'మాస్టర్ ప్లాన్'! ఆ స్టైల్ ఎందుకంత నచ్చలేదంటే?
Recommended image2
Zero Flop Record: ఫ్లాప్ ఎరుగని హీరో.. చేసిన 3 సినిమాలు బ్లాక్‌బస్టర్.. ఎవరో తెలుసా?
Recommended image3
Funky First Review: `ఫంకీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లో నవ్వుల సునామీ.. కానీ మైనస్‌ ఏంటంటే?
Related Stories
Recommended image1
నీ అంత గొప్ప డ్యాన్సర్ ని కాదు నేను, కొంచెం తగ్గు అంటూ స్టార్ హీరోయిన్ కి చురకలంటించిన చిరంజీవి
Recommended image2
అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన మిస్టేక్ వల్ల అట్టర్ ఫ్లాప్ అయిన అల్లు అర్జున్ మూవీ, అలా ఎలా జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved