MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nagarjuna: కోడలు శోభితా ప్రెగ్నెన్సీపై నాగార్జున రియాక్షన్‌ ఇదే, తాత కావడంపై హింట్‌.. రూ.2కోట్ల విరాళం

Nagarjuna: కోడలు శోభితా ప్రెగ్నెన్సీపై నాగార్జున రియాక్షన్‌ ఇదే, తాత కావడంపై హింట్‌.. రూ.2కోట్ల విరాళం

అక్కినేని కోడలు, హీరోయిన్‌, నాగ చైతన్య భార్య శోభిత ప్రెగ్నెంట్‌ అయ్యిందని, త్వరలోనే అక్కినేని వారసులు రాబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాగార్జున స్పందించారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 18 2025, 08:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శోభితా ప్రెగ్నెంట్ వార్తలు వైరల్‌
Image Credit : instagram/@sobhitad

శోభితా ప్రెగ్నెంట్ వార్తలు వైరల్‌

నాగార్జున త్వరలో తాత కాబోతున్నాడని, శోభిత ప్రెగ్నెంట్‌ అయ్యిందని, త్వరలో నాగచైతన్య తండ్రి కాబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ మధ్య శోభిత ధరించిన దుస్తులను చూసి నెటిజన్లు ఈ అభిప్రాయానికి వచ్చారు. సాధారణంగా ట్రెండీ దుస్తుల్లో కనిపించే శోభితా ట్రెడిషనల్‌ డ్రెసెస్‌లో కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్‌ అని భావించారు. త్వరలోనే గుడ్‌ న్యూస్‌ రాబోతుందనే ప్రచారం జరిగింది. దీనిపై నాగార్జున స్పందించారు.

25
కోడలు శోభితా ప్రెగ్నెంట్‌పై నాగార్జున రియాక్షన్‌ ఇదే
Image Credit : Asianet News

కోడలు శోభితా ప్రెగ్నెంట్‌పై నాగార్జున రియాక్షన్‌ ఇదే

నాగార్జున ఇటీవల గుడివాడ ఏఎన్నార్‌ కాలేజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా నుంచి ఆయనకు ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. త్వరలో మీరు తాత కాబోతున్నారని తెలుస్తోంది, దీనిపై మీ రియాక్షన్‌ ఏంటని మీడియా ప్రశ్నించగా, మొదట దాటవేశారు నాగార్జున. మళ్లీ అదే ప్రశ్న ఎదురు కావడంతో ఇక తప్పలేదు. ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు. ఆ వార్తలను ఆయన ఖండించలేదు. సమయం వచ్చినప్పుడు తానే ఆ విషయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు నాగార్జున.

Related Articles

Related image1
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
Related image2
హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
35
నాగ చైతన్య, శోభిత పేరెంట్స్ కాబోతున్నట్టు హింట్ ఇచ్చిన నాగ్‌
Image Credit : our own

నాగ చైతన్య, శోభిత పేరెంట్స్ కాబోతున్నట్టు హింట్ ఇచ్చిన నాగ్‌

సాధారణంగా రూమర్లని ఖండిస్తారు. అలాంటి వార్తల్లో నిజం లేదని చెబుతారు. కానీ ఆ సమాధానం దాటవేయడం, సమయం వచ్చినప్పుడు తానే ప్రకటిస్తానని చెప్పడంలోనే అసలు నిజం దాగుంది. ఇప్పుడు శోభితా ప్రెగ్నెంట్‌గానే ఉందనే విషయాన్ని నాగార్జున చెప్పకనే చెప్పారు. త్వరలో తాను తాత కాబోతున్నానే విషయాన్ని ఆయన పరోక్షంగా హింట్‌ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ లెక్కన నాగ చైతన్య త్వరలో తండ్రి కాబోతున్నారని, శోభితా పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుందని, మొత్తంగా అక్కినేని ఫ్యామిలీలోకి వారసులు రాబోతున్నారని చెప్పొచ్చు.

45
గతేడాది శోభిత, చైతూ పెళ్లి
Image Credit : our own

గతేడాది శోభిత, చైతూ పెళ్లి

ఇదిలా ఉంటే నాగ చైతన్య, శోభిత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. గతేడాది డిసెంబర్‌ 4న వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందు సమంతతో చైతూకి మ్యారేజ్‌ జరిగిన విషయం తెలిసిందే. అది కూడా ప్రేమ పెళ్లినే. కానీ నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత శోభిత ప్రేమలో పడ్డాడు నాగచైతన్య. గతేడాది మ్యారేజ్‌ చేసుకున్నారు. పెళ్లి తర్వాత శోభితా సినిమాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు నాగచైతన్య ప్రస్తుతం `వృషకర్మ` అనే చిత్రంలో నటిస్తున్నాడు. భారీ స్థాయిలో ఈ మూవీ రూపొందుతుంది.

55
ఏఎన్నార్‌ కాలేజీకి రెండు కోట్ల విరాళం
Image Credit : Asianet News

ఏఎన్నార్‌ కాలేజీకి రెండు కోట్ల విరాళం

ఇక నాగార్జున బుధవారం ఏఎన్‌ఆర్‌ కాలేజీకి భారీ విరాళం ప్రకటించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్‌ కాలేజీ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున కాలేజీకి రెండు కోట్ల విరాళం ప్రకటించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులైన అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ అక్కినేని జ్ఞాపకార్థం అక్కినేని కుటుంబం ఏఎన్ఆర్ కళాశాలలో 2 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ నిర్ణయం తాను, తన సోదరి సుశీల, సోదరుడు వెంకట్, మొత్తం ఏఎన్ఆర్ కుటుంబం కలిసి తీసుకున్నట్లు తెలిపారు. `ఈ నిధిని సరైన పద్ధతిలో అమలు చేయడానికి మేము ఏఎన్ఆర్ కళాశాల యాజమాన్యంతో కలిసి పని చేస్తాము. సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఈ సంస్థకు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు, ఆయన వారసత్వాన్ని కొనసాగించడం మా బాధ్యత` అని తెలిపారు నాగ్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Surekha Vani కి రెండో పెళ్లి, కూతురు సుప్రీత ప్లాన్‌.. ఆఫర్స్ లేవంటూ ఆవేదన
Recommended image2
ఫస్ట్ టైమ్‌ డేట్‌కి వెళ్తున్నారా? ఈ 7 బెస్ట్ రొమాంటిక్ సినిమాలు చూడండి
Recommended image3
Sonam Kapoor Baby Shower: సోనమ్ కపూర్ సీమంతం వేడుక.. గెస్ట్ లు ఎవరెవరో తెలుసా, వైరల్ ఫోటోస్
Related Stories
Recommended image1
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
Recommended image2
హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved